STOCKS

News


ఎస్‌బీఐ నష్టాలు @ రూ.4,876 కోట్లు

Friday 10th August 2018
news_main1533891470.png-19123

ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసిక (ఏప్రిల్‌-జూన్‌, క్యూ1) ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. బ్యాంక్‌ రూ.4,876 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. ఇక నికర వడ్డీ ఆదాయం రూ.21,798 కోట్లుగా నమోదయ్యింది. స్థూల ఎన్‌పీఏలు 10.69 శాతంగా, నికర ఎన్‌పీఏలు 5.29 శాతంగా ఉన్నాయి. గత త్రైమాసికంలో స్థూల ఎన్‌పీఏలు 10.91 శాతంగా , నికర ఎన్‌పీఏలు 5.73 శాతంగా ఉన్నాయి. త్రైమాసికం పరంగా చూస్తే ఎన్‌పీఏలు స్వల్పంగా తగ్గాయి. కేటాయింపులు త్రైమాసికం పరంగా రూ.28,096 కోట్ల నుంచి రూ.19,228 కోట్లకు తగ్గాయి. అదే వార్షికంగా రూ.8,929 కోట్ల నుంచి రూ.19,228 కోట్లకు పెరిగాయి. బ్యాంక్‌ ఇతర ఆదాయం రూ.6,679 కోట్లుగా ఉంది. 

ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో మధ్యాహ్నాం 2:23 సమయంలో ఎస్‌బీఐ బ్యాంక్‌ షేరు 1.24 శాతం పెరుగుదలతో రూ.321 వద్ద ఉంది.  


SBI

You may be interested

లాభాల బాటలో ఆటో షేర్లు

Friday 10th August 2018

ముంబై:- మిడ్‌సెషన్‌ సమయానికి సూచీలు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నప్పటికీ..,  ఆటో రంగ షేర్లు మాత్రం లాభాల బాటపట్టాయి. ఎన్‌ఎస్‌ఈ అటో రంగ సూచీలకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్‌ నేటి ఇంట్రాడేలో 1శాతం వరకూ ర్యాలీ చేసింది. సూచీలోని ఐషర్‌ మోటర్స్‌ (5శాతం), మహీంద్రా అండ్‌ మహీం‍ద్రా (2శాతం) లాభపడంతో ఈ రంగానికి చెందిన షేర్లు లాబాల బాట పట్టాయి. మధ్యాహ్నం గం.2:30ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(10814)తో పోలిస్తే అరశాతం

ఈ రెండు స్టాక్స్‌ కొనొచ్చు: సెంట్రమ్‌

Friday 10th August 2018

సెం‍ట్రమ్‌.. బజాజ్‌ ఆటో, హిందుస్తాన్‌ జింక్‌ స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. వీటిని ఒకసారి పరిశీలిస్తే.. స్టాక్‌: బజాజా ఆటో ఇండస్ట్రీ: ఆటోమొబైల్‌ రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.2,656 టార్గెట్‌ ప్రైస్‌: రూ.3,188 సెంట్రమ్‌.. బజాజ్‌ ఆటోపై బై రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. కంపెనీ మార్కెట్‌ వాటాపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిందని తెలిపింది. మార్కెట్‌లో 20 శాతానికి పైగా వాటాను సొంతం చేసుకునే దాకా పలు ప్రొడక్టులను తక్కువ ధరకే కస్టమర్లకు అందుబాటులో ఉంచుతామని పేర్కొంది.

Most from this category