STOCKS

News


ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌4 శాతం వాటా విక్రయానికి ఎస్‌బీఐ ఓకే

Friday 30th November 2018
news_main1543555060.png-22512

న్యూఢిల్లీ: ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌లో 4 శాతం వాటా విక్రయానికి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆమోదం తెలిపింది. రెండు ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌కు 4 శాతం వాటాకు సమానమైన 86.2 లక్షల షేర్లను విక్రయించడానికి ఎస్‌బీఐ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ డీల్‌ విలువ రూ.482 కోట్లు. ఈ డీల్‌లో భాగంగా యాక్సిస్‌ న్యూ ఆపర్చునిటీస్‌ ఏఐఎఫ్‌-వన్‌  1.65 శాతం వాటా షేర్లను, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌కు చెందిన పీ1 ఆపర్చునిటీస్‌ ఫండ్‌-వన్‌ 2.35 శాతం వాటాను కొనుగోలు చేస్తాయి. ఈ డీల్‌కు ప్రభుత్వ సంస్థల ఆమోదాలు పొందాల్సి ఉంది. ఈ డీల్‌ ఆధారంగా ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ విలువ రూ.12,000 కోట్ల మేర ఉంటుందని అంచనా. ఈ డీల్‌ అనంతరం ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌లో ఎస్‌బీఐ వాటా 70 శాతంగా, ఐఏజీ ఇంటర్నేషనల్‌ పీటీవై కంపెనీకి 26 శాతంగా ఉంటాయి. 
 



You may be interested

నేడే సెప్టెంబర్‌ త్రైమాసిక జీడీపీ గణాంకాలు

Friday 30th November 2018

న్యూఢిల్లీ: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రెండవ త్రైమాసిక (జూలై-సెప్టెంబర్‌) అధికారిక గణాంకాలు శుక్రవారం వెలువడనున్నాయి. మొదటి త్రైమాసికంతో (8.2 శాతం) పోల్చితే ఈ వృద్ధి రేట్లు తగ్గుతాయన్న అంచనాలు ఉన్నాయి. ఈ కాలంలో రూపాయి బలహీనత, క్రూడ్‌ ధరల తీవ్రత వంటి అంశాలు వృద్ధి స్పీడ్‌ను తగ్గిస్తాయన్నది విశ్లేషణ. సెప్టెంబర్‌ త్రైమాసిక అంచనాలను ఎస్‌బీఐ రిసెర్చ్‌ 7.5-7.6 శాతం శ్రేణిలో పేర్కొంది.  దేశీయ రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా

క్రూడ్‌ ధరల అనూహ్య పతనం

Friday 30th November 2018

న్యూయార్క్‌/న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ధరల అనూహ్యంగా భారీగా పతనం అయ్యాయి. రెండు నెలల క్రితం ఉన్న గరిష్ట స్థాయిల నుంచి దాదాపు 30 డాలర్లు కిందకు దిగాయి. న్యూయార్క్‌ మర్కెంటైల్‌ ఎక్స్చేంజ్‌లో ట్రేడయ్యే లైట్‌ స్వీట్‌ బేరల్‌ ధర గురువారం ఒక దశలో 49.46 డాలర్ల స్థాయిని తాకింది. ఇది ఏడాది కనిష్ట స్థాయి. రెండు నెలల క్రితం ఈ ధర 76.90 డాలర్ల వద్ద ఉంది. ఇక

Most from this category