STOCKS

News


ఏటీఎం నుంచి ఇక రోజుకు రూ.20వేలే

Wednesday 31st October 2018
Markets_main1540970689.png-21605

ఎస్‌బీఐ విత్‌డ్రాయల్స్‌పై పరిమితి
నేటి నుంచీ అమల్లోకి...
కార్డు మోసాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం

ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) రోజువారీ ఏటీఎం విత్‌డ్రాయెల్‌ పరిమితిని సగానికి సగం తగ్గించేసింది. ప్రస్తుతం ఈ పరిమితి రూ.40,000 ఉండగా... దీనిని బుధవారం నుంచి రూ.20,000కు తగ్గిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలియజేసింది. నిజానికి ఎస్‌బీఐ ఈ నెల మొదట్లోనే ఈ నిర్ణయాన్ని ప్రకటించినా... అక్టోబర్‌ 31 నుంచీ అమల్లోకి వస్తుందని అప్పట్లోనే ప్రకటించింది.  మోసపూరిత లావాదేవీలు పెరిగిపోతుండడంతో, కస్టమర్ల ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్‌  ప్రకటించింది. తాజా నిర్ణయం వల్ల ఏటీఎంల ద్వారా ఒకేరోజు పెద్ద మొత్తంలో నిధుల విత్‌డ్రా చేయడానికి అవకాశం ఉండదు. దీనివల్ల మోసగాళ్లు సైతం రోజుకు రూ.20వేల కన్నా ఎక్కువ విత్‌డ్రా చేయలేరు కనక ఒకవేళ ఎవరైనా మోసపోయినా మరీ ఎక్కువ మొత్తాన్ని పోగొట్టుకోకుండా ఉంటారన్నది తమ ఉద్దేశమని బ్యాంకు తెలియజేసింది. ఏదైనా మోసపూరిత విత్‌డ్రాయెల్‌ జరిగితే వెంటనే కార్డ్‌ బ్లాక్‌ చేయించుకోవడం, సంబంధిత బ్రాంచీని సంప్రతించడం చేయాలని, దాంతో నష్టాన్ని పరిమితం చేసుకోవచ్చని కూడా సూచించింది.

ఎక్కువ మొత్తం కావాలంటే దరఖాస్తు చేసుకోవచ్చు...
 ‘‘క్లాసిక్‌ అండ్‌ మ్యాస్ట్రో డెబిట్‌ కార్డ్‌పై విత్‌డ్రాయెల్‌ పరిమితిని రూ.20,000కు తగ్గిస్తున్నాం. ఇతర కార్డులకు సంబంధించి రోజూవారీ విత్‌డ్రాయెల్‌ పరిమితిలో ఎలాంటి మార్పూ లేదు. క్లాసిక్‌-డెబిట్‌ కార్డ్‌ చిప్‌ ఆధారితం కాదు. కాబట్టి సెక్యూరిటీ పరమైన ఆందోళనలు ఉన్నాయి. పలు ఫిర్యాదులూ అందాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. రూ.20,000కు మించి విత్‌డ్రాయెల్స్‌ కావాలనుకునేవారు హయ్యర్‌ ‍కార్డ్‌ వేరియెంట్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు’’ అని  ఎస్‌బీఐ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పీకే గుప్తా తెలిపారు. ‘‘గణాంకాల విశ్లేషణ ప్రకారం- మెజారిటీ కార్డ్‌ హోల్డర్లు రోజుకు రూ.20,000లోపే ఏటీఎం విత్‌డ్రా చేస్తున్నారు. ఏదైనా మోసం కేసులు నమోదవుతున్నాయంటే, అవి రూ.20,000 పైబడే ఉన్నాయి’’ అని కూడా ఆయన పేర్కొన్నారు  దేశ వ్యాప్తంగా ఎస్‌బీఐకి దాదాపు 42 కోట్ల మంది కస్టమర్లున్నారు. 2018 మార్చి నాటికి బ్యాంక్‌ 39.50 కోట్ల డెబిట్‌ ‍కార్డులను జారీ చేసింది. వీటిలో దాదాపు 26 కోట్ల కార్డుల వినియోగం పూర్తి క్రియాశీలంగా ఉంది. డెబిట్‌ కార్డుల జారీకి సంబంధించి ఎస్‌బీఐ మార్కెట్‌ వాటా దాదాపు 32.3 శాతం.



You may be interested

అడ్డగోలు రుణాల పాపం ఆర్‌బీఐదే

Wednesday 31st October 2018

 కట్టడి చేయడంలో విఫలమైంది - అందుకే మొండిబాకీలు పెరిగిపోయాయి - రిజర్వ్‌ బ్యాంక్‌పై జైట్లీ విమర్శలు ముంబై: రిజర్వ్‌ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం మధ్య విభేదాలు ముదురుతున్నాయి. ఆర్‌బీఐ  స్వయం ప్రతిపత్తిని కాపాడకపోతే పెను విపత్తు తప్పదంటూ రిజర్వ్‌ బ్యాంక్‌ డెప్యూటీ గవర్నర్‌ విరాల్‌ అచార్య వ్యాఖ్యానించిన నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఘాటుగా స్పందించారు. 2008 - 2014 మధ్య కాలంలో బ్యాంకులు విచక్షణారహితంగా రుణాలిచ్చేస్తుంటే కట్టడి చేయకుండా సెంట్రల్‌

తొలి ‘‘హ్యారియర్‌’’ విడుదల

Wednesday 31st October 2018

వచ్చే ఏడాదిలో డెలివరీలు న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌కు చెందిన ప్రీమియం ఎస్‌యూవీ ‘హ్యారియర్‌’ తొలి కారు మంగళవారం విడుదలైంది. పుణే యూనిట్‌లో ఈ ఎస్‌యూవీ ఉత్పత్తి అయ్యిందని, వచ్చే ఏడాది తొలి అర్థభాగంలోనే దేశవ్యాప్తంగా విడుదలకానుందని కంపెనీ ప్రకటించింది. ఈ సందర్భంగా సంస్థ ప్యాసింజర్‌ వాహన వ్యాపార యూనిట్‌ ప్రెసిడెంట్‌ మయాంక్ పరీక్‌ మాట్లాడుతూ.. ‘జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్‌ఆర్) సహకారంతో కేవలం ఆరు నెలల్లోనే ఈ ఎస్‌యూవీ రూపుదిద్దుకుంది. వచ్చే ఏడాదిలో

Most from this category