STOCKS

News


రిలయన్స్‌ షేరును ఏం చేద్దాం?

Friday 19th October 2018
news_main1539931177.png-21287

శుక్రవారం ట్రేడింగ్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు దాదాపు 6 శాతం పతనమైంది. క్యు2 ఫలితాలు మిశ్రమంగా ఉండడంతో ఆర్‌ఐఎల్‌ కౌంటర్లో అమ్మకాలు పెరిగాయి. అయితే బ్రోకరేజ్‌లు మాత్రం షేరుపై బుల్లిష్‌గా ఉన్నాయి. షేరు త్వరలో అప్‌ట్రెండ్‌ చూపుతుందని అంచనా వేస్తున్నాయి. టెలికం, రిటైల్‌ విభాగాలు మంచి వృద్ది సాధిస్తున్నాయని, కొత్తగా కొనుగోలు చేసే కంపెనీలతో మంచి ఫలితాలుంటాయని చెబుతున్నాయి. 
ఆర్‌ఐఎల్‌ షేరుపై వివిధ బ్రోకరేజ్‌ల అంచనాలు ఇలా ఉన్నాయి...
1. క్రెడిట్‌ సూసీ: అవుట్‌పెర్ఫామ్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 1320. పెట్రోకెమికల్‌ విభాగం బలంగా వృద్ధిసాధిస్తోంది. రిఫైనింగ్‌ మార్జిన్లు కాస్త నిరాశ పరిచాయి. కన్జూమర్‌ వ్యాపారం మరింత వృద్ది నమోదు చేయగలదు. బ్రాడ్‌బ్యాండ్‌ ప్రణాళికలో భాగంగా కొత్త కంపెనీల కొనుగోలు మేలు చేకూరుస్తుంది. 
2. నోమురా: కొనొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ రూ. 1480. ఆర్‌జియో కస్టమర్లు అంతకంతకూ పెరుగుతున్నారు. దీంతో లాభదాయకత మరింత మెరుగుపడనుంది. కొత్త పెట్టుబడులు భవిష్యత్‌లో లాభాలనందిస్తాయి.
3. ఐడీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌: అవుట్‌పెర్ఫామ్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 1310. పెట్రోకెమికల్‌, జియో విభాగాలు అదరగొట్టాయి. రిటైల్‌ విభాగం సైతం బలమైన ఫలితాలు చూపింది. 
4. డాయిష్‌ బ్యాంక్‌: కొనొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ రూ. 1270. పెట్‌కోక్‌ గ్యాసిఫయిర్ల లాంచింగ్‌తో రిఫైనింగ్‌ మార్జిన్లు దూసుకుపోనున్నాయి. పెట్రోకెమ్‌, టెలికం విభాగాలు మంచి వృద్ది సాధిస్తున్నాయి.
5. మాక్క్వైరీ: అవుట్‌పెర్ఫామ్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 1315. పాలిస్టర్‌ చైన్‌, ఈథేన్‌ ఫీడ్‌స్టాక్‌ సోర్సింగ్‌తో పెట్రోకెమ్‌ మార్జిన్లు మరింత పెరుగుతాయి. టెలికం, జియో అద్భుత ప్రదర్శన చూపుతున్నాయి.
6. మోతీలాల్‌ఓస్వాల్‌: కొనొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ రూ. 1479. ఎబిటా అంచనాలకు అనుగుణంగా ఉంది. వాల్యూంల్లో మంచి మెరుగుదల నమోదయింది. జియో త్వరలో పోస్ట్‌పెయిడ్‌ విభాగంలో సైతం మంచి ప్రదర్శన చూపుతుందని అంచనా.



You may be interested

డబ్బుంది.. వ్యయాలే పెరిగాయ్‌..

Friday 19th October 2018

వ్యవస్థలో డబ్బు కొరత లేదని, దాని సమీకరణ వ్యయాలే పెరిగాయని హెచ్‌డీఎఫ్‌సీ వైస్‌ ప్రెసిడెంట్‌, సీఈవో కేకీ మిస్త్రీ తెలిపారు. ఒక బిల్డర్‌ పేమెంట్‌ను చెల్లించడంలో ఆలస్యమైతే భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఒక కంపెనీ దేశం మొత్తానికి ప్రాతినిధ్యం వహిందని పేర్కొన్నారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. ఆర్‌బీఐ తీసుకున్న చర్యలు వ్యవస్థలో లిక్విడిటీ సమస్య తగ్గడానికి దోహదపడ్డాయని తెలిపారు. నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌

రిలయన్స్‌ 6 శాతానికిపైగా క్రాష్‌

Friday 19th October 2018

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు శుక్రవారం మార్నింగ్స్‌ ప్రారంభంలోనే భారీగా పతనమైంది. కంపెనీ క్యూ2 ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ అంచనాలను అందుకోలేకపోవడంతో ప్రతికూల ప్రభావం పడింది. నిఫ్టీ-50లో టాప్‌-3 లూజర్లలో రిలయన్స్‌ ఒకటిగా ఉంది. ఉదయం 11:26 సమయంలో ఎన్‌ఎస్‌ఈలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు 5.32 శాతం క్షీణతతో రూ.1,090 వద్ద ట్రేడవుతోంది. షేరు ధర ఒకానొక సమయంలో 6 శాతానికిపైగా పడిపోయింది. రూ.1,070 కనిష్ట స్థాయిని తాకింది.  కాగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌

Most from this category