STOCKS

News


రిలయన్స్‌ ఇన్‌ఫ్రా నికర లాభం 49 శాతం డౌన్‌

Friday 16th November 2018
news_main1542347693.png-22078

న్యూఢిల్లీ: అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీ నికర లాభం కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 49 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.544 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.277 కోట్లకు తగ్గిందని రిలయన్స్‌ ఇన్‌ఫ్రా తెలిపింది. ఈ క్యూ2లో రూ.4,200 కోట్ల మేర వన్‌ టైమ్‌ కేటాయింపులు జరిపామని, ఈ కేటాయింపులు లేకుంటే నికర లాభం 723 శాతం వృద్ధితో రూ.4,477 కోట్లకు పెరిగేదని వివరించింది. మొత్తం ఆదాయం రూ.5,899 కోట్ల నుంచి రూ.7,207 కోట్లకు పెరిగిందని పేర్కొంది.  
65 శాతం తగ్గిన రుణ భారం 
గత క్యూ2లో రూ.22,000 కోట్లుగా ఉన్న రుణ భారం ఈ క్యూ2లో 65 శాతం తగ్గి రూ.6,900 కోట్లకు చేరిందని కంపెనీ పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 నాటికి ఆర్డర్‌ బుక్‌ రూ.27,800 కోట్లుగా ఉందని వివరించింది. స్టాండ్‌ అలోన్‌ పరంగా చూస్తే, గత క్యూ2లో రూ.2,181 కోట్లుగా ఉన్న నికర అమ్మకాలు ఈ క్యూ2లో రూ.222 కోట్లకు తగ్గాయని తెలిపింది. ఇక నికర లాభం రూ.595 కోట్ల నుంచి 66 శాతం తగ్గి రూ.204 కోట్లకు పరిమితమైందని పేర్కొంది. ఎబిటా రూ.1,125 కోట్ల నుంచి 3 శాతం తగ్గి రూ.1,090 కోట్లకు చేరిందని వివరించింది. విద్యుత్తు, రహదారులు, మెట్రో రైలు, రక్షణ రంగాల్లో వివిధ స్పెషల్‌ పర్పస్‌ వెహికల్స్‌ (ఎప్‌పీవీ) ద్వారా వివిధ ప్రాజెక్ట్‌లను ఈ కంపెనీ డెవలప్‌ చేస్తోంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో రిలయన్స్‌ ఇన్‌ఫ్రా షేర్‌​ 0.4 శాతం లాభపడి రూ.352 వద్ద ముగిసిందిYou may be interested

జీఐసీ, న్యూ ఇండియా ఎష్యూరెన్స్‌ల్లో ఓఎఫ్‌ఎస్‌

Friday 16th November 2018

న్యూఢిల్లీ: జీఐసీ, న్యూ ఇండియా ఎష్యూరెన్స్‌ కంపెనీల్లో మరింత వాటాను కేంద్ర ప్రభుత్వం విక్రయించనుంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌)విధానంలో ఈ రెండు బీమా కంపెనీల్లో మరింత వాటాను విక్రయించడానికి కేంద్ర ఆర్థిక శాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ రెండు కంపెనీల ఓఎఫ్‌ఎస్‌ కార్యక్రమాలను నిర్వహించడానికి ఆసక్తి గల మర్చంట్‌ బ్యాంకింగ్‌ సంస్థల నుంచి దీపమ్‌ (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌) దరఖాస్తులను ఆహ్వానించింది. సదరు

పేదరిక నిర్మూలనకు అధిక వృద్ధి రేటు కావాలి

Friday 16th November 2018

న్యూఢిల్లీ: పేదరిక నిర్మూలనకు, అభివృద్ధి ఫలాలు పేదలకు అందేందుకు అధిక వృద్ధి రేటు తప్పనిసరి అని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. ఢిల్లీలో జరిగిన సేవింగ్స్‌ అండ్‌ రిటైల్‌ బ్యాంక్స్‌ 25వ ప్రపంచ కాంగ్రెస్‌ సదస్సులో జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడటానికంటూ అభివృద్ధి ప్రయోజనాల స్వచ్ఛందంగా వేచి చూడటం మనలాంటి ఆకాంక్షలతో కూడిన సమాజానికి సరిపోదు. దానికి మనలాంటి ఆర్థిక వ్యవస్థలకు అధిక

Most from this category