STOCKS

News


వ్యాపార అవకాశాల విస్తృతికి ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ చైనా ఒప్పందం

Wednesday 20th March 2019
news_main1553061473.png-24708

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా వ్యాపార అవకాశాల విస్తృతికి పరస్పర సహకారం లక్ష్యంగా భారత్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), చైనా బ్యాంకింగ్‌ దిగ్గజం, మూలధనం పరిమాణం పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్ద బ్యాంక్‌-  బ్యాంక్‌ ఆఫ్‌ చైనా (బీఓసీ) లు చేతులు కలిపాయి. ఈ మేరకు ఒక అవగహనా పత్రం (ఎంఓయూ)పై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ఉన్నప్పటికీ కూడా అంతర్జాతీయంగా తమతమ మార్కెట్ల విస్తృతికి రెండు బ్యాంకులూ వేర్వేరుగానూ తమ కార్యకలాపాలను నిర్వహించే అవకాశం ఉందని అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. అయితే ఈ ఒప్పందం వల్ల రెండు బ్యాంకుల క్లయింట్లకూ నెట్‌వర్క్‌ విస్తృతమవుతుంది. విస్తృత స్థాయిలో సేవలనూ పొందవచ్చు.  ప్రస్తుతం ఎస్‌బీఐకి షాంఘైలో బ్రాంచీ ఉండగా, ముంబైలో బీఓసీ తన బ్రాంచీని విస్తృతం చేస్తోంది. పరస్పర ప్రయోజన దిశలో రెండు బ్యాంకులకూ ఇది ఒక పెద్ద ముందగుగని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌, బీఓసీ చైర్మన్‌ చాన్‌ షింక్వింగ్‌ పేర్కొన్నారు.



You may be interested

భారత్‌లో గోజీరో మోబిలిటీ బైక్‌లు

Wednesday 20th March 2019

వచ్చే వారం వన్‌, మైల్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌లు  -లైఫ్‌స్టైల్‌ ఉత్పత్తులు కూడా  న్యూఢిల్లీ: బ్రిటిష్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌, లైఫ్‌స్టైల్‌ బ్రాండ్‌ ‘గోజీరో మొబిలిటీ’ భారత్‌లోకి ప్రవేశిస్తోంది. వచ్చే వారం రెండు ఎలక్ట్రిక్‌ బైక్‌లు... వన్‌, మైల్‌లను ఢిల్లీ మార్కెట్లోకి విడుదల చేయనున్నది. గోజీరో వన్‌ బైక్‌లో 400 వాట్‌అవర్‌(డబ్ల్యూహెచ్‌) లిథియమ్‌ బ్యాటరీని అమర్చామని, గోజీరో మొబిలిటీ సీఈఓ అంకిత్‌ కుమార్‌ తెలిపారు. ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే, 60 కీమీ.దూరం ప్రయాణిస్తుందని పేర్కొన్నారు. గోజీరో

షావోమీ నుంచి రెడ్‌మీ గో స్మార్ట్‌ఫోన్‌

Wednesday 20th March 2019

- ధర రూ. 4,499 న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్స్ తయారీ సంస్థ షావోమీ తాజాగా రెడ్‌మీ గో పేరిట భారత మార్కెట్లో కొత్త ఫోన్‌ ఆవిష్కరించింది. దీని ధర రూ. 4,499గా ఉంటుంది. 1 జీబీ ర్యామ్‌, ఆండ్రాయిడ్ ఓరియో (గో ఎడిషన్‌) ఆపరేటింగ్ సిస్టం, 5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, 8 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ సెన్సార్‌, క్వాడ్‌-కోర్‌ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 425 చిప్‌ మొదలైనవి ఇందులో ప్రత్యేకతలు.

Most from this category