STOCKS

News


డబ్బుల్లేవ్.. డివిడెండ్ ఇవ్వలేం..

Saturday 1st September 2018
news_main1535780467.png-19868

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ౾ఉక్కు సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్‌) .. గత ఆర్థిక సంవత్సరానికి గాను డివిడెండ్ చెల్లించలేమంటూ కేంద్రానికి స్పష్టం చేసింది. నగదు గానీ, బ్యాంక్ బ్యాలెన్స్‌ గానీ లేకపోవడమే ఇందుకు కారణమని పేర్కొంది. మిగతా అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే కేంద్రానికి సెయిల్ రూ. 2,171 కోట్లు చెల్లించాల్సి ఉంది. "మా దగ్గర నగదు గానీ బ్యాంక్ బ్యాలెన్స్ గానీ లేదు. డివిడెండ్ చెల్లించాలంటే మార్కెట్ నుంచి రుణం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో రుణ సమీకరణ అనేది చాలా కష్టతరం. ఉక్కు పరిశ్రమలకు ఆర్థిక సంస్థలు, బ్యాంకులు మరిన్ని రుణాలివ్వడానికి సుముఖంగా లేవు" అని కేంద్రానికి రాసిన వివరణ లేఖలో సెయిల్ పేర్కొంది. ఈ పరిణామాలతో ప్రభుత్వ రంగ సంస్థల నుంచి డివిడెండ్లు, లాభాల్లో వాటాల రూపంలో కనీసం రూ. 1.06 లక్షల కోట్లు సమీకరించాలని బడ్జెట్‌లో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించడం కేంద్రానికి మరింత కష్టతరంగా మారనుంది. 2017-18లో కంపెనీ నష్టాలను నమోదు చేసిన నేపథ్యంలో కేంద్రానికి డివిడెండ్ చెల్లించే పరిస్థితులు లేవని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు సంస్థ ఆదాయంలో రుణ నిష్పత్తి చాలా అధిక స్థాయిలో ఉన్నట్లు వివరించాయి. ఈ ఆర్థిక సంవత్సరం సెయిల్ రూ. 3,220 కోట్లు రుణాలను తిరిగి చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తాన్ని రీపేమెంట్ చేసేందుకు కూడా కంపెనీ రుణం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. అటు, సెయిల్ క్రమంగా ఉత్పత్తిని పెంచుకుంటోందని.. వచ్చే ఆర్నెల్ల నుంచి ఏడాది వ్యవధిలో టర్నెరౌండ్ కాగలదని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరీ బీరేందర్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం సెయిల్ షేరు ధర బీఎస్‌ఈలో 1.3 శాతం క్షీణించి రూ. 79.85 వద్ద ముగిసింది. 



You may be interested

బెర్జర్‌ పెయింట్స్‌ అమ్మొచ్చు

Saturday 1st September 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ కోటక్‌ సెక్యూరిటీస్‌ తాజాగా బెర్జర్‌ పెయింట్స్‌ స్టాక్‌ను విక్రయించవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం.. బ్రోకరేజ్‌: కోటక్‌ సెక్యూరిటీస్‌ స్టాక్‌: బెర్జర్‌ పెయింట్స్‌ రేటింగ్‌: విక్రయించవచ్చు ప్రస్తుత ధర: రూ.334 టార్గెట్‌ ప్రైస్‌: రూ.305 కోటక్‌ సెక్యూరిటీస్‌ తాజాగా బెర్జర్‌ పెయింట్స్‌ను విక్రయించవచ్చని సిఫార్సు చేసింది. గత కొన్ని క్వార్టర్లుగా కంపెనీ అటు డెకొరేటివ్‌, ఇటు ఇండస్ట్రీయల్‌ పెయింట్స్‌ విభాగాల్లో బలమైన విక్రయాలను సాధిస్తూ వచ్చిందని పేర్కొంది. ఆర్థిక పనితీరును క్రమంగా మెరుగుపరుచుకుంటూ వచ్చిందని

జెట్‌ ఎయిర్‌వేస్‌ ఖాతాల తనిఖీకి కేంద్రం ఆదేశం

Saturday 1st September 2018

న్యూఢిల్లీ: ఆర్థిక సమస్యల్లో ఉన్న జెట్‌ఎయిర్‌వేస్‌ ఖాతా పుస్తకాలు, పత్రాల తనిఖీకి ఆదేశించినట్టు కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పీపీ చౌదరి తెలిపారు. కంపెనీల చట్టంలోని సెక్షన్‌ 206 (5) కింద ఇందుకు ఆదేశించినట్టు చెప్పారు. మరోవైపు ఓ ఫిర్యాదు ఆధారంగా కార్పొరేట్‌ గవర్నెన్స్‌ లోపాల గురించి జెట్‌ ఎయిర్‌వేస్‌ను కేంద్ర కార్పొరేట్‌ శాఖ పరిధిలోని రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్‌వోసీ) వివరణ కోరింది. తాజా పరిణామంపై

Most from this category