STOCKS

News


జెట్‌ ఎయిర్‌వేస్‌ ఖాతాలపై ఎస్‌బీఐ ఫోరెన్సిక్‌ ఆడిట్‌

Saturday 15th December 2018
news_main1544849552.png-22958

ముంబై: తీవ్ర ఆర్థిక సమస్యల్లో ఉన్న జెట్‌ ఎయిర్‌వేస్‌ ఖాతాలపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌కు ఎస్‌బీఐ ఆదేశించింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ బ్యాంకుల నుంచి రూ.8,000 కోట్లకు పైగా రుణాలను తీసుకోగా, ఎస్‌బీఐ లీడ్‌ బ్యాంకర్‌గా ఉంది. చమురు ధరల పెరుగుదలతో జెట్‌ ఎయిర్‌వేస్‌ గత మూడు త్రైమాసికాలుగా రూ.1,000 కోట్లకు పైగా నష్టాలను నమోదు చేస్తోంది. తీవ్ర స్థాయిలో నిధుల కటకటను ఎదుర్కొంటున్న ఈ సంస్థ తాజా నిధుల సమీకరణ యత్నాలను కూడా చేస్తుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో 2014 ఏప్రిల్‌ నుంచి 2018 మార్చి 31 వరకు జెట్‌ ఎయిర్‌వేస్‌ ఖాతాలపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించాలని ఎస్‌బీఐ నిర్ణయించడం గమనార్హం. జెట్‌ ఎయిర్‌వేస్‌ ఖాతాల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఓ ప్రజావేగు ఇచ్చిన సమాచారంతో ఎస్‌బీఐ ఫోరెన్సిక్‌ ఆడిట్‌కు ఆదేశించినట్టు సమాచారం. అంతేకాదు, ఈఅండ్‌వై సంస్థ ఇప్పటికే దీన్ని ప్రారంభించినట్టు బ్యాంకు వర్గాలు తెలిపాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రమోటర్‌ నరేష్‌ గోయల్‌ రూ.5,000 కోట్లను మింగేసినట్టు ఆరోపణలు కూడా వచ్చాయి. సెప్టెంబర్‌ క్వార్టర్‌ నాటికి ఈ సంస్థ రుణ భారం రూ.8,052 కోట్లుగా ఉంది. 



You may be interested

ఆకలిగా ఉందా? లాగించెయ్‌!

Saturday 15th December 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మెట్రో నగరాల్లో పిజ్జాలు, బర్గర్లు కామన్‌! మరి, ఇవి ఎంత వరకు హైజెనిక్‌? పోనీ, ఆర్గానిక్‌ ఫుడ్‌తో లాగించేద్దామంటే ముంబైవాసి హితేష్‌ అహుజాకి నాలుకకి రుచించలేదు. అంతే! చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి.. ప్యాకేజ్డ్‌ పిజ్జా అండ్‌ మామోస్‌ స్టార్టప్‌ ‘యమ్‌లేన్‌’ను ప్రారంభించేశాడు. ప్యాకేజీల్లో వచ్చే పిజ్జా, మోమోస్‌ను అప్పటికప్పుడు ఓవెన్‌ లేదా పెనంపై వేడి చేసుకుని తినగలగటమే యమ్‌లేన్‌ ప్రత్యేకత. ఫ్లిప్‌కార్ట్‌ కో–ఫౌండర్‌ బిన్నీ బన్సల్‌ నుంచి

22 పైసలు పతనమైన రూపాయి

Saturday 15th December 2018

ముంబై: డాలర్‌తో రూపాయి విలువ శుక్రవారం 22 పైసలు నష్టపోయింది. అంతర్జాతీయంగా డాలర్‌ బలపడటం, స్టాక్‌ మార్కెట్‌ బలహీనంగా ఉండటంతో రూపాయి డీలా పడిందని నిపుణులు పేర్కొన్నారు. ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అధ్యక్షతన ఆర్‌బీఐ డైరెక్టర్ల సమావేశం శుక్రవారం జరగడంతో ఫారెక్స్‌ మార్కెట్లో అప్రమత్తత నెలకొన్నదని ట్రేడర్లు తెలిపారు.  ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం నష్టాల్లో ప్రారంభమైంది. గురువారం 71.68 వద్ద ముగిసిన రూపాయి శుక్రవారం 12

Most from this category