STOCKS

News


ఆర్‌ఐఎల్‌ షేరు కొనొచ్చా?

Friday 10th May 2019
news_main1557476225.png-25662

నాలుగు సెషన్లలో 11 శాతం నష్టపోయిన రిలయన్స్‌ షేరు శుక్రవారం ట్రేడింగ్‌లో స్వల్ప శ్రేణిలో కదలాడుతోంది. ఆరంభంలో లాభాల్లో ఉన్న ఆర్ఐఎల్‌ మధ్యాహ్నానికి నష్టాల్లోకి మరలింది. బ్రిటన్‌కు చెందిన బొమ్మల తయారీదారు హామ్‌లేస్‌ను ఆర్‌ఐఎల్‌ అనుబంధ సంస్థ ఆర్‌బ్రాండ్స్‌ సొంతం చేసుకున్నట్లు గురువారం ప్రకటించింది. రూ. 620 కోట్లకు ఈ కొనుగోలు జరిగింది. హామ్‌లేస్‌కు గతంలో ఘన చరిత్ర ఉన్నా ప్రస్తుతం లాభాలు చూపలేక ఇబ్బందులు పడుతోంది. ఇలాంటి సమయంలో ఈ కంపెనీని కొనుగోలు చేయడంపై ఇన్వెస్టర్లు పెదవివిరుస్తున్నారు. కొందరు ఇన్వెస్టర్లు మాత్రం ఆర్‌ఎల్‌ఐ షేరు పతనాన్ని కొనుగోళ్లకు అవకాశంగా చూస్తున్నారు. కానీ ఎక్కువమంది అనలిస్టులు మాత్రం వేచిచూడాలని మదుపరులకు సూచిస్తున్నారు. 
- ఐదు రోజుల క్రితం అద్భుత ప్రదర్శన చూపుతున్న ఆర్‌ఎల్‌ఐ షేరు ఉన్నట్లుండి నెగిటివ్‌గా మారింది. రుణసంబంధిత అంశాలపై ఆందోళనలతో మదుపరులు ప్రాఫిట్‌ బుకింగ్‌ చేస్తున్నారు. దీంతో మరోమారు ఆర్‌ఐఎల్‌ మార్కెట్‌క్యాప్‌ పరంగా టీసీఎస్‌కు దిగువకు వచ్చింది. ఈ సమయంలో ఇప్పటికే పోర్టుఫోలియోలో ఈ షేరు ఉన్న మదుపరులు మరికొన్ని రోజులు వేచిచూసి నిర్ణయం తీసుకోవాలి. కొంత అప్‌మూవ్‌ వస్తే 1300- 1325 వద్ద కొంత లాభాల స్వీకరణ చేయవచ్చు. కొత్త ఇన్వెస్టర్లు మాత్రం రూ. 1180- 1200 స్థాయికి వచ్చే వరకు వేచిచూడడం మంచిది. ఎన్నికల ఫలితాల అనంతరం షేరు ధరలో స్పష్టత రావచ్చు.- దీపక్‌ జాసాని, హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌.
- చార్టుల్లో ఓవర్‌సోల్డ్‌ పరిస్థితి కనిపిస్తోంది. ఆర్‌ఎస్‌ఐ తన 100 రోజుల డీఎంఏ స్థాయి వద్ద మద్దతు తీసుకునే యత్నాల్లో ఉంది. ఆర్‌ఎస్‌ఐ బుల్లిష్‌ కదలికలు చూపుతోంది. ఇకపై డౌన్‌సైడ్‌ పరిమితం కావచ్చు. కానీ ఇప్పటికిప్పుడు భారీ ర్యాలీ ఉండదు. ఇప్పుడున్న స్థాయిల వద్ద షేరు స్థిరపడవచ్చు. టెక్నికల్‌ పుల్‌బ్యాక్‌కు అవకాశాలున్నాయి. రూ. 1200కు పైన ఉన్నంత వరకు అప్‌ట్రెండ్‌లోనే ఉన్నట్లు భావించాలి. - జెమ్‌స్టోన్‌ అనలిస్టు మిలన్‌ వైష్ణవ్‌.
- అధిక రుణాలే ఆర్‌ఐఎల్‌కు అతిపెద్ద సమస్య. పెట్రోకెమ్‌ బ్యాపారం మందగించడం కూడా షేరుపై ప్రభావం చూపుతోంది. ఇప్పుడు కొత్తగా ఈ షేరును కొనడం మంచిది కాదు. దీర్ఘకాలానికి మదుపు చేయదలిచిన వాళ్లు మరికొంత దిగివచ్చాక కొనుగోలు చేయవచ్చు. - ఐడీబీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ రిసెర్స్‌ హెడ్‌ ఏకే. ప్రభాకర్‌. 

 


RIL

You may be interested

29000 పైకి బ్యాంకు నిఫ్టీ

Friday 10th May 2019

బ్యాంకింగ్‌ రంగ షేర్లలో రికవరీ కారణంగా బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 29000 స్థాయిని తిరిగి అందుకొంది. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకు షేర్లలో కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. నేడు మార్కెట్‌ లాభాల ప్రారంభంతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 28,927.60ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఆరంభం నుంచి ఇన్వెస్టర్లు బ్యాంకింగ్‌ రంగ షేర్లలో కొనుగోళ్లు ఎక్కువగా జరగడంతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌కు తనకు సాంకేతికంగా కీలకమైన 29000 స్థాయిని అందుకుంది. ఇండెక్స్‌లో ఆర్‌బీఎల్‌,

కొన్ని ప్రధాన కంపెనీల క్యూ4 ఫలితాలు

Friday 10th May 2019

పీఎన్‌బీ హౌసింగ్‌ లాభం 51 శాతం అప్‌ -ఒక్కో షేర్‌కు రూ.9 తుది డివిడెండ్‌  -రూ.1,000 కోట్లు దాటిన నికర లాభం  న్యూఢిల్లీ: పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ నికర లాభం(కన్సాలిడేటెడ్‌) గత ఆర్థిక సంవత్సరం (2018-19) జనవరి-మార్చి క్వార్టర్‌లో 51 శాతం ఎగసింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2017-18) క్యూ4లో రూ.252 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.380 కోట్లకు పెరిగిందని పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ తెలిపింది.

Most from this category