STOCKS

News


జడ్చర్లలో డీఎస్‌ఎం న్యూట్రిషన్‌ ప్లాంటు

Tuesday 16th October 2018
news_main1539664105.png-21180

జడ్చర్ల: జంతువుల పోషకాహార విభాగంలో ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్న డీఎస్‌ఎం సంస్థ... మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్జర్ల మండలంలోని పోలేపల్లి గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌లో తన ప్లాంటును ఏర్పాటు చేసింది. మహారాష్ట్రలోని అంబార్‌లో తొలి ప్లాంటును ఏర్పాటు చేసిన ఈ సంస్థ... తన రెండో ప్లాంటును జడ్చర్లలో సోమవారం ఆరంభించింది. ఈ సందర్భంగా డీఎస్‌ఎం న్యూట్రీషియనల్‌ ప్రొడక్ట్స్‌ ప్రెసిడెంట్‌ డేవిడ్‌ బ్లాకెమోర్‌ మాట్లాడుతూ... యానిమల్‌ న్యూట్రిషన్‌కు సంబంధించి భారతీయుల్లో అవగాహన పెరుగుతోందని, దీంతో భారత మార్కెట్లో ఎదిగేందుకు విసృ‍్తత అవకాశాలున్నాయని చెప్పారు. జంతువులకూ పోషక పదార్థాలు అవసరమన్నారు. తమ రెండు ప్లాంట్ల ద్వారా ఉత్తర, దక్షిణ భారతాల్లో విస్తరిస్తామని, తరవాత పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, నేపాల్‌కు సైతం తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తామని చెప్పారాయన. దాదాపు 174 దేశాలలో కార్యకలాపాలున్న డీఎస్‌ఎం టర్నోవరు రూ.2 వేల కోట్ల వరకూ ఉంది. ఈ కార్యక్రమంలో బిజినెస్‌ యూనిట్‌ డైరెక్టర్‌ రవీంద్ర, డీఎస్‌ఎం ఇండియా ప్రెసిడెంట్‌ రాజగోపాల్, స్థానిక సైట్‌ మేనేజర్‌ ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు.



You may be interested

పేటెంటు కేసులో నాట్కో భాగస్వామికి ఊరట

Tuesday 16th October 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఫార్మా కంపెనీ టెవా తయారీ కొపాగ్జోన్‌ 40 ఎంజీ పేటెంట్లు చెల్లవని యునైటెడ్‌ స్టేట్స్‌ కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్స్‌ స్పష్టం చేసింది. డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ డెలావర్‌ నిర్ణయాన్ని కోర్టు సమర్థించిందని ఔషధ కంపెనీ నాట్కో సోమవారం తెలిపింది. గ్లాటిరామెర్‌ ఎసిటేట్‌ ఇంజెక్షన్‌ 40 ఎంజీ విషయంలో నాట్కో ఫార్మా మార్కెటింగ్‌ భాగస్వామి అయిన మైలాన్‌ యూఎస్‌ కోర్టులో ఎదుర్కొంటున్న పేటెంటు ఉల్లంఘన కేసులు ఇంతటితో వీగిపోయాయి.

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 16th October 2018

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు సౌతిండియా బ్యాంక్‌:- బాసెల్‌-3 నిబంధనలకు అనుగుణమైన టైర్‌-2 బాండ్ల జారీ ద్వారా రూ. 500 కోట్లను సమీకరించాలని బోర్డు నిర్ణయించింది. గ్లోబల్‌ స్పిరిట్స్‌:- బీహార్‌ యూనిట్‌ను పునరుద్ధరించి వాణిజ్య ఉత్పత్తుల తయారీని ప్రారంభించింది. టీవీ టుడే నెట్‌వర్క్స్‌:- తన అనుబంధ సంస్థ ఇండియా టుడే ఆన్‌లైన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి ఇన్‌కం టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ రూ.69 కోట్లు చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. ఇన్ఫీబీమ్‌ అవెన్యూస్‌:-

Most from this category