STOCKS

News


కృష్ణపట్నం రైల్వేలో సాగరమాల పెట్టుబడులు

Wednesday 14th November 2018
news_main1542174536.png-21989

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కృష్ణపట్నం రైల్వే కంపెనీలో (కేఆర్‌సీఎల్‌) సాగరమాల డెవలప్‌మెంట్‌ కంపెనీ రూ.125 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఓబుళాపురం, కృష్ణపట్నం పోర్ట్‌ రైల్‌ కారిడార్‌ అనుసంధానం కోసం ఈ నిధులను సమీకరించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 114 కిలోమీటర్ల ఈ ప్రాజెక్ట్‌ మొత్తం వ్యయం రూ.1,850 కోట్లు. ఈ మార్గం అనుసంధానంతో కృష్ణపట్నం పోర్ట్‌కు ఒకవైపు వెంకటాచలం, మరో మార్గంలో ఓబులాపురం అనుసంధానం అవుతాయి. రైల్వే వికాస్‌ నిగమ్‌తో (ఆర్‌వీఎన్‌ఎల్‌) జాయింట్‌ వెంచర్‌గా కృష్ణపట్నం రైల్వే కంపెనీ ఏర్పాటయింది. దీన్లో ఆర్‌వీఎన్‌ఎల్‌కు 30 శాతం, కృష్ణపట్నం పోర్ట్‌కు 30 శాతం, ఎన్‌ఎండీసీకి 15 శాతం, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి 13 శాతం, బీఐఎల్‌కు 12 శాతం వాటాలున్నాయి.



You may be interested

చమురు ధరలు పతనంతో పెట్రో షేర్ల ర్యాలీ

Wednesday 14th November 2018

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల పతనం ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ(ఓఎంసీ) షేర్లకు కలిసొస్తుంది. అధిక డిమాండ్‌ , సరఫరా అంచనాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ ఒక్కరోజులోనే 4.65 డాలర్ల పతనమై 65.03 డాలర్ల వద్దకు చేరుకున్నాయి. చమురుధరలు పతనంతో కంపెనీ మార్జిన్లు పెరుగవచ్చనే అంచనాలతో ఓఎంసీ షేర్ల ర్యాలీ కొనసాగుతోంది.  నేడు ఓఎంసీ షేర్లలో ప్రధానంగా హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఐఓసీ షేర్లు 12శాతం ర్యాలీ చేశాయి. నిఫ్టీ-50

క్రూడ్‌ క్రాష్‌...భారత్‌కు లబ్ది

Wednesday 14th November 2018

65.03 డాలర్లకు పతనమైన బ్రెంట్‌ క్రూడ్‌ ఒక్కరోజులోనే 4.65 డాలర్ల పతనం అభివృద్ధి చెందుతున్న దేశాలకు సానుకూలం ముంబై: ముడిచమురు ధరలు భారీగా పతనమయ్యాయి. ఒక్కరోజులోనే 7.1 శాతం పడిపోయాయి.  మంగళవారం రాత్రి అంతర్జాతీయ మార్కెట్లో జరిగినఈ భారీ పతనం.. గడిచిన మూడేళ్లలో అతి పెద్దది.  జనవరి 19తో ముగిసే బ్యారెల్‌ బ్రెంట్ ఆయిల్ ఫ్యూచర్స్ బుధవారం ఉదయం ట్రేడింగ్‌లో 65.03 డాలర్ల కనిష్టస్థాయిని నమోదుచేసింది. మంగళవారం ఉదయం 10 గంటల సమయానికి (భారత

Most from this category