STOCKS

News


బలమైన సంస్థగానే ఆర్‌బీఐ

Wednesday 28th November 2018
news_main1543390172.png-22439

ముంబై: ఆర్‌బీఐ బలమైన సంస్థగానే కొనసాగుతోందని, ప్రభుత్వంతో ఇటీవల ఏర్పడిన విభేదాలు ఆర్‌బీఐ స్వయంప్రతిపత్తిని సవాలు చేసేవి కావని సెబీ మాజీ చైర్మన్‌ దామోదరన్‌ చెప్పారు. నిర్వహణ పరమైన స్వతంత్రతను ఆర్‌బీఐ అనుభవిస్తోందన్నారు. ‘‘ప్రభుత్వం, ఆర్‌బీఐ మధ్య ఎన్నో సందర్భాల్లో విభేదాలు చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ ఆర్‌బీఐకి ఎటువంటి ఇబ్బందీ రాలేదు. ఇప్పుడు కూడా ఆర్‌బీఐ స్వయంప్రతిపత్తిని అడ్డుకుంటున్నారని చెప్పడం తప్పే అవుతుంది’’ అని సీఐఐ నిర్వహించిన ఓ కార్యక్రమం సందర్భంగా దామోదరన్ మీడియాతో వ్యాఖ్యానించారు.  ఇరువైపులా నెలకొన్న విభేదాలను గతంలో ఆర్‌బీఐ గవర్నర్‌, ఆర్థిక మంత్రి వ్యక్తిగత చర్చల ద్వారా పరిష్కరించుకోవడం జరిగిందని, బయటి వ్యక్తులు దీన్ని వినలేరని చెప్పారాయన. ఇప్పుడు మాత్రం ఇది ప్రజల్లో చర్చనీయాంశమైందని,  ఆర్‌బీఐ - ప్రభుత్వంతో సంబంధంలేని బయటి వ్యక్తులు బరిలోకి వచ్చారని వ్యాఖ్యానించారు. ఇది పెద్ద నష్టంగా అందరూ భావిస్తున్నారని, అది సరికాదని చెప్పారాయన. ‘‘ఇరువైపులా వ్యక్తిగత స్థాయిలో అర్థవంతమైన చర్చల ద్వారా విభేదాలకు చెక్‌ పెట్టుకోవచ్చు. ప్రభుత్వ అజెండా వృద్ధిని పెంచడంపైనే. కానీ, ఆర్‌బీఐపై ద్రవ్యోల్బణం కట్టుదాటకుండా చూసే బాధ్యత ఉంది. మరి ఇరువైపులా సామరస్యం ఎలా సాధ్యపడుతుంది? అది చర్చల ద్వారానే’’ అని దామోదరన్‌ పేర్కొన్నారు. వ్యక్తులు మీడియా ముందుకు వచ్చి ప్రకటనలు ఇస్తే ఒరిగేదేమీ ఉండదన్నారు. 



You may be interested

20 లక్షల కార్ల క్లబ్‌లో మారుతీ స్విఫ్ట్‌

Wednesday 28th November 2018

న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ కంపెనికీ చెందిన స్విఫ్ట్‌ మోడల్‌ 20 లక్షల అమ్మకాల మైలురాయిని సాధించింది. ఈ ఘనత సాధించడం ఉద్యోగులందరికీ గర్వకారణంగా ఉందని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌​ డైరెక్టర్‌ (మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌) ఆర్‌.ఎస్‌. కల్సి చెప్పారు. 2005, మే నెలలో స్విఫ్ట్‌ కారును మార్కెట్లోకి తెచ్చామని, ఐదేళ్లలోనే (2010, సెప్టెంబర్‌) 5 లక్షల అమ్మకాలు సాధించామని తెలిపారు.  మరో మూడేళ్లలోనే (2013, సెప్టెంబర్‌) 10

కాలుష్య కారక జెన్‌సెట్లు వద్దు

Wednesday 28th November 2018

న్యూఢిల్లీ: విద్యుత్‌ రంగంలో సంస్కరణల అవసరాన్ని నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ నొక్కి చెప్పారు. డీజిల్‌, కిరోసిన్‌ తదితర ఇంధన ఆధారిత జెన్‌సెట్ల (విద్యుత్‌ జెనరేటర్లు) వినియోగాన్ని నిషేధించాలని కోరారు. కోర్టు ఆదేశించడానికి ముందే ప్రభుత్వం ఈ పనిచేయాలన్నారు. 25 ఏళ్ల కాలం దాటిన బొగ్గు ఆధారిత విద్యుత్‌ ప్లాంట్లను తొలగించాల్సిన అవసరాన్ని కూడా ప్రస్తావించారు. అలాగే, నచ్చిన కంపెనీ నుంచి విద్యుత్‌ కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించాలని

Most from this category