STOCKS

News


రిటైల్‌ ధరలకు రెక్కలు!

Thursday 12th July 2018
news_main1531411143.png-18262

న్యూఢిల్లీ: జూన్‌ నెలలో రిటైల్‌ ధరల ఆధారిత (సీపీఐ) ద్రవ్యోల్బణం మరోసారి 5 శాతం మార్కును నమోదు చేసింది. ఈ ఏడాది జనవరిలో 5.07 శాతంగా నమోదైన తర్వాత రిటైల్‌ ద్రవ్యోల్బణం తిరిగి మరోసారి గరిష్ట స్థాయికి చేరుకుంది. ఆహారోత్పత్తుల విభాగంలో ధరలు కాస్తంత ఉపశమించినా, చమురు ధరలు పెరిగిపోయే సరికి ఆ ప్రభావం రిటైల్‌ ద్రవ్యోల్బణంపై ప్రతిఫలించింది. దీంతో 5 శాతానికి పెరిగింది. ఇది మే నెలలో 4.87 శాతంగా ఉంది. 2017 జూన్‌ నెలలో 1.46 శాతంగా ఉండడం గమనార్హం. ఈ మేరకు రిటైల్‌ ద్రవ్యోల్బణం వివరాలను కేంద్ర గణాంకాల విభాగం (సీఎస్‌వో) గురువారం విడుదల చేసింది. 
ముఖ్య గణాంకాలు...
♦ ఆహార ఉత్పత్తుల విభాగంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం మే నెలలో ఉన్న 3.1 శాతం నుంచి జూన్‌లో 2.91 శాతానికి తగ్గుముఖం పట్టింది. పండ్లు, కూరగాయల ధరల పెరుగుదల నిదానంగానే ఉంది.
♦ చమురు బాస్కెట్‌లో ద్రవ్యోల్బణం మే నెలతో పోలిస్తే 5.8 శాతం నుంచి 7.14 శాతానికి ఎగిసింది. 
♦ వస్త్రాలు, పాదరక్షల విభాగంలో ద్రవ్యోల్బణం 5.67 శాతంగా, హౌసింగ్‌ విభాగంలో 8.45 శాతంగా నమోదైంది. మే నెలతో పోలిస్తే కాస్తంత పెరిగాయి. 
♦ ఎంపిక చేసిన కొన్ని గ్రామాలు, పట్టణాల నుంచి రిటైల్‌ ద్రవ్యోల్బణం కోసం ధరల వివరాలను సమీకరించినట్టు సీఎస్‌వో తెలిపింది.
♦ ద్రవ్యోల్బణాన్ని 4 శాతం స్థాయిలో పరిమితం చేసేలా చూడాలని కేంద్ర సర్కారు ఆర్‌బీఐ ముందు లక్ష్యాన్ని ఉంచిన విషయం తెలిసిందే. ఈ నెల 30 నుంచి జరిగే ఆర్‌బీఐ తదుపరి ద్వైమాసిక మానిటరీ పాలసీ సమీక్షలో రిటైల్‌ ద్రవ్యోల్బణ గణాంకాలు కీలకంగా వ్యవహరించనున్నాయి. ఆగస్ట్‌ 1న పాలసీ నిర్ణయాలను ఎంపీసీ ప్రకటిస్తుంది.
 
ఇకపై తగ్గుతుంది
‘‘ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్‌ రిటైల్‌ ద్రవ్యోల్బణమే గరిష్టంగా నమోదైంది. అయితే, తర్వాతి నెలల్లో ఇది సగటున 4.5 శాతానికి తగ్గుముఖం పడుతుంది. ప్రధాన ద్రవ్యోల్బణం పెరిగినందున ఆర్‌బీఐ దాన్ని అదుపు చేయవచ్చు’’
- శుభదా రావు, యస్‌ బ్యాంకు ముఖ్య ఆర్థిక వేత్త
 
రెపో రేటు పెంపు అవకాశాలు
2018-19లో ఆర్‌బీఐ ఎంపీసీ మరో 25-50 బేసిస్‌ పాయింట్ల మేర రెపో రేటును పెంచే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం, ద్రవ్య పరమైన సవాళ్లపై ఇది ఆధారపడి ఉంటుంది.
- అదితి నాయర్‌, ఇక్రా ఆర్థిక వేత్త



You may be interested

68.57కు రూపాయి రికవరీ

Thursday 12th July 2018

ముంబై: డాలర్‌తో పోలిస్తే రూపాయి స్వల్పంగా కోలుకుంది. గురువారం ఫారెక్స్‌ మార్కెట్లో 20 పైసలు బలపడి 68.57కు చేరుకుంది. చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, ఈక్విటీ మార్కెట్ల ర్యాలీతో ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి పట్ల సెంటిమెంట్‌ మెరుగుపడింది. వారం వ్యవధిలో రూపాయికి ఇది గరిష్ట స్థాయి. నాలుగు చమురు ఎగుమతి టెర్మినళ్లను తిరిగి తెరుస్తున్నట్టు లిబియా చేసిన ప్రకటన చమురు ధరల పతనానికి దారితీసింది. దీంతో డాలర్‌ అంతర్జాతీయంగా బలంగా

కృష్టపట్నం పోర్ట్‌లో ఈ–ఆర్‌టీజీసీ ప్రారంభం

Thursday 12th July 2018

హైదరాబాద్‌: కృష్ణపట్నం పోర్ట్‌ కంటైనర్‌ (కేపీసీటీ) నుంచి ఐదు కొత్త ఎకో ఫ్రెండ్లీ ఎలక్ట్రికల్‌ రబ్బర్‌ టైర్డ్‌ గ్యాంట్రీ క్రెయిన్స్‌ (ఈ–ఆర్‌టీజీసీ) ప్రారంభమయ్యాయి. పోర్ట్‌లో వినియోగించే ఈ క్రెయిన్లతో ఇంధన వినియోగం 80 శాతం, ధ్వని 65 శాతం తగ్గిస్తుందని కేపీసీటీ ఒక ప్రకటనలో తెలిపింది. సాధారణ డీజిల్‌ వినియోగంతో పోలిస్తే 1400 టన్నుల గ్రీన్‌హౌస్‌ గ్యాస్‌ ఉద్గారాలను కూడా తగ్గింస్తుందని పేర్కొంది. 

Most from this category