STOCKS

News


సుబాక్సోన్ కేసులో డాక్టర్‌ రె​డ్డీస్‌కు ఊరట

Wednesday 6th February 2019
news_main1549428273.png-24038

హైదరాబాద్‌: జనరిక్‌ ఔషధం సబాక్సాన్‌ కేసులో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌కు అమెరికా కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్స్‌లో ఊరట లభించింది. వివరాల్లో వెళితే... మాదకద్రవ్య (ఒపియమ్‌) వ్యసనానికి బానిసలయ్యే వారి చికిత్సలో వినియోగించే తమ ఉత్పత్తి సబాక్సాన్‌ జనరిక్‌ వెర్షన్‌ను డాక్టర్‌ రెడ్డీస్‌సహా ఔషధ కంపెనీలు అమెరికా మార్కెట్‌లో  విక్రయించకుండా నిరోధించాలని బ్రిటిష్‌ ఔషధ ఉత్పత్తి సంస్థ ఇన్డీవర్‌ న్యాయపోరాటం చేస్తోంది. ఈ విషయంలో గత ఏడాది జూన్‌లో ఈ ఔషధానికి సంబంధించి జనరిక్‌ ఔషధ విక్రయాలకు అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ అనుమతినిచ్చింది. ఈ ఆమోదం అనంతరం తక్షణం ఈ ప్రొడక్ట్‌ను డాక్టర్‌ రెడ్డీస్‌ మార్కెట్‌లో విడుదల చేసింది. అయితే, ఒక ట్రైల్‌ కోర్ట్‌ విధించిన తాత్కాలిక నియంత్రణలతో ఔషధం అమ్మకాలు, వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీనిపై డాక్టర్‌ రెడ్డీస్‌ అప్పీలేట్‌ కోర్టును ఆశ్రయించింది. డిసెంబర్‌లో ఇక్కడ డాక్టర్‌ రెడ్డీస్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. కేసును పునఃవిచారించాలని తాజాగా ఇన్డీవర్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను అప్పీలేట్‌ కోర్ట్‌ తిరస్కరించింది. ఫిబ్రవరి 11వ తేదీన ‘మ్యాండేట్‌’ను ఇస్తామని కూడా అప్పీలేట్‌ కోర్టు పేర్కొనడం గమనార్హం. ఇదే జరిగితే డాక్టర్‌ రెడ్డీస్‌ ఇక యథేచ్చగా అమెరికన్‌ మార్కెట్‌లో ఈ ఔషధాన్ని విక్రయించే అవకాశం ఉంది. తన తీర్పునకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని అప్పీలేట్‌ కోర్టు జిల్లా కోర్టుకు సూచించడమే ‘మ్యాండేట్‌’.



You may be interested

రెండేళ్లు... రూ.లక్ష కోట్లు..!

Wednesday 6th February 2019

 షేర్‌హోల్డర్లకు తిరిగిచ్చిన టాప్‌ 5 ఐటీ దిగ్గజాలు - షేర్ల బైబ్యాక్, డివిడెండ్ల రూపంలో చెల్లింపు - టాప్‌లో టీసీఎస్‌ న్యూఢిల్లీ: దేశీ టాప్‌ 5 ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) దిగ్గజాలు షేర్‌హోల్డర్లకు గత రెండేళ్లలో సుమారు రూ. 1.17 లక్షల కోట్లు తిరిగి చెల్లించాయి. 2017 జనవరి నుంచి ఈ ఏడాది జనవరి మధ్యకాలంలో షేర్ల బైబ్యాక్, డివిడెండ్స్‌ రూపంలో ఈ నిధులను చెల్లించాయి. సగటున డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం 67గా

ఆర్‌బీఐ పాలసీ సమావేశం ప్రారంభం​

Wednesday 6th February 2019

గురువారం వడ్డీరేట్లపై కీలక నిర్ణయం న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మూడు రోజుల ద్రవ్య పరపతి విధాన సమీక్ష మంగళవారం ప్రారంభమైంది. గురువారంనాడు కీలక నిర్ణయాలను వెలువరించనుంది. 2018-19 ఆరవ ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష ఇది. గవర్నర్‌ శక్తికాంతదాస్‌ నేతృత్వంలో మొట్టమొదటిసారి సమావేశమవుతున్న ఆరుగురు సభ్యుల పరపతి విధాన మండలి ఈ దఫా రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 6.5

Most from this category