STOCKS

News


ఇంకో దఫా రేట్ల పెంపు?!

Saturday 1st September 2018
news_main1535805105.png-19887

ఎస్‌బీఐ నివేదిక
ఫారెక్స్‌ మార్కెట్లో ఆర్‌బీఐ జోక్యం తప్పని పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి. రూపాయి నానాటికీ క్షీణిస్తూపోతోంది. రూపాయిని ఆదుకునేందుకు ఆర్‌బీఐ రంగంలోకి దిగాల్సిన అగత్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలో రూపీని కాపాడే ప్రయత్నంలో భాగంగా ఆర్‌బీఐ మరో విడత వడ్డీరేట్లను పెంచవచ్చని ఎస్‌బీఐ అంచనా వేసింది. దీనివల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ది రేటు 7.5 శాతం లోపునకు పరిమితం కావచ్చని అభిప్రాయపడింది. అనుకున్నదానికన్నా ముందే ఆర్‌బీఐ మరోమారు రేట్లను పెంచుతుందని ఎకో రాప్‌ పేరిట విడుదల చేసిన నివేదికలో ఎస్‌బీఐ పేర్కొంది. గత రెండు సమీక్షా సమావేశాల్లో ఆర్‌బీఐ వరుసగా రేట్లను పెంచేందుకు మొగ్గు చూపింది. జూన్‌, ఆగస్టు పాలసీల్లో ఒక్కో దఫా 25 బీపీఎస్‌ చొప్పున ఆర్‌బీఐ రేట్లను పెంచింది. ఆర్‌బీఐ రేట్లు పెంచడం ప్రైవేట్‌ వినిమయ వ్యయాలపై నేరుగా ప్రభావం చూపుతుందని ఎస్‌బీఐ తెలిపింది. 2014లో వరుసగా మూడుమార్లు ఆర్‌బీఐ రేట్లు పెంచడంతో ఆ సంవత్సరం క్యు3లో ప్రైవేట్‌ వినిమయ వ్యయం ఒక్కమారుగా 2 శాతానికి పడిపోయింది. ఇప్పడున్న పరిస్థితుల్లో రూపాయి పతనం ఆపేందుకు మరో మారు రేట్లు పెంచడమే మార్గమని ఆర్‌బీఐ భావించవచ్చని నివేదిక తెలిపింది. రాబోయే రోజుల్లో ఎకానమీ రేట్లపెంపునకు సిద్ధపడి ఉండాలని ఎస్‌బీఐ చీఫ్‌ ఎకనమిక్‌ అడ్వైజర్‌ సౌమ్య కాంతి ఘోష్‌ చెప్పారు. You may be interested

ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకు... కొన్ని విషయాలు

Monday 3rd September 2018

తపాలా శాఖ పేమెంట్స్‌ బ్యాంకు కార్యకలాపాలు ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ నెల 1న మొదలయ్యాయి. ఇంటి వద్దకే బ్యాంకింగ్‌ సేవలను పోస్ట్‌మ్యాన్‌ల ద్వారా అందిస్తామని ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకు ప్రకటించింది. పోస్టల్‌ విభాగానికి మూడు లక్షల మంది పోస్ట్‌మ్యాన్లు ఉన్నారు. దీంతో మారుమూల ప్రాంతాల్లోనూ, బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులో లేని ప్రజలకు ఆ సేవలను చేరువ చేయాలన్నది తపాలా శాఖ ప్రణాళిక. ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌

ఇన్వెస్ట్‌మెంట్‌కు ముందు ఇవి చెక్‌ చేసుకోండి..

Saturday 1st September 2018

దురాశకు పోకుండా జాగ్రత్త వహిస్తే మార్కెట్లో సిరుల పంట ఖాయమని నిపుణులు భరోసా ఇస్తున్నారు. ఈక్విటీల్లో కాలు మోపేముందు కొన్ని అంశాలు చెక్‌ చేసుకోవాలని, అప్పుడే నష్టపోకుండా లాభాల్లో పయనిస్తామని సూచిస్తున్నారు. నిధులున్నాయా?: నగదునిల్వలు, ఫ్రీ క్యాష్‌ ప్రవాహం లేని కంపెనీలు ఎంత మంచివైనా వాటి జోలికి పోకుండా ఉత్తమం. ఫ్రీక్యాష్‌ ప్రవాహం ఉన్న కంపెనీలే కొత్త పెట్టుబడులు పెట్టి వ్యాపార విస్తరణ చేపడతాయి.  పూర్తిగా తెలుసుకోండి: ఎంపిక చేసుకున్న కంపెనీ చేస్తున్న

Most from this category