STOCKS

News


రిన్యూ చేతికి వైజాగ్‌ సోలార్‌ ప్రాజెక్ట్‌

Tuesday 23rd October 2018
news_main1540271601.png-21398

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇంధన పునరుత్పాదక సంస్థ రిన్యూ పవర్‌ తాజాగా విశాఖపట్నంలో 3 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్ట్‌ను దక్కించుకుంది. గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) నిర్వహించిన బిడ్డింగ్‌ను రిన్యూ గెలుచుకుంది. ఈ ప్రాజెక్ట్‌కు ఏసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) గ్రాంట్‌ను సమకూరుస్తుంది. దీని ద్వారా ఏటా 4.2 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తవుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.



You may be interested

హెచ్‌పీఈ ప్లాట్‌ఫామ్‌పైకి బ్యాంకుల స్టోరేజీ!

Tuesday 23rd October 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కో–ఆపరేటివ్‌ బ్యాంక్‌ (ఏపీసీవోబీ), తెలంగాణ స్టేట్‌ కో–ఆపరేటివ్‌ అపెక్స్‌ బ్యాంక్‌ (టీఎస్‌సీఏబీ)లకు చెందిన సంప్రదాయ స్టోరేజీ మౌలిక సదుపాయాలను హెచ్‌పీఈ 3పీఏఆర్‌ వేదికకు విజయవంతంగా మార్చినట్లు హ్యులెట్‌ ప్యాకర్డ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (హెచ్‌పీఈ) ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో బ్యాంక్‌ ఇంటర్నెట్, మొబైల్‌ బ్యాంకింగ్‌ లావాదేవీలు వేగవంతమవటమే కాకుండా నిరంతరంగా జరిపే వీలుంటుందని పేర్కొంది.  

విదేశాల్లో నల్లధనంపై ఐటీ దృష్టి

Tuesday 23rd October 2018

న్యూఢిల్లీ: విదేశాల్లో బ్లాక్‌మనీని దాచుకున్న నల్ల కుబేరులపై ఆదాయ పన్ను (ఐటీ) శాఖ దృష్టి సారించింది. అవసరమైతే వారిపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకునేలా కొత్త యాంటీ-బ్లాక్‌ మనీ చట్టాన్ని కూడా ప్రయోగించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా వేలకొద్దీ భారతీయులకు విదేశాల్లో ఉన్న బ్యాంక్ డిపాజిట్లు, ఆస్తుల కొనుగోళ్ల లావాదేవీలను ఆయా దేశాల అధికారుల సహకారంతో పరిశీలిస్తున్నట్లు ఆదాయ పన్ను శాఖ వర్గాలు తెలిపాయి. కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు

Most from this category