STOCKS

News


జియోకి 2 అనుబంధ కంపెనీలు!!

Wednesday 12th December 2018
news_main1544597911.png-22860

టెలికం ఆపరేటర్‌ రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ తన ఫైబర్‌, టవర్‌ ఆస్తులను విడగొట్టి వేర్వేరు కంపెనీలుగా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. వీటి పేర్లు తెలియాల్సి ఉంది. రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ బోర్డు కూడా ఫైబర్‌, టవర్ల ఆస్తులను విడగొట్టడానికి తాజాగా అంగీకారం తెలిపింది. మంగళవారం జరిగిన కంపెనీ బోర్డు డైరెక్టర్లు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు జియో తెలియజేసింది. కాగా వేర్వేరు కంపెనీల ఏర్పాటు సంబంధిత విభాగాల రెగ్యులేటరీల ఆమోదంపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది. ఫైబర్‌, టవర్‌ ఆస్తులను విడగొట్టడం వల్ల ఒక కంపెనీ టవర్‌ సర్వీసులను, మరొక కంపెనీ ఫైబర్‌ సర్వీసులను అందిస్తుంది. దీని వల్ల కార్యకలాపాల నిర్వహణ సులభతరమౌతుంది. 
రిలయన్స్‌ జియోకి 2.2 లక్షల టవర్లు, దాదాపుగా 3 లక్షల కిలోమీటర్ల ఆప్టికల్‌ ఫైబర్‌ అసెట్స్‌ ఉన్నాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ టెలికం విభాగమైన జియో.. ఫిక్స్‌డ్‌ లైన్‌ బ్రాడ్‌బాండ్‌ సంస్థలైన డెన్‌ నెట్‌వర్క్స్‌, హాత్‌వే కేబుల్‌ సంస్థలను కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. 



You may be interested

ఏడాది కోసం టాప్‌టెన్‌ సిఫార్సులు

Wednesday 12th December 2018

వచ్చే సంవత్సర కాలంలో దాదాపు 50 శాతం వరకు రాబడినిచ్చే పది స్టాకులను వివిధ బ్రోకరేజ్‌లు సిఫార్సు చేస్తున్నాయి. 1. హెచ్‌సీఎల్‌టెక్నాలజీ: టార్గెట్‌ రూ. 1330. ఎలారా క్యాపిటల్‌ రికమండేషన్‌. ఐబీఎం నుంచి ఏడు ఉత్పత్తులను సొంతం చేసుకోవడం అత్యంత పాజిటివ్‌ అంశం. అవుట్‌సోర్సింగ్‌ డీల్స్‌లో వీటి ప్రాధాన్యం ఎంతో ఉంది. కొందరు అనుమానించినట్లు డీల్‌ కారణంగా కంపెనీ మార్కెట్‌ క్యాప్‌లో కోత పడవచ్చు. కానీ దీర్ఘకాలంలో చాలా మేలు చేసే

బ్యాంక్‌ షేర్లకు ‘‘శక్తి’’

Wednesday 12th December 2018

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కొత్త ఛైర్మన్‌గా శక్తికాంత్‌ నియామకం బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ఉత్సాహానిచ్చింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంకు ఇండెక్స్‌లు బుధవారం 1.50శాతం లాభపడ్డాయి. యస్‌బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌ 4శాతం, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ 3శాతం పెరిగాయి. సౌతిండియా, కోటక్‌ బ్యాంక్ షేర్లు 2శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు 1శాతం ర్యాలీ

Most from this category