News


ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ లాభం 11 శాతం అప్‌

Saturday 20th October 2018
news_main1540010431.png-21311

న్యూఢిల్లీ: ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 11 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.225 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.251 కోట్లకు పెరిగిందని కంపెనీ తెలిపింది. స్థూల ప్రీమియమ్‌ ఆదాయం రూ.5,460 కోట్ల నుంచి రూ.7,685 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ షేర్‌ 0.1 శాతం నష్టంతో రూ.561 వద్ద ముగిసింది. 

ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ డివిడెండ్‌ రూ.3.70
ఐసీఐసీఐ బ్యాంక్‌ అనుబంధ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.134 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం రూ.130 కోట్లుతో పోల్చితే 3 శాతం వృద్ధి సాధించామని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ తెలిపింది. ఆదాయం రూ.455 కోట్ల నుంచి రూ.458 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఒక్కో షేర్‌కు రూ.3.70 మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నది. కాగా కంపెనీ చైర్మన్‌గా వినోద్‌ కుమార​ ధాల్‌ నియమితులయ్యారు. 

ఎంఫసిస్‌ లాభం 37 శాతం అప్‌..
ఐటీ కంపెనీ ఎంఫసిస్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో 37 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.198 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.271 కోట్లకు పెరిగిందని ఎంఫసిస్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,642 కోట్ల నుంచి 20 శాతం వృద్ధితో రూ.1,962 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఎంఫసిస్‌ షేర్‌ 4.2 శాతం నష్టంతో రూ.1,075 వద్ద ముగిసింది. 
 
 



You may be interested

డిజిటల్‌ మార్కెటింగ్‌ అడ్డా!

Saturday 20th October 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రస్తుతం విద్యా, వైద్యం, వినోదం ఏ రంగంలోనైనా సరే డిజిటల్‌ మార్కెటింగ్‌ ప్రధానంగా మారింది. కంపెనీ అభివృద్ధి, ఉత్పత్తుల ప్రచారంలో ఇతర మాధ్యమాల మార్కెటింగ్‌ కంటే డిజిటల్‌ మార్కెటింగ్‌ ముందున్నదనేది ఎవరూ కాదనలేని వాస్తవం. అందుకే దీన్ని వ్యాపార వేదికంగా ఎంచుకుంది ‘డిజిటల్‌ అకాడమీ 360’. కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన ఈ సంస్థ గురించి మరిన్ని వివరాలు సంస్థ ఫౌండర్‌ యోగేష్‌ ‘స్టార్టప్‌ డైరీ’తో

పేమెంట్‌ వ్యవస్థలకు ప్రత్యేక నియంత్రణ అక్కర్లేదు: ఆర్‌బీఐ

Saturday 20th October 2018

ముంబై: పేమెంట్‌, సెటిల్‌మెంట్‌ చట్టంలో మార్పులకు ప్రభుత్వ ప్యానెల్‌ చేసిన సిఫారసులతో ఆర్‌బీఐ తీవ్రంగా విభేదించింది. పేమెంట్‌ వ్యవస్థల నియంత్రణ కచ్చితంగా ఆర్‌బీఐ పరిధిలోనే ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి చైర్మన్‌గా ప్రభుత్వం ఓ అంతర్గత మంత్రిత్వ శాఖల కమిటీని ఏర్పాటు చేసింది. పేమెంట్‌ అండ్‌ సెటిల్‌మెంట్స్‌ చట్టం(పీఎస్‌ఎస్‌), 2007కు చేయాల్సిన సిఫారసులతో ఈ కమిటీ ఓ ముసాయిదా నివేదికను సిద్ధం చేసింది. పేమెంట్‌ సంబంధిత

Most from this category