STOCKS

News


ఐదు సెషన్‌లో రూ.లక్షకోట్ల ఆవిరి

Saturday 11th May 2019
news_main1557572942.png-25687

ముంబై : ప్రైవేట్‌ రంగ దిగ్గజ కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఐదు సెషన్లలో రూ.లక్ష కోట్ల మార్కెట్‌ క్యాపిటిలైజేషన్‌ తుడిచిపెట్టుకుపోయింది. మార్కెట్లో నెలకొన్న అస్థిరతకు తోడు, ఇటీవల కంపెనీ షేరుకు ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థలు ‘‘బేరిష్‌’’ రేటింగ్‌ కేటాయింపు ఇందుకు కారణమైంది. రూ.లక్ష కోట్ల మార్కెట్‌ క్యాప్‌ హరించుకోవడంతో ‘‘అత్యధిక మార్కెట్‌ క్యాప్‌ కలిగిన కంపెనీ’’ అనే పేరును కోల్పోయింది. ఇప్పుడు ఈ స్థానాన్ని ఐటీ సేవల దిగ్గజ కంపెనీ టీసీఎస్‌ అధిరోహించింది. రిలయన్స్‌ షేరు ఐదు సెషన్లలో షేరు 11శాతం వరకు  పతనమైంది. అయినప్పటికీ, రిలయన్స్‌ షేరు ఈ ఏడాది(2019) ప్రారంభం నుంచి 11.5శాతం ర్యాలీ చేయగా, సంవత్సరకాలంలో 27.5శాతం లాభపడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 

చివరి మూడు రోజుల్లో విదేశీ ఫోర్ట్‌ ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐ) రూ.2,500 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించారు. ఈ భారీ విక్రయ ప్రభావం సెన్సెక్స్‌, నిఫ్టీ సూచీల్లో అత్యధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్‌ ఇండస్టీ‍్రస్‌ షేరుపై ఒత్తిడిని పెంచింది. రిలయన్స్‌ షేరు నిన్నటి ట్రేడింగ్‌ ప్రారంభంలో 2శాతం పెరిగినప్పటికీ, చివరికి అరశాతం నష్టంతో రూ.1,250.50 వద్ద స్థిరపడింది. తద్వారా కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.8లక్షల కోట్ల నుంచి  రూ.7.93లక్షల కోట్లకు పరిమితమైంది. మరోవైపు మార్కె్‌ట్‌ క్యాప్‌లో తన ప్రత్యర్థి టీసీఎస్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.8.01లక్షల కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరపు చివరి త్రైమాసికపు కాలంలో ఐటీ రంగంలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ, టీసీఎస్‌ అంచనాలకు మించి ఆదాయాలను నమోదు చేసింది. ఈ ఏడాది(2019)లో టీసీఎస్‌ కంపెనీ షేరు 12.9శాతం ర్యాలీ చేసింది. 

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ రిలయన్స్‌ షేరుపై రేటింగ్‌ను ఓవర్‌ వెయిట్‌ నుంచి ఈక్వల్‌ వెయిట్‌కు డౌన్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. 2017-19 ఆర్థిక సంవత్సర మధ్యకాలంలో కాంపోడెండ్‌ బేసిస్‌ 17శాతం వృద్ధి పెరిగిన నేపథంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదాయం వృద్ధి సగం మాత్రమే ఉంటుందని బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. వెనుజులా, ఇరాన్ నుంచి క్రూడ్‌ దిగుమతులు తగ్గపోవడం, పాలిస్టర్‌, గ్యాస్‌ మార్కెట్‌లో నెలకొన్న చిక్కులు కారణంగా ఆదాయాలపై ప్రభావం చూపవచ్చని మోర్గాన్‌ స్టాన్లీ తెలిపింది.

మరో బ్రోకరేజ్‌ సంస్థ జెప్పారీస్‌ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరుకు అండర్‌ఫెర్మ్‌ఫామింగ్‌ రేటింగ్‌ కేటాంపుతో పాటు, షేరు కొనుగోలు ధరను రూ.990లకు తగ్గించింది. రిలయన్స్‌ అనుబంధ సం‍స్థ రిలయన్స్‌ జియో, భారతీయ ఎయిర్టెల్ మొబైల్ రెవిన్యూ వృద్ధి పరంగా వ్యత్యాసం తగ్గినందున రిలయన్స్‌ షేరకు ప్రతికూలంగా మారినట్లు జెఫ్పారీస్‌ తెలిపింది. 

 You may be interested

కోలుకున్న యూఎస్‌ మార్కెట్!

Saturday 11th May 2019

ట్రంప్‌ ట్రేడ్‌ దెబ్బకు కకావికలమైన అమెరికా స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం కాస్త కోలుకుంది. నాలుగు రోజుల వరుస నష్టాలకు చెక్‌ చెప్పి లాభాల్లో ముగిసింది. చైనాతో వాణిజ్య చర్చలు నిర్మాణాత్మకంగా జరుగుతున్నాయని యూఎస్‌ ట్రెజరీ సెక్రటరీ స్టీవెన్‌ మ్యుచిన్‌, అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించడం మార్కెట్లకు ఊరటనిచ్చింది. దీంతో ఒకదశలో 1.5 శాతం మేర పతనమైన సూచీలు క్రమంగా కోలుకొన్నాయి. అయితే తాజా చర్చల అనంతరం కొత్త చర్చలకు ఎలాంటి

ఎలక‌్షన్‌ ఫలితాలపై మార్కెట్‌ మనసు మారిందా?

Saturday 11th May 2019

నెలారంభం వరకు ఎన్‌డీఏ మరలా గెలుస్తుందన్న అంచనాలతో పరుగులు తీసిన సూచీలు క్రమంగా పతనాభిముఖంగా పయనం ఆరంభించాయి. యూఎస్‌, చైనా వాణిజ్య ప్రతిష్టంభన బూచిగా చూపి సూచీలు దాదాపు 4 శాతం పతనమయ్యాయి. దేశంలో సార్వత్రిక ఎన్నికలు చరమాంకానికి చేరాయి. దీంతో మదుపరులంతా మరింత అప్రమత్తమయ్యారు. మార్కెట్లో వచ్చిన ఈ మార్పు ఎన్నికల ఫలితాలపై మార్కెట్‌ మనసు మారిందనేందుకు సంకేతంగా పోల్‌పండితులు భావిస్తున్నారు. ఎన్‌డీఏకు సరిపడా మెజార్టీ రాదన్న భావనతోనే

Most from this category