STOCKS

News


సెయిల్‌కు రూ.554 ​కోట్ల లాభం

Saturday 3rd November 2018
news_main1541230352.png-21681

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని స్టీల్‌ కంపెనీ సెయిల్‌ సెప్టెంబర్‌ క్వార్టర్‌కు రూ.553.69 కోట్ల స్టాండలోన్‌ లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.539 కోట్ల నష్టంతో పోలిస్తే మంచి పనితీరు చూపించింది. ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.13,666 కోట్లతో పోలిస్తే 23 శాతం పెరిగి రూ.16,832 కోట్లకు చేరుకుంది. మొత్తం వ్యయాలు సైతం రూ.15,950 కోట్లకు పెరిగాయి. ఎబిట్డా 156 శాతం వృద్ధితో రూ.2,473 కోట్లుగా నమోదైంది. సామర్థ్యం మేరకు నిర్వహణ, రైల్వే అవసరాలైన చక్రాలు, యాక్సిల్స్‌ను సమకూర్చడం తమ ప్రాధాన్యతలని సెయిల్‌ చైర్మన్‌ అనిల్‌కుమార్‌ చౌదరి తెలిపారు. కొత్త ఉత్పత్తులతో కస్టమర్లను చేరుకోవడంపై దృష్టి సారిస్తామన్నారు. కంపెనీ నిర్వహణ పనితీరు, లాభాల్లో వేగవంతమైన రికవరీ, విస్తరణ, ఆధునికీకరణ అనుకూలతలను పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు చేసిన సమష్టి కృషి ఫలితమే ఇదని కంపెనీ పేర్కొంది.



You may be interested

12శాతం తగ్గిన ఐఓసీ లాభం

Saturday 3rd November 2018

రూ.3,246 కోట్లకు పరిమితం  కరెన్సీ మారక నష్టాలు, రిఫైనరీ మార్జిన్ల తగ్గుదల న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్‌ కంపెనీ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ) సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో రూ.3,246 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.3,696 కోట్లతో పోలిస్తే 12.6 శాతం తగ్గిపోయింది. విదేశీ మారక నష్టాలు, చమురు రిఫైనరీ మార్జిన్లు తగ్గుదల నికర లాభానికి చిల్లు పెట్టాయి. షేరు వారీ

రూపాయికి ఫుల్‌ జోష్‌

Saturday 3rd November 2018

ఒక్క రోజులోనే 100 పైసలు బలోపేతం డాలర్‌తో 72.45కు చేరిక ముంబై: ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి కుమ్మేసింది. శుక్రవారం ఒకే రోజు డాలర్‌తో 100 పైసలు బలపడి 72.45కు వచ్చేసింది. గడిచిన ఐదేళ్లలో (2013 సెప్టెంబర్‌ తర్వాత) రూపాయి ఒకే రోజు ఇంతగా లాభపడిన సందర్భం ఇదే. చమురు ధరలు శాంతించడం, ఇరాన్‌ నుంచి చమురు దిగుమతుల విషయంలో భారత్‌కు అమెరికా మినహాయింపునిచ్చే అవకాశాలు, ఈక్విటీ మార్కెట్లోకి విదేశీ పెట్టుబడుల రాక రూపాయిని

Most from this category