STOCKS

News


భారత్‌లో అస్తవ్యస్త పన్ను విధానాలు

Saturday 6th October 2018
news_main1538801627.png-20906

న్యూఢిల్లీ: భారత్‌లో పన్ను విధానాలు అస్తవ్యస్తంగా ఉన్నాయంటూ రష్యన్ ఇంధన దిగ్గజం రాస్‌నెఫ్ట్‌ విమర్శించింది. దేశంలో కార్యకలాపాల విస్తరణకు ఇవే ప్రధాన అడ్డంకులుగా ఉన్నాయంటూ వ్యాఖ్యానించింది. "భారతీయ కంపెనీ రష్యాలో ఇన్వెస్ట్ చేస్తే.. సాధారణంగానే పన్నులు కట్టాల్సి ఉంటుంది. డివిడెండ్లు ఇవ్వాల్సి ఉంటుంది. అదే మా కంపెనీ గానీ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే.. పన్నులు, డివిడెండ్లతో పాటు మాపై మరో 20 శాతం మేర విత్‌హోల్డింగ్ ట్యాక్స్ కూడా విధిస్తున్నారు. ఇది సబబుగా లేదు" అని రాస్‌నెఫ్ట్‌ ఫస్ట్‌ వైస్ ప్రెసిడెంట్‌ ఫర్ ఎకనామిక్స్‌ అండ్ ఫైనాన్స్‌ పావెల్ ఫెదరోవ్ వ్యాఖ్యానించారు. గుజరాత్‌లోని వడినార్‌ రిఫైనరీకి సంబంధించి పన్ను క్రెడిట్స్‌ను  క్లెయిమ్ చేసుకోలేకపోతున్నామని ఆయన చెప్పారు. భారత మార్కెట్‌ వృద్ధి అవకాశాలు అపారంగా ఉన్నందునే ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలని తాము భావిస్తున్నామని, కానీ పన్నుల విధానాలతోనే సమస్యలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. 
    విదేశీ ఇన్వెస్టర్లపై ద్వంద్వ పన్నులను వడ్డించకుండా భారత్ అంతర్జాతీయ స్థాయి పన్ను ప్రమాణాలను పాటించాలని ఫెదరోవ్ అభిప్రాయపడ్డారు. ఈ సమస్య పరిష్కారానికి రెండు దేశాల ప్రభుత్వాలు చర్చించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, వస్తు, సేవల పన్నుల విధానంతో కూడా చిక్కులున్నాయని ఫెదరోవ్ పేర్కొన్నారు. భారత మార్కెట్లోకి భారీ స్థాయిలో చమురు వస్తున్నప్పటికీ, పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి చేర్చకపోవడం వల్ల జీఎస్‌టీ క్రెడిట్‌ను క్లెయిమ్ చేసుకోవడానికి లేకుండా పోయిందన్నారు. 
    రాస్‌నెఫ్ట్, దాని భాగస్వామ్య సంస్థలు గతేడాది 12.9 బిలియన్ డాలర్లతో ఎస్సార్ ఆయిల్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్‌లో సంస్థ పేరును నయారా ఎనర్జీగా మార్చారు. ఇందులో రాస్‌నెఫ్ట్‌కు 49.13 శాతం, అంతర్జాతీయ కమోడిటీ ట్రేడింగ్ సంస్థ ట్రాఫిగురా.. రష్యాకి చెందిన యూసీపీ ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్‌నకు సంయుక్తంగా 49.13 శాతం వాటాలు ఉండగా, మిగతా 0.74 శాతం.. రుయాల వద్ద ఉంది. గుజరాత్‌లోని వడినార్‌లో 20 మిలియన్ టన్నుల వార్షిక సామర్ధ్యంతో రిఫైనరీ ఉన్న నయారా.. దేశవ్యాప్తంగా 4,756 పెట్రోల్ బంకులు నిర్వహిస్తోంది. 



You may be interested

పెరిగిన పసిడి ధర

Saturday 6th October 2018

అమెరికా సెప్టెంబర్‌ ఉద్యోగ గణాంకాలు అంచనాలను అందుకోలేకపోవడం శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర 5డాలర్లు లాభపడింది. సెప్టెంబర్‌ నెలలో అంచనాల కంటే తక్కువగా 1,34,000 ఉద్యోగ కల్పన మాత్రమే జరిగింది. దీంతో నిరుద్యోగ రేటు 3.7 శాతంగా నమోదైంది. అంచనాల కంటే తక్కువగా 1,34,000 ఉద్యోగ కల్పన మాత్రమే జరిగింది. దీంతో నిరుద్యోగ రేటు 3.7 శాతంగా నమోదైంది. సెప్టెంబర్‌లో 185,000 ఉద్యోగాల సృష్టి జరుగుతుందని

ఆఫ్‌షోర్‌లో 74 మార్క్‌కు దిగువునే రూపీ

Saturday 6th October 2018

ఆఫ్‌షోర్‌ మార్కెట్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ శుక్రవారం రాత్రి 74 మార్క్‌ దిగువకు పడిపోయింది. 74.16 వద్ద ముగిసింది. ఒకానొక సమయంలో 74.63 స్థాయికి కూడా పతనమైంది. దీంతో దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే సోమవారం రూపాయి నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశముంది.  ఇండియన్‌ రూపాయి శుక్రవారం ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో నిట్టనిలువునా కుప్పకూలింది. క్రూడ్‌ ధరల పెరుగుదల, డాలర్‌ బలపడటం వంటి వాటితో ఇప్పటికే ఒత్తిడి

Most from this category