STOCKS

News


14 రెట్లు పెరిగిన సెయిల్‌ లాభం

Friday 8th February 2019
news_main1549606374.png-24086

  • రూ.616 కోట్లకు నికర లాభం
  • రూ.15,910 కోట్లకు మొత్తం ఆదాయం

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఉక్కు కంపెనీ, సెయిల్‌ ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్లో రూ.616 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.43 కోట్ల నికర లాభం వచ్చిందని, దాదాపు 14 రెట్లు వృద్ధి సాధించామని సెయిల్‌ తెలిపింది. ఆదాయం అధికంగా రావడం, నిల్వల స్థాయి తక్కువగా ఉండటంతో ఈ స్థాయి నికర లాభం వచ్చిందని సెయిల్‌ చైర్మన్‌ అనిల్‌ కుమార్‌ చౌధురి చెప్పారు. గత క్యూ3లో రూ.15,443 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో రూ.15,910 కోట్లకు పెరిగిందని తెలిపారు. మొత్తం వ్యయాలు రూ.15,318 కోట్ల నుంచి రూ.14,937 కోట్లకు తగ్గాయని వివరించారు.
10 శాతం పెరిగిన ఉత్పత్తి
గత క్యూ3లో 3.9 మిలియన్‌ టన్నులుగా ఉన్న ముడి ఉక్కు ఉత్పత్తి ఈ క్యూ3లో 10 శాతం వృద్ధితో 4.3 మిలియన్‌ టన్నులకు పెరిగిందని అనిల్‌ కుమార్‌ వెల్లడించారు. ఇదే తమ కంపెనీ చరిత్రలో అత్యధిక ఉత్పత్తి అని పేర్కొన్నారు. భారత్‌లో ఇదే అతి పెద్ద ఉక్కు కంపెనీ. ఐదు సమగ్ర ప్లాంట్లు, మూడు ప్రత్యేక స్టీల్‌ ప్లాంట్లతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.



You may be interested

కొన్ని ప్రధాన కంపెనీ క్యూ3 ఫలితాల వివరాలు

Friday 8th February 2019

అరబిందో మధ్యంతర డివిడెండు 125 శాతం ఔషధ రంగ సంస్థ అరబిందో ఫార్మా రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రెండవ మధ్యంతర డివిడెండు 125 శాతం చెల్లించాలన్న ప్రతిపాదనకు బోర్డు సమ్మతి తెలిపింది. డిసెంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో అరబిందో ఫార్మా మెప్పించింది. ఈ కాలంలో నికరలాభం రూ.712 కోట్లు సాధించింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 19.66 శాతం అధికం. టర్నోవరు రూ.4,336 కోట్ల

శామ్‌శాంగ్‌ టాప్‌-3లో బిగ్‌ సీ

Friday 8th February 2019

భారత్‌లో ఈ బ్రాండ్‌ ఫోన్ల విక్రయాల్లో జోరు హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: శామ్‌సంగ్‌ మొబైల్స్‌ విక్రయాల్లో భారత్‌లో టాప్‌-3 స్థానాన్ని మల్టీ బ్రాండ్‌ మొబైల్స్‌ రిటైల్‌ చైన్‌ ‘బిగ్‌ సి’ దక్కించుకుంది. ఈ సందర్భంగా శామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ సౌత్‌ వెస్ట్‌ ఆసియా ప్రెసిడెంట్‌ హెచ్‌.సి.హాంగ్‌ హైదరాబాద్‌లోని బిగ్‌ సి కార్యాలయానికి గురువారం విచ్చేశారు. బిగ్‌ సి ఫౌండర్‌ ఎం.బాలు చౌదరిని ప్రత్యేకంగా అభినందించారు. శామ్‌సంగ్‌ ప్రవేశ పెట్టిన ప్రతి మోడల్‌ అమ్మకాల్లో

Most from this category