News


25,000 కోట్ల సమీకరణ!

Tuesday 23rd October 2018
news_main1540269743.png-21375

ముంబై: ప్రభుత్వ బ్యాంకింగ్‌ దిగ్గజం- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19) రూ.25,000 కోట్లు సమీకరించడానికి కసరత్తు చేస్తోంది. ఇందులో రూ.5,000 కోట్లు బాండ్ల (బాసెల్‌ 3 టైర్‌ టూ బాండ్స్‌) ద్వారా సమీకరించాలన్నది ప్రణాళిక. క్యాపిటల్‌ అడిక్వెసీ (మూలధన) నిబంధనల ప్రమాణాలకు ధీటుగా ఈ నిధులను సమీకరించనున్నట్లు ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో బ్యాంక్‌ తెలిపింది. తమ ఈ రెండు ప్రతిపాదనకు ఇప్పటికే బ్యాంక్‌ సెంట్రల్‌ బోర్డ్‌ ఆమోదముద్ర వేసినట్లు కూడా ఎస్‌బీఐ వెల్లడించింది. ఈ ప్రతిపాదనల ప్రకారం...
♦ పబ్లిక్‌ ఆఫర్‌ లేదా ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ ద్వారా దేశీయ లేదా విదేశీ ఇన్వెస్టర్ల నుంచి రూపాయిలు లేదా డాలర్లలో రూ.5,000 కోట్ల వరకూ బ్యాంక్‌ నిధులు సమీకరించనుంది. 
♦ ఇక రూ.20,000 కోట్ల ఈక్విటీ క్యాపిటల్‌ సమీకరణ రెండవ అంశం. ఎఫ్‌పీఓ, క్యూఐపీ, ప్రిఫరెన్షియల్‌ అలాట్‌మెంట్‌, రైట్స్‌ ఇష్యూ లేదా ఇతర విధానాలు లేదా పైన పేర్కొన్న అన్ని విధానాల ద్వారా తగిన సమయంలో రూ.20,000 కోట్లను మార్కెట్‌ ద్వారా ఎస్‌బీఐ సమీకరిస్తుంది. 

సిండికేట్‌ బ్యాంక్‌కు రూ.728 కోట్లు....
ప్రభుత్వ రంగంలోని సిండికేట్‌ బ్యాంక్‌ ప్రభుత్వం నుంచి రూ.728 కోట్ల తాజా మూలధనం పొందింది. ఈ మేరకు బ్యాంక్‌ సోమవారం ఒక ప్రకటన చేసింది. షేర్ల ప్రిఫరెన్షియల్‌ కేటాయింపుల ద్వారా ఈ నిధులు పొందినట్లు ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. 
త్వరలో సెంట్రల్‌బ్యాంక్‌కూ...
సెంట్రల్‌ బ్యాం‍క్‌ ఆఫ్‌ ఇండియా కూడా ప్రభుత్వానికి ప్రిఫరెన్షియల్‌ అలాట్‌మెంట్‌ మార్గంలో షేర్లు కేటాయించి రూ.2,354 కోట్లు పొందనుంది. నవంబర్‌ 13న జరిగిన అసాధారణ వాటాదారుల సమావేశంలో ఇందుకు సంబంధించి ఆమోదం పొందనున్నట్లు బ్యాంక్‌ గతవారం పేర్కొంది. 
రూ.2.1 లక్షల కోట్లలో భాగమే!
2017-18, 2018-19లో ప్రభుత్వ రంగ బ్యాంకులకు తాజా మూలధనంగా రూ.2.1 లక్షల కోట్లను సమకూర్చనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇందులో భాగంగానే బ్యాంకులు తాజా మూలధనాన్ని పొందుతున్నాయి.  20 ప్రభుత్వ రంగ బ్యాంకులు 2017-18లో రూ.88,139 కోట్లను పొందాయి. 2018-19లో రూ.65,000 కోట్లు పొందనున్నాయి. ప్రణాళికలో భాగంగా రూ. రూ.58,000 కోట్లను మార్కెట్‌ ద్వారా బ్యాంకులు సమీకరించుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది జూలైలో ఐదు బ్యాంకులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పొందనున్న మూలధనంలో భాగంగా మొత్తం రూ.11,336 కోట్లను పొందాయి. వీటిలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (రూ.2,816కోట్లు), అలహాబాద్‌ బ్యాం‍క్‌ (రూ.1,790 కోట్లు), ఆంధ్రాబ్యాంక్‌ (రూ.2,019 కోట్లు), ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌ (రూ.2,157 కోట్లు), కార్పొరేషన్‌ బ్యాంక్‌ (రూ.2,555 కోట్లు) ఉన్నాయి. 


SBI

You may be interested

గాయత్రి ప్రాజెక్ట్స్‌కు రూ.404 కోట్ల ఆర్డర్లు

Tuesday 23rd October 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: నిర్మాణ రంగ సంస్థ గాయత్రి ప్రాజెక్ట్స్ రూ.404 కోట్ల విలువైన పలు ఆర్డర్లను దక్కించుకుంది. బిహార్‌ స్టేట్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నుంచి కంపెనీ ఈ ఈపీసీ కాంట్రాక్టులను పొందింది.   

రూపీ పతనం

Tuesday 23rd October 2018

ఇండియన్‌ రూపాయి మంగళవారం కూడా బలహీనపడింది. ఆసియా కరెన్సీలు మిశ్రమంగా ఉండటం ఇందుకు కారణం. ఉదయం 9:15 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 73.73 వద్ద ట్రేడవుతోంది. రూపాయి తన సోమవారం ముగింపు 73.56తో పోలిస్తే 0.23 శాతం నష్టపోయింది. రూపాయి మంగళవారం 73.70 వద్ద ప్రారంభమైంది.   భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 7.935 శాతంగా ఉన్నాయి. బాండ్‌ ఈల్డ్స్‌ మునపటి ముగింపు 7.93 శాతంగా ఉంది. బాండ్‌

Most from this category