‘ఓలా’లో సచిన్ బన్సల్ రూ.150 కోట్ల పెట్టుబడి
By Sakshi

న్యూఢిల్లీ: ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సల్ ప్రముఖ ట్యాక్సీ ప్లాట్ ఫామ్ ఓలాలో రూ.150 కోట్లు పెట్టుబడి పెట్టారు. కార్పొరేట్ వ్యవహారాల శాఖ వద్ద కంపెనీ సమర్పించిన పత్రాల్లో ఈ మేరకు వివరాలు ఉన్నాయి. 70,588 తప్పనిసరిగా మార్చుకోవాల్సిన క్యుములేటివ్ సిరీస్ జే ప్రిఫరెన్స్ షేర్లను (ముఖ విలువ ఒక్కోటీ రూ.10) సబ్‌స్క్రప్షన్ ధర రూ.21,250 చొప్పున ఆయనకు కేటాయించినట్టు ఓలా ఆ పత్రాల్లో తెలియజేసింది. ఈ మొత్తం విలువ రూ.150 కోట్లు అవుతుంది. ఫ్లిప్‌కార్ట్‌ను వాల్‌మార్ట్ కొనుగోలు చేసిన తర్వాత ఆ సంస్థలో తన వాటాను పూర్తిగా విక్రయించి సచిన్ బన్సల్ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. కాగా, విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన సమాచారం మేరకు... సచిన్ బన్సల్ రూ.650 కోట్లను ఓలాలో ఇన్వెస్ట్ చేయనున్నట్టు, రూ.150 కోట్లు అందులో భాగమని తెలిసింది.
You may be interested
ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలకు ప్రోత్సాహకాలు
Tuesday 15th January 2019రుణ హామీ, వడ్డీ సబ్సిడీ కల్పించే యోచనలో కేంద్రం న్యూఢిల్లీ: దేశీయంగా ఎలక్ట్రానిక్ తయారీ సంస్థలను ప్రోత్సహించే దిశగా కొత్త విధానంపై కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రూ. 100 కోట్ల దాకా టర్మ్ రుణాలకు హామీనివ్వడం, రూ. 1,000 కోట్ల దాకా రుణాలకు సంబంధించి వడ్డీ సబ్సిడీనివ్వడం తదితర అంశాలను పరిశీలిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. "కొత్త ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ ఏర్పాటు కోసం గానీ.. ఇప్పటికే ఉన్న
తగ్గిన ధరలతో రేటు కోత డిమాండ్!
Tuesday 15th January 2019డిసెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 2.19 శాతం 18 నెలల కనిష్టం టోకు ధరలదీ దిగువబాటే! ఎనిమిది నెలల కనిష్ట స్థాయి... 3.80 శాతానికి డౌన్ ఆర్బీఐ వడ్డీరేట్ల కోతకు అవకాశమంటున్న పరిశ్రమలు న్యూఢిల్లీ: ధరల భయాలు డిసెంబర్లో తక్కువగా ఉన్నాయని సోమవారం విడుదలైన అధికారిక గణాంకాలు పేర్కొన్నాయి. ఈ నెలలో టోకు, రిటైల్ ద్రవ్యోల్బణం రెండు తగ్గుముఖం పట్టాయని లెక్కలు వెల్లడించాయి. దీనితో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ