News


ఆర్‌ఐఎల్‌ ఫలితాలు.. ఎలా ఉండొచ్చు?

Wednesday 16th January 2019
news_main1547621491.png-23614

దేశీయ కార్పొరేట్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గురువారం క్యు3 ఫలితాలు ప్రకటించనుంది. ఈసారి కూడా కంపెనీ బలమైన ఫలితాలు ప్రకటించవచ్చని బ్రోకరేజ్‌లు అంచనా వేస్తున్నాయి. రిటైల్‌, టెలికం, పెట్రోకెమికల్‌ వ్యాపారాలు బాగుంటాయని భావిస్తున్నాయి. అయితే రిఫైనింగ్‌ విభాగం పేలవ ప్రదర్శన చూపవచ్చని, అందువల్ల ప్రాఫిటబిలిటీపై కొంత ప్రభావం ఉండొచ్చని అభిప్రాయపడుతున్నాయి. రెవెన్యూలో మంచి వృద్ధి ఉన్నా, లాభాలు స్వల్ప పెరుగుదలనే చూపవచ్చని తెలిపాయి. క్రూడాయిల్‌ ధరలు భారీగా పతనం కావడంతో గ్రాస్‌ రిఫైనింగ్‌ మార్జిన్లు(జీఆర్‌ఎం) 8-9 డాలర్ల మధ్య ఉంటాయని బ్రోకరేజ్‌లో ఎక్కువ సంస్థలు అంచనా వేస్తున్నాయి. గత త్రైమాసికంలో జీఆర్‌ఎం 11.6 డాలర్లుంది. 
అంచనాలు...
- యాంటిక్‌ బ్రోకింగ్‌: కన్సాలిడేటెడ్‌ ప్రాఫిట్‌లో నామమాత్ర పెరుగుదల ఉంటుంది. జియో, రిటైల్‌ విభాగాలు లాభాలను ఆదుకుంటాయి. రిఫైనింగ్‌, పెట్రోకెమికల్‌ విభాగాల మార్జిన్లు పేలవంగా ఉండొచ్చు.
- మోతీలాల్‌ ఓస్వాల్‌: పెట్రోకెమికల్‌ విభాగంలో బలమైన వాల్యూం గ్రోత్‌ ఉండొచ్చు. టెలికం, రిటైల్‌ విభాగాలు కంపెనీ భవిష్యత్‌ వృద్ధికి బాటలు వేస్తాయి.
- ఐడీబీఐ క్యాపిటల్‌: రిటైల్‌, డిజిటల్‌ విభాగాల్లో 10 శాతం వరకు లాభాలుంటాయి. 
- షేర్‌ఖాన్‌: రిఫైనింగ్‌ మార్జిన్లు పతనమై 8.5 డాలర్లకు చేరవచ్చు. ఈ ప్రభావం పెట్రోకెమికల్‌ మార్జిన్లపై ఉంటుంది. 
- ఎడెల్‌వీజ్‌: అధిక చమురు ధరలు, రూపీ పతనం, అధిక పెట్రోకెమికల్‌ వాల్యూంలు కలిసి రెవెన్యూ గ్రోత్‌కు దోహదం చేస్తాయి.
ఏం చూడాలి?
1. జీఆర్‌ఎం
2. పెట్రోకెమికల్‌ మార్జిన్లు
3. టెలికం వెంచర్‌పై అప్‌డేట్స్‌
4. భవిష్యత్‌ మూలధన వ్యయ ప్రణాళికలు.

 


RIL

You may be interested

జెట్‌ ఎయిర్‌వేస్‌ నేలచూపులు

Wednesday 16th January 2019

8.50శాతం పతనమైన షేరు ధర కంపెనీలో వాటాను కొనుగోలుకు ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ పీజేఎస్‌సీ కఠినమైన నిబంధనలను ప్రతిపాదించడంతో జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్లు బుధవారం నేలచూపులు చూస్తున్నాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌లో నిర్ణయాత్మకమైన వాటాను కొనుగోలు చేయాలంటే కంపెనీ ప్రస్తుత ఛైర్మన్‌ నరేష్‌ గోయల్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు కంపెనీ నుంచి పూర్తిగా వైదొలగాలని, ఓపెన్‌ ఆఫర్‌ పద్ధతిలో ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసేందుకు ప్రస్తుత ధర మీద రూ.150ల డిస్కౌంట్‌ ఇవ్వాల్సిందిగా

డిసెంబర్‌లో ఎంఎఫ్‌ల కొనుగోళ్లు, అమ్మకాలు!

Wednesday 16th January 2019

దేశీయ ఈక్విటీల్లోకి నిధుల ప్రవాహం నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్‌లో 21 శాతం క్షీణించి రూ. 6606 కోట్లకు చేరింది. అయితే సిప్స్‌లోకి నిధుల ప్రవాహం మాత్రం ఆల్‌టైమ్‌ గరిష్ఠస్థాయికి చేరింది. డిసెంబర్‌లో మ్యూచువల్‌ ఫండ్స్‌ యుటిలిటీస్‌, చమురు, గ్యాస్‌, క్యాపిటల్‌ గూడ్స్‌ రంగాలపై ఆసక్తి చూపాయి. టెక్నాలజీ, ఆటో, హెల్త్‌కేర్‌, మెటల్స్‌, కన్జూమర్‌, టెలికం, సిమెంట్‌ రంగాలపై అనాసక్తత కనబరిచాయి.  గతనెల్లో ఫండ్‌మేనేజర్లు కొనుగోలు చేసిన షేర్లు.. లార్జ్‌క్యాప్స్‌: ఓఎన్‌జీసీ, ఐఓసీ, భారత్‌

Most from this category