STOCKS

News


రెపో రేటుతో వడ్డీ రేట్ల అనుసంధానం

Saturday 8th June 2019
news_main1559977387.png-26172

  • జులై నుంచి అమలు చేయనున్న ఎస్‌బీఐ    

ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) జూలై నుంచి గృహ రుణాలు, స్వల్ప కాలిక రుణాలు, భారీ పొదుపు ఖాతా డిపాజిట్లపై వడ్డీ రేట్లను రెపో రేటుకు అనుసంధానించనున్నట్లు వెల్లడించింది. మరోవైపు ఆర్‌బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన మీదట.. రూ. 1 లక్ష పైగా పరిమితులు ఉన్న క్యాష్ క్రెడిట్ అకౌంట్‌, ఓవర్‌డ్రాఫ్ట్ కస్టమర్లకు వడ్డీ రేటును తగ్గించింది. ఇకపై సీసీ/ఓడీ కస్టమర్లకు రెపో ఆధారిత వడ్డీ రేటు 8శాతంగా ఉంటుందని, రూ. 1 లక్ష పైబడిన సేవింగ్స్ డిపాజిట్లపై 3 శాతం వడ్డీ రేటు ఉంటుందని ఎస్‌బీఐ తెలిపింది. 



You may be interested

చందా కొచర్‌కు ఈడీ సమన్లు

Saturday 8th June 2019

జూన్ 10న విచారణకు హాజరు కావాలని ఆదేశం న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూప్‌నకు రూ. 1,875 కోట్ల రుణాల వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. సెంట్రల్‌ ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో జూన్ 10న ఉదయం 10.30 గం.లకు విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. ఢిల్లీలో కొచ్చర్‌ కుటుంబ సభ్యులను ఈడీ ఇప్పటికే అయిదు సార్లు విచారణ చేసింది.

ఎంబసీ గ్రూప్‌ చేతికి ​14 శాతం వాటా

Saturday 8th June 2019

ఇండియాబుల్స్‌ రియల్టీలో వాటా విక్రయం రూ.950 కోట్లకు విక్రయించిన ప్రమోటర్లు ముంబై: ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలో 14 శాతం వాటాను ఆ కంపెనీ ప్రమోటర్లు రూ.950 కోట్లకు విక్రయించారు. 14 శాతం వాటాకు సమానమైన 6.3 కోట్ల షేర్లను ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీల ద్వారా ఎంబసీ గ్రూప్‌నకు ఇండియా బుల్స్‌  రియల్‌ ఎస్టేట్‌ ప్రమోటర్‌ సంస్థలు విక్రయించాయని బీఎస్‌ఈ బల్క్‌డీల్‌ డేటా వెల్లడించింది. ఈ డేటా ప్రకారం ఇండియాబుల్స్‌ రియల్‌ఎస్టేట్‌ కంపెనీ

Most from this category