STOCKS

News


ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్‌ ఫలితాలు బాగుంటాయి!

Wednesday 9th January 2019
news_main1547029663.png-23488

సీఎల్‌ఎస్‌ఏ అంచనా
మూడో త్రైమాసికంలో పీఎస్‌యూ బ్యాంకుల ఫలితాలు గాడిన పడతాయని అంతర్జాతీయ బ్రోకింగ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ అంచనా వేసింది. ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంకుల క్యు3 ఫలితాలు అంచనాలను మించవచ్చని తెలిపింది. ముఖ్యంగా స్లిపేజ్‌లు, ఆపరేటింగ్‌ ప్రదర్శన విషయాల్లో ఈ బ్యాంకులు మెరుగుపడతాయని తెలిపింది. యస్‌బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌లాంటి బ్యాంకుల ఫలితాలపై ప్రొవిజనింగ్స్‌ భారం పడుతుందని అంచనా వేసింది. హెచ్‌డీఎఫ్‌సీ కోర్‌ ప్రాఫిట్‌లో వృద్ది ఉండొచ్చు కానీ, నికరలాభంలో మాత్రం క్షీణత ఉంటుందని తెలిపింది. ఈ దఫా ప్రైవేట్‌ బ్యాంకులన్నింటి సరాసరి లాభంలో వృద్ధి 3 శాతం వరకు ఉండవచ్చని సీఎల్‌ఎస్‌ఏ తెలిపింది. బ్యాంకుల జీఎన్‌పీఏలు 9 శాతానికి దిగిరావడం, ఎన్‌ఐఐల్లో మెరుగుదల కారణంగా ఈసారి స్లిపేజ్‌లు తగ్గుముఖం పట్టవచ్చని అభిప్రాయపడింది. ఎక్కువశాతం స్లిపేజ్‌లు నాన్‌ఎన్‌పీఎల్‌ లోన్స్‌ వల్లనే కలగవచ్చని తెలిపింది. క్యు3లో కొన్ని బ్యాంకులు ఐఎల్‌అండ్‌ఎఫ్ఎస్‌తో బంధాన్ని తగ్గించుకోవచ్చని అంచనా వేసింది. గవర్నమెంట్‌ సెక్యూరిటీస్‌ బుక్స్‌లో మార్పుల కారణంగా పీఎస్‌యూలకు లబ్ది చేకూరవచ్చని తెలిపింది. ఎన్‌బీఎఫ్‌సీల ఫలితాలు ఇంకా ఒడిదుడుకుల్లోనే ఉండొచ్చని, అధిక రక్షణాత్మక విధానాలు కొనసాగడమే ఇందుకు కారణమని తెలిపింది. ఎన్‌ఎల్‌ఎఫ్‌ల్లో ఐసీఐసీఐ లుంబార్డ్‌ మెరుగైన ఫలితాలు ప్రకటించవచ్చని పేర్కొంది. 

 



You may be interested

నాలుగో రోజూ లాభాలే..!

Wednesday 9th January 2019

36వేలపైన సెన్సెక్స్‌ 10850పైన నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్‌ ఆర్థిక రంగ షేర్ల అండతో మార్కెట్‌ నాలుగో రోజూ లాభాలతో ముగిసింది. మిడ్‌సెషన్‌ తరువాత సాగిన ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో చివరకు సెన్సెక్స్‌ 36వేల పైన, నిఫ్టీ 10850 పాయింట్లపై ముగిశాయి. ఇటీవల ప్రపంచ వాణిజ్యరంగాన్ని కలవరపెడుతున్న అమెరికా-చైనా దేశాల వాణిజ్య యుద్ధ నివారణ చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో నేడు సూచీలు భారీ గ్యాప్‌అప్‌తో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 200 పాయింట్లు పెరిగి 36,180 వద్ద, నిఫ్టీ

యస్‌ బ్యాంకు షేర్లకు బ్లాక్‌డీల్‌ షాక్‌

Wednesday 9th January 2019

6శాతం పతనమైన బ్యాంకు షేర్లు భారీ మొత్తంలో జరిగిన బ్లాక్‌డీల్స్‌ యస్‌ బ్యాంక్‌ షేర్లకు షాక్‌నిచ్చాయి. ఒక ప్రైవేట్‌ కంపెనీ రెండు బ్లాక్‌డీల్‌ ద్వారా సుమారు 25లక్షల ఈక్విటీ షేర్లు కొనుగోలు చేసినట్లు వార్తలు వెలువడంతో బుధవారం యస్‌ బ్యాంక్‌ షేర్లు 6శాతం క్షీణించాయి. నేడు బీఎస్‌ఈలో యస్‌ బ్యాంక్‌ షేరు రూ.193.75ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఇంట్రాడేలో బ్లాక్‌డీల్స్‌ అంశం వెలుగులోకి రావడంతో షేరు 6శాతం నష్టపోయి 181.55ల కనిష్టానికి

Most from this category