STOCKS

News


ఆయిల్‌, గ్యాస్‌ బ్లాక్‌ కోసం ఆర్‌ఐఎల్‌, బీపీ పోటీ

Friday 17th May 2019
news_main1558075604.png-25791

  • ఎనిమిదేళ్ల తర్వాత తిరిగి పోటీలోకి
  • వేదాంత, ఓఎన్‌జీసీ, ఓఐఎల్‌ సైతం బిడ్లు దాఖలు
  • 32 బ్లాక్‌లను ఆఫర్‌ చేస్తున్న కేంద్రం

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, దాని భాగస్వామి బ్రిటిష్‌ పెట్రోలియం (బీపీ పీఎల్‌సీ) ఎనిమిదేళ్ల విరామం తర్వాత తొలిసారిగా ఓ చమురు, సహజ వాయివు బ్లాక్‌ కోసం బిడ్‌ దాఖలు చేశాయి. వేదాంత 30 బ్లాక్‌ల కోసం బిడ్లు వేయగా, ఓఎన్‌జీసీ 20 బ్లాక్‌లకు బిడ్లు వేసింది. ఓపెన్‌ యాకరేజ్‌ లైసెన్సింగ్‌ పాలసీ (ఓఏఎల్‌పీ) రౌండ్‌- 2 కింద 14 బ్లాక్‌లు, ఓఏఎల్‌పీ- 3 కింద 18 ఆయిల్‌, గ్యాస్‌ బ్లాక్‌లతోపాటు 5 కోల్‌ బెడ్‌ మీథేన్‌ (సీబీఎం) బ్లాక్‌లను కేంద్ర ప్రభుత్వం వేలానికి ఉంచింది. గతేడాది ఓఏఎల్‌పీ-1 కింద జరిగిన 55 బ్లాక్‌ల వేలంలో అనిల్‌ అగర్వాల్‌కు చెందిన వేదాంత లిమిటెడ్‌ 41 బ్లాక్‌లను సొంతం చేసుకోగా, ఈ విడత 30 బ్లాక్‌ల కోసం బిడ్లు వేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. అలాగే, ఓఎన్‌జీసీ 20 బ్లాక్‌లు, ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌ (ఓఐఎల్‌) 15 బ్లాక్‌లకు, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ), గెయిల్‌, సన్‌ పెట్రో ఒక్కోటీ రెండేసి బ్లాక్‌లకు పోటీపడినట్టు వెల్లడించాయి. కృష్ణా గోదావరి బేసిన్‌లో ఒక బ్లాక్‌ కోసం ఆర్‌ఐఎల్‌, బీపీ సంయుక్తంగా బిడ్‌ వేసినట్టు తెలిపాయి. 2011లో బీపీ భారత మార్కెట్లోకి అడుగుపెట్టగా, అన్వేషణ బ్లాక్‌ కోసం పోటీపడడం ఇదే మొదటిసారి. ముకేశ్‌ అంబానీకి చెందిన ఆర్‌ఐఎల్‌ చివరిగా తొమ్మిదో విడత నూతన అన్వేషణ లైసెన్సింగ్‌ పాలసీ(ఎన్‌ఈఎల్‌పీ)లో భాగంగా ఆరు బ్లాక్‌లకు సొంతంగా బిడ్లు వేసినప్పటికీ ఒక్కటీ దక్కించుకోలేదు. ఆ తర్వాత ఎన్‌ఈఎల్‌పీ స్థానంలో కేంద్ర ప్రభుత్వం ఓఏఎల్‌పీని తీసుకొచ్చింది. 
ఓఏఎల్‌పీ పాలసీ
దేశంలో 2.8 మిలియన్ల చదరపు కిలోమీటర్ల పరిధిలో వెలుగు చూడని చమురు, గ్యాస్‌ నిక్షేపాలను కనుగొనేందుకు గాను, దేశీయంగా ఉత్పత్తిని పెంచేందుకు ఓఏఎల్‌పీని కేంద్రం తీసుకొచ్చింది. దీనికింద ప్రస్తుతం ఉత్పత్తి, అన్వేషణ దశలో భాగం కాని ఏ ఇతర ప్రాంతానికి సంబంధించి అయినా ఆసక్తి వ్యక్తీకరించేందుకు కంపెనీలకు అవకాశం ఉంటుంది. తాము ఫలానా ప్రాంతంలో అన్వేషణ, ఉత్పత్తి పట్ల ఆసక్తి ఉన్నామంటూ కంపెనీల నుంచి వచ్చిన ప్రతిపాదనలను కేంద్రం సమీక్షించిన అనంతరం ఆయా ప్రాంతాలను వేలానికి ఉంచుతుంది. అప్పుడు కంపెనీలు వాటికి బిడ్లు వేసి గెలుచేసుకోవాల్సి ఉంటుంది. You may be interested

కార్డుల్ని మించిన యూపీఐ

Friday 17th May 2019

 రూ.లక్ష కోట్ల విలువ దాటుతున్న లావాదేవీలు ఏడాది కాలంలో 4.5 రెట్లు వృద్ధి న్యూఢిల్లీ: ఏకీకృత చెల్లింపు విధానం (యూపీఐ) ద్వారా లావాదేవీలు క్రమంగా పుంజుకుంటున్నాయి. గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది మార్చి మధ్య కాలంలో నెలవారీ లావాదేవీల సంఖ్య 4.5 రెట్లు పెరిగి.. 79.95 కోట్ల స్థాయికి చేరింది. ఈ క్రమంలో క్రెడిట్, డెబిట్‌ కార్డు లావాదేవీలను కూడా మించి యూపీఐ చెల్లింపులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో యూపీఐ

లీజుకు హ్యుందాయ్‌ వాహనాలు

Friday 17th May 2019

లీజింగ్‌ సేవల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంస్థ  ఏఎల్‌డీ ఆటోమోటివ్‌ ఇండియాతో జట్టు హైదరాబాద్, చెన్నై తదితర నగరాల్లో సేవలు న్యూఢిల్లీ: ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా (హెచ్‌ఎంఐఎల్‌) తాజాగా వాహనాల లీజింగ్ సర్వీసుల్లోకి ప్రవేశించింది. ఇందుకోసం ఏఎల్‌డీ ఆటోమోటివ్ ఇండియాతో జట్టు కట్టింది. హ్యుందాయ్ లీజింగ్‌ పేరిట ప్రారంభించిన ఈ సర్వీసు కింద తమ పోర్ట్‌ఫోలియోలో ఉన్న అన్ని రకాల వాహనాలు లీజింగ్‌కి లభిస్తాయని సంస్థ తెలియజేసింది. ముందస్తు చెల్లింపులు, మెయింటెనెన్స్ వ్యయాల్లాంటి

Most from this category