STOCKS

News


రిఫైనరీల ఏర్పాటుపై సౌదీతో రిలయన్స్‌ చర్చలు

Wednesday 19th December 2018
news_main1545194092.png-23065

న్యూఢిల్లీ: కొత్త పెట్టుబడులకు సంబంధించి సౌదీ అరేబియాకు చెందిన ప్రపంచ అతిపెద్ద చమురు ఎగుమతి సంస్థ ‘సౌదీ ఆరామ్‌కో’తో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చర్చలను కొనసాగిస్తోంది. ముకేష్ అంబానీ కుమార్తె ఈశా వివాహానికి హాజరైన సమయంలో రిఫైనరీ, పెట్రో కెమికల్స్ ఏర్పాటుపై అంబానీతో చర్చించినట్లు సౌదీ అరేబియా ఆయిల్‌ శాఖ మంత్రి ఖలీద్‌ అల్‌ ఫలీహ్‌ ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. ఉమ్మడి పెట్టుబడులు.. పెట్రోకెమికల్, రిఫైనింగ్, కమ్యూనికేషన్స్ ప్రాజెక్టులలో సహకారంపై ఆయనతో చర్చించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం జామ్‌నగర్‌లోని రెండు రిఫైనరీలను ఆర్‌ఐఎల్‌ నిర్వహిస్తుండగా.. వీటి ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 68.2 మిలియన్ టన్నులుగా ఉంది.



You may be interested

‘వోగో’లో వోలా రూ.720 కోట్ల పెట్టుబడి

Wednesday 19th December 2018

న్యూఢిల్లీ: క్యాబ్‌ సేవల సంస్థ ఓలా, స్కూటర్ల షేరింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ‘వోగో’లో 100 మిలియన్‌ డాలర్లను (రూ.720 కోట్లు) ఇన్వెస్ట్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ పెట్టుబడులను నేరుగా అందించకుండా, లక్ష స్కూటర్లను వోగోకు అందించనుంది. దీనివల్ల వోగో తన కార్యకలాపాల విస్తరణకు పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం రాకుండా స్కూటర్ల సరఫరాను పెంచుకోనుంది. వోగో స్కూటర్ల సేవలు ఓలా ప్లాట్‌ఫామ్‌పై ఉన్న 15 కోట్ల మంది కస్టమర్లకు త్వరలో అందుబాటులోకి

అమెరికా ఉత్పత్తులపై సుంకాల పెం‍పు వాయిదా

Wednesday 19th December 2018

న్యూఢిల్లీ: అమెరికా ఉత్పత్తుల దిగుమతులపై సుంకాల పెంపును భారత్‌ నాల్గవసారి వాయిదావేసింది. జనవరి 31వ తేదీ వరకూ ఈ నిర్ణయం వర్తిస్తుంది. ఈ మేరకు కేంద్రం ఒక ప్రకటన చేస్తూ, సుంకాల నిర్ణయాన్ని వాయిదా వేయాలని ఆర్థిక శాఖను వాణిజ్య మంత్రిత్వశాఖ కోరినట్లు తెలియజేసింది. రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చల నేపథ్యంలో కేం‍్రదం తాజా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే... ♦ స్టీల్‌, అల్యూమినియంసహా భారత్‌ నుంచి దిగుమతులపై అమెరికా

Most from this category