STOCKS

News


ఎస్‌బీఐ ఫలితాలు.. ఎలా ఉండొచ్చు?

Friday 10th August 2018
news_main1533878480.png-19113

క్యు1 ఫలితాలపై అంచనాలు
దేశీయ ప్రభుత్వ బ్యాంకు దిగ్గజం ఎస్‌బీఐ క్యు1 ఫలితాలు శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌లో షేరు దాదాపు 2 శాతం పతనమైంది. గత నెల రోజుల్లో ఈ షేరు సుమారు 19 శాతం ర్యాలీ జరిపింది. గడిచిన మూడు రోజుల్లోనే 3 శాతం పెరిగింది.

ఈ నేపథ్యంలో బ్యాంకు ఫలితాలపై మార్కెట్‌ అంచనాలు ఇలా ఉన్నాయి...
- రాయిటర్స్‌ పోల్‌ ప్రకారం కేటాయింపులు పెరిగినందున నికర నష్టం 30.6 కోట్ల రూపాయలుగా ఉండొచ్చు. మార్చి త్రైమాసికంలో బ్యాంకు 7,718 కోట్ల రూపాయల నష్టం ప్రకటించింది.
- ప్రొవిజన్స్‌ రూ. 13829 కోట్ల రూపాయలకు చేరవచ్చు. మార్చి త్రైమాసికంలో కేటాయింపులు రూ. 24080 కోట్లుగా నమోదయ్యాయి.
- మోతీలాల్‌ ఓస్వాల్‌ అంచనా ప్రకారం నికర లాభంలో 16 శాతం క్షీణత ఉండొచ్చు. 
- రాయిటర్స్‌ పోల్‌ ప్రకారం ఎన్‌ఐఎం 17 శాతం వృద్ధి చెంది 20584 కోట్ల రూపాయలకు చేరవచ్చు. మోతీలాల్‌ ఓస్వాల్‌ ప్రకారం లోన్‌ గ్రోత్‌ నమోదయినా ఎన్‌ఐఎం ఫ్లాట్‌గానే ఉండవచ్చు.
- ఇతర ఆదాయంలో క్షీణత కనిపించి రూ. 730 కోట్లకు పరిమితం కావచ్చు.
- కొత్త ఒత్తిడులు 2.3 శాతం స్థాయిలో ఉండొచ్చు. 
- మార్కెట్‌ అంచనాల ప్రకారం స్థూల ఎన్‌పీఏలు 10.7 శాతానికి దిగిరావచ్చు. 
- నికర ఎన్‌పీఏలు 6 నుంచి 5.6, 5.7 శాతానికి క్షీణించవచ్చు. 
నిశితంగా చూడాల్సిన అంశాలు..
- ఆస్తుల నాణ్యత ప్రదర్శన, గైడెన్స్‌
- ఎన్‌సీఎల్‌టీ అకౌంట్ల నుంచి రికవరీలు
- విద్యుత్‌రంగ ఆస్తులపై అవుట్‌లుక్‌



You may be interested

సాంక్టమ్‌ వెల్త్‌ షార్ట్‌టర్మ్‌ సిఫార్సులు

Friday 10th August 2018

 ఒకటి రెండు నెలల కాలానికి 20 శాతం వరకు రాబడినిచ్చే ఐదు స్టాకులను సాంక్టమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ రికమండ్‌ చేస్తోంది... 1. యాక్సిస్‌ బ్యాంక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 750. స్టాప్‌లాస్‌ రూ. 580. మూడేళ్ల పాటు రూ. 365- 655 రేంజ్‌లో కన్సాలిడేట్‌ అయింది. నెల చార్టుల్లో సౌష్ఠవాకార త్రిభుజాకృతిని ఏర్పరిచింది. తాజాగా అప్‌మూవ్‌ సాధించి నిరోధక ట్రెండ్‌లైన్‌ను దాటేసింది. రెండువారాలుగా వాల్యూంలతో కూడిన అప్‌మూవ్‌ చూపుతోంది. బోలింగర్‌ బ్యాండ్‌,

స్థిరంగా పసిడి ధర

Friday 10th August 2018

ట్రేడ్‌ వార్‌తో అంతర్జాతీయ మార్కెట్లో శుక్రవారం పసిడి ధర స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియా ట్రేడింగ్‌లో పసిడి ఔన్స్‌ ధర శుక్రవారం భారత కాలమానం ప్రకారం గం.10:00 ని.లకు 0.30 డాలర్లు స్వల్ప పెరుగుదలతో 1,220.20 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. గత రాత్రి అమెరికా మార్కెట్ల ఫ్లాట్‌ ముగింపు కారణంగా అక్కడ పసిడి బలపడింది. అయితే నేటి ఉదయం యూఎస్‌-చైనా ట్రేడ్ వార్‌ భయాల కారణంగా ఆసియాలో పలు

Most from this category