STOCKS

News


త్వరలో 8 మొండిపద్దుల పరిష్కారం

Saturday 25th August 2018
news_main1535171415.png-19621

న్యూఢిల్లీ: మొండిబాకీల రికవరీకి సంబంధించి విద్యుత్ రంగానికి చెందిన 7-8 పద్దులు త్వరలోనే పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ అరిజిత్ బసు వెల్లడించారు. వీటిపై రుణదాతలంతా దాదాపు ఏకాభిప్రాయానికి వచ్చారని ఆయన పేర్కొన్నారు. వీటి విలువ సుమారు రూ. 17,000 కోట్లు ఉంటుందని శుక్రవారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా బసు చెప్పారు. ప్రస్తుతం విద్యుత్ రంగంలో 34 మొండిపద్దులు ఉండగా, వీటి బాకీలు రూ. 1.74 లక్షల కోట్ల స్థాయిలో ఉంది. "యాజమాన్యం మార్పు, పెట్టుబడులు మొదలైన అంశాలకు సంబంధించి 13-14 ఖాతాలను పరిశీలించాం. బ్యాంకుల మధ్య ఏకాభిప్రాయం సాధించేందుకు ఇందులో 7-8 ఖాతాలను మరింత నిశితంగా పరిశీలిస్తున్నాం. వీటిపై కొందరు ఇన్వెస్టర్లు ఆసక్తి కూడా వ్యక్తం చేశారు. కొన్నింటికి సంబంధించి చర్చలు తుదిదశలో ఉన్నాయి. ఇవి త్వరలోనే సానుకూలంగా ముగిసే అవకాశం ఉంది" ‍అని బసు తెలిపారు. ఇప్పటికే తగు పరిష్కార మార్గాలపై బ్యాంకులు కసరత్తు చేసిన దరిమిలా.. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)కి నివేదించే కేసుల సంఖ్య మరింత భారీగా ఎగిసే అవకాశాలు లేవని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో రికవరీలు గణనీయంగా పెరిగాయని, సుమారు 80-90 శాతం అధికంగా సాధించగలిగామని బసు తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు మరింత స్వేచ్ఛనివ్వాలంటూ వస్తున్న డిమాండ్‌పై స్పందిస్తూ.. పటిష్టమైన బోర్డుతో ఎస్‌బీఐ చాలా మెరుగ్గా ఉందని ఆయన చెప్పారు. బ్యాంకులో కార్పొరేట్ గవర్నెన్స్ కూడా దీటుగా ఉంటోందని తెలిపారు. 



You may be interested

ఫండ్స్‌లో రెండంకెల వృద్ధి కొనసాగుతుంది: యాంఫి

Saturday 25th August 2018

కోల్‌కతా: మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ వృద్ధి కొనసాగుతుందని మ్యూచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌ (యాంఫ) పేర్కొంది. వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పటికీ వృద్ధికి ఢోకా ఉండదని అభిప్రాయపడింది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ 17 శాతం వృద్ధి చెందగా, రిటైల్‌ పరిశ్రమ 34 శాతం మేర వృద్ధిని నమోదు చేసింది. మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ రూ.23 లక్షల కోట్లకు చేరింది. మ్యూచువల్‌ ఫండ్స్‌ వృద్ధి

వాటాలు విక్రయించాలని మిస్త్రీని బలవంతపెట్టొద్దు

Saturday 25th August 2018

న్యూఢిల్లీ: టాటా గ్రూపు కంపెనీల మాతృ సంస్థ ‘టాటాసన్స్‌’లో మిస్త్రీ కుటుంబానికి ఉన్న వాటాలను విక్రయించాలంటూ బలవంతం చేయవద్దని జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) టాటాలను ఆదేశించింది. అలాగే, టాటాసన్స్‌ను ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీగా మార్చుతూ తీసుకున్న నిర్ణయానికి అనుమతిని హోల్డ్‌లో ఉంచింది. ఈ విషయమై మిస్త్రీ పిటిషన్‌ను అనుమతించిన అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ విచారణను సెప్టెంబర్‌ 24కు వాయిదా వేసింది. సైరస్‌ మిస్త్రీని టాటాసన్స్‌ చైర్మన్‌గా తప్పించిన

Most from this category