STOCKS

News


ఇంజినీరింగ్‌ విద్యార్థులకు వెయ్యికి పైగా శామ్‌సంగ్‌ ఉద్యోగాలు

Wednesday 28th November 2018
news_main1543390726.png-22442

న్యూఢిల్లీ: గృహోపకరణాల  దిగ్గజం శామ్‌సంగ్‌ ఇండియా వెయ్యికి పైగా ఇంజినీరింగ్‌ పట్టభద్రులకు ఉద్యోగాలినివ్వనున్నది. వీటిల్లో 300 మందిని వివిధ ఐఐటీల నుంచి తీసుకుంటామని శామ్‌సంగ్‌ ఇండియా హెడ్‌(హ్యుమన్‌ రిసోర్సెస్‌) సమీర్‌ వాధ్వాన్‌ తెలిపారు. వచ్చే నెల 1 నుంచి ఢిల్లీ, కాన్సూర్‌, బాంబే, మద్రాస్‌, ఖర్గపూర్‌, గౌహతి, రూర్కీ ఐఐటీల్లో ఉద్యోగ నియామకాలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కొత్త ఐఐటీలైన హైదరాబాద్‌, ధన్‌బాద్‌, రోపార్‌, ఇండోర్‌, గాంధీనగర్‌, పాట్నా, భువనేశ్వర్‌, మండి, జోధ్‌పూర్‌లతో పాటు ప్రీమియమ్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలు-బిట్స్‌ పిలానీ, ట్రిపుల్‌ఐటీలు, ఎన్‌ఐటీలు, ఢిల్లీ టెక్నాలజీ యచూనివర్శిటీ, మణిపాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, ఐఐఎస్‌ఈ బెంగళూరుల్లో కూడా క్యాంపస్‌ సెలక్షన్‌లు నిర్వహిస్తామని వివరించారు.కొత్త ఉద్యోగాల్లో అధిక భాగం మర మేధ, మెషీన్‌ లర్నింగ్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌, కెమెరా టెక్నాలజీ, 5జీ నెట్‌వర్క్‌లకు సంబంధించి ఉంటాయని వాధ్వాన్‌ చెప్పారు.  
 



You may be interested

వన్నె తగ్గుతున్న గోల్డ్‌  ఈటీఎఫ్‌లు

Wednesday 28th November 2018

న్యూఢిల్లీ: గోల్డ్‌ ఈటీఎఫ్‌ (ఎక్స్చేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌) ప్రభ మసకబారుతోంది. గోల్డ్‌ ఈటీఎఫ్‌ల నుంచి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం కొనసాగుతూనే ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌- అక్టోబర్‌ కాలానికి ఇన్వెస్టర్లు గోల్డ్‌ ఈటీఎఫ్‌ల నుంచి రూ.290 కోట్ల మేర పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్న పెట్టుబడులు రూ.422 కోట్లుగా ఉన్నాయి. మొత్తం మీద గోల్డ్‌ ఈటీఎఫ్‌లు వన్నె

టయోటా ధరలు పెరుగుతున్నాయ్‌

Wednesday 28th November 2018

న్యూఢిల్లీ: టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ వాహనాల ధరలు పెరగనున్నాయి. జనవరి 1వ తేదీ నుంచీ అన్ని మోడళ్లపై 4 శాతం వరకూ ధరల పెంపు ఉంటుందని మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో సంస్థ తెలియజేసింది. రూపాయి విలువ బలహీనత వల్ల తయారీ వ్యయాలు పెరిగిపోవడంతో ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పెరిగే తయారీ వ్యయాలకు అనుగుణంగా ధరల సమీక్ష, అందుకు తగిన నిర్ణయాలు

Most from this category