STOCKS

News


జీనోమ్‌ వ్యాలీకి కంపెనీల వెల్లువ

Friday 7th September 2018
news_main1536296743.png-20048

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: హైదరాబాద్‌లోని ఇన్నోవేషన్‌, లైఫ్‌ సైన్సెస్‌ క్లస్టర్‌ అయిన జీనోమ్‌ వ్యాలీలో కొత్త కంపెనీలు కొలువుదీరుతున్నాయి. రూ.800 కోట్ల విలువైన ప్రాజెక్టులను తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు గురువారం ఆవిష్కరించారు. బయోటెక్నాలజీ కంపెనీ జెనెసిస్‌ బయాలాజిక్స్‌ అత్యాధునిక తయారీ యూనిట్‌ను ఈ సందర్భంగా ప్రారంభించింది. ఈ కేంద్రం కోసం కంపెనీ మొత్తం రూ.350 కోట్లు వెచ్చించనుంది. కెనడాకు చెందిన జనరిక్‌ డ్రగ్‌ కంపెనీ జంప్‌ ఫార్మా తన ఆర్‌అండ్‌డీ, తయారీ కోసం సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం రూ.250 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. రెండేళ్లలో ప్రత్యక్షంగా 2,000 మందికి ఉపాధి లభించనుంది. లక్సాయ్‌ లైఫ్‌ సైన్సెస్‌ 50,000 చదరపు అడుగుల ఫెసిలిటీని ప్రారంభించింది. టచ్‌స్టోన్‌ స్క్వేర్‌ పేరుతో రూ.150 కోట్ల అంచనా వ్యయంతో నెలకొల్పనున్న ఆర్‌అండ్‌డీ పార్క్‌కు శంకుస్థాపన జరిగింది. 



You may be interested

2020 ఏప్రిల్‌ నాటికి బీఎస్‌-6 ఇంధన లభ్యత: ప్రధాన్‌

Friday 7th September 2018

న్యూఢిల్లీ: భారత్‌ స్టేజ్‌-6 (బీఎస్‌-6) ఇంధనాన్ని 2020 నాటికి అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. అలాగే, భవిష్యత్‌ ఇంధనాల విషయంలో స్థిరత్వాన్ని తీసుకొస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. సియామ్‌ వార్షిక సదస్సులో మాట్లాడుతూ... ‘‘దేశ రాజధానిలో బీఎస్‌-6 ఇంధనం ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చాం. మా వైపు నుంచి ఎటువంటి అస్పష్టత లేదు. 2020 ఏప్రిల్‌ 1 నాటికి దేశవ్యాప్తంగా బీఎస్‌6

మాస్టర్‌ ఫండ్‌లో టెమసెక్‌ పెట్టుబడులు

Friday 7th September 2018

 ముంబై: నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌(ఎన్‌ఐఐఎఫ్‌)లో సింగపూర్‌కు చెందిన టెమసెక్‌ హోల్డింగ్స్‌... రూ.2,750 కోట్లు (40 కోట్ల డాలర్లు) పెట్టుబడులు పెట్టనుంది. తమ మాస్టర్‌ ఫండ్‌లో టెమసెక్‌ ఈ మేరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు ఎన్‌ఐఐఎఫ్‌ వెల్లడించింది. దీంతో తమ ఫండ్‌లో ఇన్వెస్టర్ల సంఖ్య ఏడుకు చేరనున్నట్లు ఎన్‌ఐఐఎఫ్‌ ఎమ్‌డీ, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సుజోయ్‌ బోస్‌ చెప్పారు. ఈ ఫండ్‌లో ఇప్పటికే భారత ప్రభుత్వం, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్‌ అధారిటీ, హెచ్‌డీఎఫ్‌సీ

Most from this category