News


20 శాతం పెరిగిన ఎస్‌బీఐ లైఫ్‌ లాభం

Friday 26th April 2019
news_main1556257010.png-25363

మార్చి క్వార్టర్లో రూ.458 కోట్లు
న్యూఢిల్లీ: ఎస్‌బీఐ అనుబంధ సంస్థ ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ లాభం మార్చి త్రైమాసికంలో 20 శాతం వృద్ధి సాధించింది. రూ.457 కోట్లకు పైగా లాభాన్ని కంపెనీ నమోదు చేసింది. ఆదాయం సైతం 50 శాతానికి పైగా పెరిగి రూ.15,601 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.381 కోట్లు, ఆదాయం రూ.10,052 కోట్లుగా ఉన్నాయి. 2018-19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంస్థ నికర లాభం రూ.1,327 కోట్లకు వృద్ధి చెందింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన నికర లాభం రూ.1,150తో పోలిస్తే 15 శాతం పెరిగింది. నూతన వ్యాపార విలువ 2017-18తో పోలిస్తే 2018-19లో 24 శాతం పెరిగి రూ.1,720 కోట్లుగా నమోదైంది. 



You may be interested

మైక్రోసాఫ్ట్ @ 1 లక్ష కోట్ల డాలర్లు

Friday 26th April 2019

న్యూయార్క్‌:  టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మార్కెట్‌క్యాప్ పరంగా తొలిసారి 1 లక్ష కోట్ల డాలర్ల మైలురాయిని తాకింది. టెక్నాలజీ రంగానికి చెందిన అమెజాన్‌, యాపిల్‌ తర్వాత ఈ స్థాయిని చేరిన మూడో కంపెనీ మైక్రోసాఫ్ట్‌. అంచనాలు మించిన ఆర్థిక ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేర్లు దాదాపు అయిదు శాతం ర్యాలీ చేసి 130.59 డాలర్లకు చేరడంతో మైక్రోసాఫ్ట్ మార్కెట్ క్యాప్‌ 1 లక్ష కోట్ల డాలర్లకు పెరిగింది. ఆ తర్వాత

ఎఫ్‌ఎల్‌ఓ కొత్త కార్యవర్గం ఎన్నిక

Friday 26th April 2019

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఫిక్కీ) హైదరాబాద్‌ మహిళ సమాఖ్య (ఎఫ్‌ఎల్‌ఓ), యంగ్‌ ఎఫ్‌ఎల్‌ఓలకు నూతన కార్యవర్గం ఎన్నికైంది. ఎఫ్‌ఎల్‌ఓకు సోనా చట్వానీ, యంగ్‌ ఎఫ్‌ఎల్‌ఓకు శిల్పా దాట్ల చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. ఏడాది పాటు వీళ్లు ఈ పదవిలో కొనసాగుతారు. ఈ సందర్భంగా సోనా చట్వానీ మాట్లాడుతూ.. కేంద్ర ఫిక్కీ మహిళా విభాగం అడుగుజాడల్లో నడుస్తామని, మహిళా సాధికారిత కోసం

Most from this category