STOCKS

News


టాటా మోటార్స్ రేటింగ్స్ డౌన్‌గ్రేడ్‌

Wednesday 5th December 2018
news_main1543985157.png-22647

న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్‌, దాని అనుబంధ బ్రిటన్ సంస్థ జాగ్వార్ ల్యాండ్‌ రోవర్ (జేఎల్‌ఆర్‌) రేటింగ్స్‌ను ఎస్‌అండ్‌పీ సంస్థ డౌన్‌గ్రేడ్ చేసింది. బలహీన లాభదాయకత అంచనాలతో క్రెడిట్ రేటింగ్‌ను, సీనియర్ అన్‌సెక్యూర్డ్ నోట్స్‌ రేటింగ్‌ను ప్రస్తుత 'బిబి' స్థాయి నుంచి 'బిబి మైనస్‌' స్థాయికి ఎస్‌అండ్‌పీ కుదించినట్లు టాటా మోటార్స్ తెలిపింది. అలాగే, ఇదే కారణంతో జేఎల్‌ఆర్‌ రేటింగ్‌ను కూడా 'బిబి' స్థాయి నుంచి 'బిబి మైనస్' స్థాయికి డౌన్‌గ్రేడ్ చేసినట్లు వివరించింది. వ్యాపారపరంగా అనిశ్చితి పరిస్థితులు, ఫలితంగా రుణాలను చెల్లించలేని పరిస్థితి తలెత్తే అవకాశాలను బిబి రేటింగ్‌ సూచిస్తుంది. జేఎల్‌ఆర్‌ నిర్వహణ పనితీరు బలహీనంగా ఉండొచ్చన్న అభిప్రాయంతో టాటా మోటార్స్ రేటింగ్ అంచనాలను మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ గత నెల 'స్థిర' స్థాయి నుంచి 'ప్రతికూల' స్థాయికి కుదించింది. You may be interested

డీఆర్‌ఐ భేష్‌!

Wednesday 5th December 2018

న్యూఢిల్లీ: దేశ ఆర్థికవ్యవస్థకు పెనుముప్పుగా పరిణమించే కేసులను డీల్‌ చేసే డీఆర్‌ఐ(డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటిలిజెన్స్‌)పై ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రశంసల వర్షం కురిపించారు. దేశంలోని అన్ని విచారణా సంస్థలు, ఏజన్సీల్లో డీఆర్‌ఐ మాత్రమే ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా పనిచేస్తోందని ఆయన కితాబిచ్చారు. తన పనేదో తాను చూసుకోవడం, తన పరిధి మేరకు ప్రవర్తించడం వల్లనే డీఆర్‌ఐ వివాదాల జోలికి పోకుండా పనిచేస్తోందన్నారు. దేశానికి, దేశ భద్రతకు వాటిల్లే

నోట్ల రద్దుతో పెరిగిన ఐటీ రిటర్నులు

Wednesday 5th December 2018

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా ఆదాయ పన్ను రిటర్నులు (ఐటీ రిటర్న్స్‌) దాఖలు చేసిన వారి సంఖ్య 6.08 కోట్లకు పెరిగిందని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ సుశీల్ చంద్ర వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధితో పోలిస్తే ఇది దాదాపు 50 శాతం అధికమని, పెద్ద నోట్ల రద్దు ఇందుకు గణనీయంగా తోడ్పడిందని ఆయన వెల్లడించారు. "పన్ను రిటర్నులు దాఖలు చేసే వారి

Most from this category