STOCKS

News


రిటైల్ రుణాలపై జాగ్రత్త వహించాలి

Friday 10th August 2018
news_main1533897800.png-19144

ముంబై: కార్పొరేట్ రుణాల్లో మొండిబాకీల భారం పెరిగిందనే ఉద్దేశంతో.. రిటైల్ రుణాలవైపు మళ్లుతున్న బ్యాంకర్లు జాగ్రత్త వహించాలని రిజర్వ్ బ్యాంక్ మాజీ డిప్యుటీ గవర్నర్ ఎస్‌ఎస్ ముంద్రా హెచ్చరించారు. సమస్య పరిష్కారానికి రిటైల్ రుణాలు మోక్ష మార్గం కాదని చెప్పారు. పరిశ్రమల సమాఖ్య అసోచాం నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. "రిటైల్ రుణాల్లో నిర్వాణ (మోక్షమార్గం) వెతుక్కుంటున్న ప్రతి బ్యాంకరు కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది" అని ముంద్రా వ్యాఖ్యానించారు. గతంలో బ్యాంకులిచ్చిన రుణాల పోర్ట్‌ఫోలియోలో మూడింట రెండొంతులు కార్పొరేట్ వాటా ఉండగా, ఒక భాగం రిటైల్ రుణాల వాటా ఉండేదని.. ప్రస్తుతం అదంతా మారిపోయిందని చెప్పారు. ఇప్పుడు రిటైల్ రుణాలు మూడింట రెండొంతులు ఉంటుండగా, కార్పొరేట్ రుణాలు ఒక వంతుకు తగ్గిపోయాయని తెలిపారు. అంతర్జాతీయంగానూ ఇదే పరిస్థితి నెలకొన్నప్పటికీ.. మన దగ్గర ఇందుకు అనువైన వ్యవస్థ ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందలేదన్నారు. మరోవైపు.. మొండిబాకీల సమస్య విషయంలో బ్యాంకర్లు, రుణగ్రహీతల వ్యవహార శైలి మారాలని ముంద్రా చెప్పారు. ఏ వ్యాపారంలోనైనా ఎన్‌పీఏ సమస్య సాధారణమైనదేనని, దీన్ని నేరంగా భావించాల్సిన అవసరం లేదన్నారు. ఈ నేపథ్యంలో మొండిబాకీల సమస్యను వాయిదా వేయకుండా సరైన సమయంలో గుర్తించి, తగు రీతిలో పరిష్కరించుకునేందుకు బ్యాంకర్లు, రుణ గ్రహీతలు చొరవ చూపాలని ముంద్రా సూచించారు. 



You may be interested

పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లాభం 50 శాతం అప్‌

Friday 10th August 2018

న్యూఢిల్లీ: పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ క్వార్టర్‌లో 50 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.170 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.256 కోట్లకు పెరిగిందని పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,160 కోట్ల నుంచి రూ.1,616 కోట్లకు పెరిగిందని కంపెనీ ఎమ్‌డీ సంజయ గుప్తా తెలియజేశారు. వడ్డీ ఆదాయం 28 శాతం

హెచ్‌పీసీఎల్ ప్రమోటరు ఓఎన్‌జీసీనే!!

Friday 10th August 2018

 న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంధన మార్కెటింగ్ సంస్థ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్‌కు (హెచ్‌పీసీఎల్‌) కొత్త ప్రమోటర్ ఓఎన్‌జీసీనే అని కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. హెచ్‌పీసీఎల్‌లో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసింది కనుక సహజంగానే ఓఎన్‌జీసీ ప్రమోటర్ అవుతుందని పేర్కొన్నారు. ఓఎన్‌జీసీని ప్రమోటింగ్ సంస్థగా గుర్తించడానికి హెచ్‌పీసీఎల్ సీఎండీ ముకేశ్ కుమార్ సురానా నిరాకరించిన నేపథ్యంలో ప్రధాన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ ఏడాది

Most from this category