STOCKS

News


ఈ ఏడాది లాభాల్లోకి వస్తాం

Saturday 25th August 2018
news_main1535171184.png-19619

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లాభాలను ఆర్జిస్తామని బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తెలిపింది. జూన్‌ త్రైమాసికంలో బ్యాంకు రూ.4,876 కోట్ల నికర నష్టాలను మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.2,006 కోట్ల లాభాలను ఆర్జించింది. 2018-19 సెప్టెంబరు త్రైమాసికం అనంతరం నుంచి లాభాలను చూస్తామని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ శుక్రవారం వెల్లడించారు. హైదరాబాద్‌లో బ్యాంకు నిర్వహించిన సీఎస్‌ఆర్‌ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రానిబాకీల కోసం చేసిన కేటాయింపుల వల్లే లాభాలపై ప్రభావం చూపింది. 2017-18లో ఈ కేటాయింపులు రూ.70,000 కోట్లు. అంత క్రితం ఏడాది ఇవి రూ.55,000 కోట్లు. ఈ ప్రొవిజన్స్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తగ్గుముఖం పట్టనున్నాయి. ఇచ్చిన రుణాలు బ్యాడ్‌ లోన్స్‌ కాకుండా గట్టి చర్యలు చేపడుతున్నాం. ఎన్‌సీఎల్‌టీ వద్ద ఉన్న మొండి బకాయిల కేసులు కొన్ని పరిష్కారం అవుతాయి. మొత్తంగా ఈ ఏడాది బ్యాంకు లాభాల్లోకి వస్తుంది’ అని ధీమా వ్యక్తం చేశారు.
రుణాల్లో 10 శాతం వృద్ధి..
ఈ ఏడాది రుణాల్లో 10 శాతం వృద్ధి ఉండొచ్చని రజనీశ్‌ కుమార్‌ వెల్లడించారు. కంజ్యూమర్‌ లోన్స్‌ అయిన కార్‌ లోన్స్‌, హోమ్‌, పర్సనల్‌ లోన్స్‌ ఎక్కువగా ఉండనున్నాయి. ఎస్‌ఎంఈ విభాగంలో కూడా మంచి వృద్ధి ఉంటుంది. ఈ ఏడాది కార్పొరేట్‌ రుణాలు పుంజుకుంటాయి. ఈ విభాగంలో మంచి అవకాశాలు ఉన్నాయి. సిమెంట్‌, రోడ్స్‌, ఆటో, ఆటో కాంపోనెంట్‌, రెనివేబుల్‌ ఎనర్జీ, ఆయిల్‌ తదితర రంగాలు మంచి పనితీరు కనబరుస్తున్నాయి’ అని తెలిపారు. వడ్డీ రేట్లు స్థిరపడుతున్నాయని, రానున్న రోజుల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని అన్నారు. కొత్తగా 8,000 మందిని నియమిస్తున్నట్టు చెప్పారు.


SBI

You may be interested

వాటాలు విక్రయించాలని మిస్త్రీని బలవంతపెట్టొద్దు

Saturday 25th August 2018

న్యూఢిల్లీ: టాటా గ్రూపు కంపెనీల మాతృ సంస్థ ‘టాటాసన్స్‌’లో మిస్త్రీ కుటుంబానికి ఉన్న వాటాలను విక్రయించాలంటూ బలవంతం చేయవద్దని జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) టాటాలను ఆదేశించింది. అలాగే, టాటాసన్స్‌ను ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీగా మార్చుతూ తీసుకున్న నిర్ణయానికి అనుమతిని హోల్డ్‌లో ఉంచింది. ఈ విషయమై మిస్త్రీ పిటిషన్‌ను అనుమతించిన అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ విచారణను సెప్టెంబర్‌ 24కు వాయిదా వేసింది. సైరస్‌ మిస్త్రీని టాటాసన్స్‌ చైర్మన్‌గా తప్పించిన

షాపింగ్‌ బిల్లుపై రూపీ ప్రభావం

Saturday 25th August 2018

న్యూఢిల్లీ: రూపాయి విలువ క్షీణత సగటు వినియోగదారుడిపై భారాన్ని మోపుతోంది. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌మెషిన్లు తదితర ఉత్పత్తులపై జీఎస్టీ రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తూ ఇటీవల జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకోగా... ధరలు తగ్గుతాయని ఆశపడిన వినియోగదారులకు రూపాయి రూపంలో నిరాశే ఎదురైంది. విలువను కోల్పోయిన రూపాయి ఈ ప్రయోజనం అందకుండా చేసింది. అంతేకాదు, రూపాయి బలహీనతతో కంపెనీలు ఉత్పత్తుల ధరలను 3-6 శాతం స్థాయిలో పెంచేందుకు

Most from this category