STOCKS

News


శామ్‌శాంగ్‌ టాప్‌-3లో బిగ్‌ సీ

Friday 8th February 2019
news_main1549606016.png-24085

  • భారత్‌లో ఈ బ్రాండ్‌ ఫోన్ల విక్రయాల్లో జోరు

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: శామ్‌సంగ్‌ మొబైల్స్‌ విక్రయాల్లో భారత్‌లో టాప్‌-3 స్థానాన్ని మల్టీ బ్రాండ్‌ మొబైల్స్‌ రిటైల్‌ చైన్‌ ‘బిగ్‌ సి’ దక్కించుకుంది. ఈ సందర్భంగా శామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ సౌత్‌ వెస్ట్‌ ఆసియా ప్రెసిడెంట్‌ హెచ్‌.సి.హాంగ్‌ హైదరాబాద్‌లోని బిగ్‌ సి కార్యాలయానికి గురువారం విచ్చేశారు. బిగ్‌ సి ఫౌండర్‌ ఎం.బాలు చౌదరిని ప్రత్యేకంగా అభినందించారు. శామ్‌సంగ్‌ ప్రవేశ పెట్టిన ప్రతి మోడల్‌ అమ్మకాల్లో 16 ఏళ్లుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో తాము మొదటి స్థానంలో ఉన్నట్టు బాలు చౌదరి వెల్లడించారు. భవిష్యత్తులో కొత్త లక్ష్యాలను చేరుకుంటామన్న ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో బిగ్‌ సి డైరెక్టర్లు వై.స్వప్న కుమార్‌, జి.బాలాజీ రెడ్డి, కైలాష్‌ లఖ్యాని పాల్గొన్నారు.



You may be interested

14 రెట్లు పెరిగిన సెయిల్‌ లాభం

Friday 8th February 2019

రూ.616 కోట్లకు నికర లాభం రూ.15,910 కోట్లకు మొత్తం ఆదాయం న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఉక్కు కంపెనీ, సెయిల్‌ ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్లో రూ.616 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.43 కోట్ల నికర లాభం వచ్చిందని, దాదాపు 14 రెట్లు వృద్ధి సాధించామని సెయిల్‌ తెలిపింది. ఆదాయం అధికంగా రావడం, నిల్వల స్థాయి తక్కువగా ఉండటంతో ఈ స్థాయి నికర లాభం

ప్రపంచ బ్యాంక్‌ కొత్త ప్రెసిడెంట్‌ డేవిడ్‌ మాల్పాస్‌!

Friday 8th February 2019

వాషింగ్టన్‌: ప్రపంచబ్యాంక్‌ కొత్త అధ్యక్షునిగా ప్రముఖ ఆర్థికవేత్త డేవిడ్‌ మాల్పాస్‌ పేరును అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిపాదించారు. 189 సభ్యదేశాలు సభ్యులుగా ఉన్న  ప్రపంచబ్యాంక్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల ఆమోదంతో ఆయన ఈ బాధ్యతలను చేపట్టగలుగుతారు. ఇది దాదాపు లాంఛనప్రాయమే అయినా, పలు దేశాలు తమ అభ్యర్థుల పేర్లు ప్రతిపాదించడానికి మార్చి 14 వరకూ బోర్డ్‌ సమయం ఇచ్చింది. ట్రంప్‌ ప్రభుత్వంలో ప్రస్తుతం మాల్పాస్‌ ఆర్థిక శాఖకు సంబంధించి

Most from this category