STOCKS

News


ఇక బ్యాంకుల చెంతనే ‘అంబుడ్స్‌మన్‌’

Tuesday 4th September 2018
news_main1536037403.png-19936

ముంబై: బ్యాంకు ఖాతాదారుల ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగవంతం చేసేందుకు ఆర్‌బీఐ రంగంలోకి దిగింది. 10 బ్రాంచ్‌లకు మించి కార్యకలాపాలున్న వాణిజ్య బ్యాంకులన్నీ ఇకపై కచ్చితంగా అంతర్గత అంబుడ్స్‌మన్‌ను (ఐఓ) నియమించుకోవాలని సోమవారం ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది. అయితే, దీని నుంచి రీజినల్‌ రూరల్‌ బ్యాంక్స్‌కు (ఆర్‌ఆర్‌బీ) మినహాయింపునిచ్చింది. ‘అంతర్గత అంబుడ్స్‌మన్‌కు మరిన్ని స్వతంత్ర అధికారాలను కల్పించడం, ఐఓ యంత్రాంగం విధి నిర్వహణ తీరుపై పర్యవేక్షణ వ్యవస్థను పటిష్టం చేసేందుకుగాను ‘అంతర్గత అంబుడ్స్‌మన్‌ స్కీమ్‌-2018’ పేరుతో తాజా చర్యలను చేపట్టినట్లు ఆర్‌బీఐ పేర్కొంది. బ్యాంకు సేవల్లో లోటుపాట్లపై కస్టమర్ల ఫిర్యాదులను(పాక్షికంగా లేదా పూర్తిగా తిరస్కరణకు గురైనవి) ఓఐ పరిశీలించి తగిన పరిష్కారాన్ని చూపుతారని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. ఓఐ నియామకం, పదవీకాలం, బాధ్యతలు, విధులు, విధానపరమైన నిబంధనలు, పర్యవేక్షణ యంత్రాంగం వంటివన్నీ ఈ స్కీమ్‌లో పొందుపరిచినట్లు వెల్లడించింది. దీని అమలును ఆర్‌బీఐతో పాటు బ్యాంకుల అంతర్గత ఆడిట్‌ యంత్రాంగం కూడా పర్యవేక్షిస్తుంది. కాగా, ఫిర్యాదులపై 30 రోజుల్లోగా తగిన పరిష్కారాన్ని చూపని బ్యాంకులపై ప్రస్తుతం ఆర్‌బీఐ నియమించిన అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించే అవకాశం కస్టమర్లకు ఉంది. దేశవ్యాప్తంగా 15 చోట్ల ఈ బ్యాంకింగ్‌ అంబుడ్స్‌మన్‌ కార్యాలయాలున్నాయి. ఇప్పుడు అంతర్గత అంబుడ్స్‌మన్‌లతో కస్టమర్లకు ఈ సేవలు మరింత విస్తృతం అయ్యే అవకాశం ఏర్పడుతుందని బ్యాంకింగ్‌ నిపుణులు పేర్కొంటున్నారు.



You may be interested

సెబీకి ఫిర్యాదుల వరద

Tuesday 4th September 2018

న్యూఢిల్లీ: లిస్టెడ్‌ కంపెనీలు, మార్కెట్‌ ఇంటర్‌మీడియరీలకు వ్యతిరేకంగా ఇన్వెస్టర్ల నుంచి వచ్చే ఫిర్యాదులు పెరిగిపోయాయి. గత ఆర్థిక సంవత్సరంలో 43,131 ఫిర్యాదులు సెబీ వద్ద దాఖలయ్యాయి. ఆరేళ్ల గరిష్ట స్థాయి ఇది. సెబీ వార్షిక నివేదిక ప్రకారం... గత ఆర్థిక సంవత్సరంలో 43,131 ఫిర్యాదులు దాఖలవ్వగా, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇవి 40,000గా ఉన్నాయి. 2011-12లో వచ్చిన 46,548 తర్వాత మళ్లీ గత ఆర్థిక సంవత్సరంలోనే అధిక సంఖ్యలో ఫిర్యాదులు

తొమ్మిదేళ్ల తర్వాత బంగారాన్ని కొన్న ఆర్‌బీఐ

Tuesday 4th September 2018

 ముంబై: రిజర్వ్‌ బ్యాంకు (ఆర్‌బీఐ) 2017-18 ఆర్థిక సంవత్సరంలో 8.46 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. తొమ్మిదేళ్లలో ఆర్‌బీఐ పసిడిని కొనుగోలు చేయడం మొదటి సారి. 2018 జూన్‌ 30 నాటికి (ఆర్‌బీఐ అకౌంటింగ్‌ సంవత్సరం జూలై నుంచి జూన్‌ వరకు) ఆర్‌బీఐ వద్ద పసిడి నిల్వలు 566.23 టన్నులకు చేరాయి. 2017 జూన్‌ నాటికి ఉన్న నిల్వలు 557.77 టన్నులు మాత్రమే. చివరి సారిగా 2009లో ఆర్‌బీఐ 200

Most from this category