News


జెనెసిస్‌ కలర్స్‌లో రిలయన్స్‌ రిటైల్‌ పెట్టుబడులు

Monday 10th September 2018
news_main1536557092.png-20118

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఆర్‌వీఎల్‌) తన వ్యాపార ప్రయోజనాలను విస్తృతం చేసే క్రమంలో పలు  కంపెనీల్లో పెట్టుబడుల ద్వారా వాటాలు సొంతం చేసుకుంది. రెడీమేడ్‌ వస్త్రాల రిటైల్‌, హోల్‌సేల్‌ కంపెనీ జెనెసిస్‌ కలర్స్‌ లిమిటెడ్‌ (జీసీఎల్‌)లో 16.31 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ వాటాల కోసం రూ.34.80 కోట్లు ఖర్చు చేసింది. జెనెసిస్‌ కలర్స్‌లో రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ అనుబంధ రిలయన్స్‌ బ్రాండ్స్‌కు ఇప్పటికే 49.46 శాతం వాటా ఉంది. తాజా పెట్టుబడులతో మొత్తం మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా రిలయన్స్‌ రిటైల్‌కు జీసీఎల్‌లో 65.77 శాతం వాటా ఉంటుంది. మరో ఐదు కంపెనీల్లోనూ రిలయన్స్‌ రిటైల్‌ వాటాలు కొనుగోలు చేసింది. ఇందుకు రూ.57.03 కోట్లు వ్యయం చేసింది. ఈ కంపెనీలన్నీ రెడీమేడ్‌ వస్త్రాలు, బ్యాగులు, పాదరక్షల హోల్‌సేల్‌, రిటైల్‌ వ్యాపారంలో ఉన్నవే. జీఎల్‌ఎఫ్‌ లైఫ్‌స్టయిల్‌ బ్రాండ్స్‌, జెనెసిస్‌ లా మోడ్‌, జీఎంఎల్‌ ఇండియా ఫ్యాషన్‌, జీఎల్‌బీ బాడీ కేర్‌ కంపెనీల్లో  50 శాతం చొప్పున వాటాలను సొంతం చేసుకుంది. జెనెసిస్‌ లగ్జరీ ఫ్యాషన్‌ ప్రైవేటు లిమిటెడ్‌లో 2.07 శాతం వాటా తీసుకుంది. ఈ కొనుగోళ్లు రిటైల్‌ పరిశ్రమలో రిలయన్స్‌ రిటైల్‌ స్థానం బలోపేతం అయ్యేందుకు తోడ్పడతాయని, ఇందుకు నియంత్రణ సంస్థల ఆమోదం అవసరం లేదని ఆర్‌ఐఎల్‌ తెలిపింది. 
16.31 శాతం వాటా సొంతం
న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఆర్‌వీఎల్‌) తన వ్యాపార ప్రయోజనాలను విస్తృతం చేసే క్రమంలో పలు  కంపెనీల్లో పెట్టుబడుల ద్వారా వాటాలు సొంతం చేసుకుంది. రెడీమేడ్‌ వస్త్రాల రిటైల్‌, హోల్‌సేల్‌ కంపెనీ జెనెసిస్‌ కలర్స్‌ లిమిటెడ్‌ (జీసీఎల్‌)లో 16.31 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ వాటాల కోసం రూ.34.80 కోట్లు ఖర్చు చేసింది. జెనెసిస్‌ కలర్స్‌లో రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ అనుబంధ రిలయన్స్‌ బ్రాండ్స్‌కు ఇప్పటికే 49.46 శాతం వాటా ఉంది. తాజా పెట్టుబడులతో మొత్తం మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా రిలయన్స్‌ రిటైల్‌కు జీసీఎల్‌లో 65.77 శాతం వాటా ఉంటుంది. మరో ఐదు కంపెనీల్లోనూ రిలయన్స్‌ రిటైల్‌ వాటాలు కొనుగోలు చేసింది. ఇందుకు రూ.57.03 కోట్లు వ్యయం చేసింది. ఈ కంపెనీలన్నీ రెడీమేడ్‌ వస్త్రాలు, బ్యాగులు, పాదరక్షల హోల్‌సేల్‌, రిటైల్‌ వ్యాపారంలో ఉన్నవే. జీఎల్‌ఎఫ్‌ లైఫ్‌స్టయిల్‌ బ్రాండ్స్‌, జెనెసిస్‌ లా మోడ్‌, జీఎంఎల్‌ ఇండియా ఫ్యాషన్‌, జీఎల్‌బీ బాడీ కేర్‌ కంపెనీల్లో  50 శాతం చొప్పున వాటాలను సొంతం చేసుకుంది. జెనెసిస్‌ లగ్జరీ ఫ్యాషన్‌ ప్రైవేటు లిమిటెడ్‌లో 2.07 శాతం వాటా తీసుకుంది. ఈ కొనుగోళ్లు రిటైల్‌ పరిశ్రమలో రిలయన్స్‌ రిటైల్‌ స్థానం బలోపేతం అయ్యేందుకు తోడ్పడతాయని, ఇందుకు నియంత్రణ సంస్థల ఆమోదం అవసరం లేదని ఆర్‌ఐఎల్‌ తెలిపింది. You may be interested

2020 నాటికి రూ.20 లక్షల కోట్లకు

Monday 10th September 2018

న్యూఢిల్లీ: దేశీయ బీమా రంగం 2019-20 సంవత్సరానికి 280 బిలియన్‌ డాలర్ల (రూ.20 లక్షల కోట్లు) స్థాయికి చేరుతుందని, కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఆయుష్మాన్‌ భారత్‌ పథకం, ఖర్చు చేసే ఆదాయం పెరగడం, బీమాపై అవగాహన పెరగడం వృద్ధికి కారణాలుగా అసోచామ​-ఏపీఏస్‌ అధ్యయనం పేర్కొంది. ‘‘బీమా విస్తరణ దేశంలో 2001 నాటికి 2.71 శాతంగా ఉంటే, 2017 నాటికి 3.7 శాతానికి పెరిగింది. 2011-12లో బీమా సంస్థల స్థూల ప్రీమియం

చైనా స్టీల్‌పై యాంటీ డంపింగ్‌ సుంకం

Monday 10th September 2018

న్యూఢిల్లీ: చైనా నుంచి చౌకగా వచ్చి పడుతున్న స్టీల్‌ ఉత్పత్తుల నుంచి దేశీయ కంపెనీలను కాపాడేందుకు కేంద్రం యాంటీ డంపింగ్‌ సుంకం విధించే అవకాశాలు ఉన్నాయి. కొన్ని రకాల చైనా స్టీల్‌పై ఒక్కోటన్నుకు 185.51 డాలర్ల వరకు ఈ యాంటీ డంపింగ్‌ సుంకాన్ని ఐదేళ్ల పాటు విధించనుంది. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, సన్‌ఫ్లాగ్‌ ఐరన్‌ అండ్‌ స్టీల్‌, ఉషా మార్టిన్‌, గెర్డావ్‌ స్టీల్‌ ఇండియా, వర్ధమాన్‌ స్పెషల్‌ స్టీల్స్‌, జయస్వాల్‌ నెకో

Most from this category