STOCKS

News


ఎస్‌బీఐ, ఓబీసీ మొండిబకాయిల విక్రయం

Monday 11th February 2019
news_main1549867393.png-24126

- రూ. 5,740 కోట్లు రాబట్టుకునేందుకు కసరత్తు
న్యూఢిల్లీ: సుమారు రూ. 5,740 కోట్ల బాకీలను రాబట్టుకునే క్రమంలో వాటికి సంబంధించిన మొండిపద్దులను విక్రయించడంపై ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) దృష్టి సారించాయి. సుమారు రూ. 4,975 కోట్ల రికవరీకోసం అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీలు (ఏఆర్‌సీ), ఆర్థిక సంస్థల నుంచి బిడ్లు ఆహ్వానిస్తూ ఎస్‌బీఐ ప్రకటన విడుదల చేసింది. వీటిలో సింహభాగం వాటా (సుమారు రూ. 4,667 కోట్లు) చిన్న, మధ్య తరహా సంస్థలదే ఉంది. ఎక్కువగా రూ. 50 కోట్ల దాకా బాకీపడిన సంస్థలు దాదాపు 281 దాకా ఉన్నాయి. మరోవైపు, 13 ఖాతాల నుంచి రూ. 764.44 కోట్లు రాబట్టుకునేందుకు ఓబీసీ కూడా బిడ్లను ఆహ్వానించింది. విక్రయించబోయే ఖాతాల్లో మిట్టల్ కార్పొరేషన్ (రూ. 207 కోట్లు), జయస్వాల్ నెకో ఇండస్ట్రీస్ (రూ. 157 కోట్లు) మహాలక్ష్మి టీఎంటీ (రూ. 78 కోట్లు) మొదలైనవి ఉన్నాయి. ఎస్‌బీఐ ఖాతాలకు సంబంధించి ఈ-బిడ్డింగ్ ఫిబ్రవరి 27న, ఓబీసీ ఖాతాలకు ఫిబ్రవరి 25న జరగనుంది.



You may be interested

సిటీ గ్యాస్‌ బిడ్డింగ్‌లో ఐవోసీ టాప్‌

Monday 11th February 2019

న్యూఢిల్లీ: నగరాల్లో గృహాలకు పైపుల ద్వారా వంట గ్యాస్‌, వాహనాలకు సీఎన్‌జీ సరఫరా కోసం నిర్వహించిన పదో విడత లైసెన్సుల వేలంలో ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) అత్యధిక స్థాయిలో బిడ్లు దాఖలు చేసింది. అదానీ గ్రూప్‌, హిందుస్తాన్ పెట్రోలియం, ఇంద్రప్రస్థ గ్యాస్ మొదలైనవి ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. పెట్రోలియం, గ్యాస్ రంగ నియంత్రణ సంస్థ (పీఎన్‌జీఆర్‌బీ) వెల్లడించిన వివరాల ప్రకారం ఐవోసీ మొత్తం 35

గణాంకాలే దిక్సూచి..!

Monday 11th February 2019

 మంగళవారం రిటైల్‌ ద్రవ్యోల్బణం, ఐఐపీ గణాంకాలు గురువారం టోకు ద్రవ్యోల్బణం డేటా వెల్లడి.. ఈవారంలోనే యూఎస్‌ రిటైల్ సేల్స్‌, చైనా ద్రవ్యోల్బణం, జపాన్‌ ఐఐపీ డేటా సన్‌ ఫార్మా, హిందాల్కో, ఇండియా సిమెంట్స్‌, ఐషర్‌ మోటార్స్‌, బాటా ఇండియా ఫలితాలు ముంబై: అంతర్జాతీయ పరిణామాలు, స్థూల ఆర్థిక గణాంకాల వెల్లడి, డిసెంబర్‌ త్రైమాసికానికి పలు కార్పొరేట్‌ రంగ సంస్థలు ప్రకటించనున్న ఫలితాలు ఈ వారంలో దేశీ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు

Most from this category