STOCKS

News


జియో 100% క్యాష్‌ బ్యాక్‌

Saturday 29th December 2018
news_main1546055284.png-23300

న్యూఢిల్లీ: టెలికం సంస్థ రిలయన్స్ జియో నూతన సంవత్సర ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. రూ. 399తో రీచార్జ్ చేసుకుంటే 100 శాతం క్యాష్‌ బ్యాక్ పొందవచ్చని పేర్కొంది. ఈ-కామర్స్ పోర్టల్‌ ఏజియో కూపన్స్ రూపంలో ఇది లభిస్తుంది. మైజియో యాప్‌లోని 'మైకూపన్స్‌' సెక్షన్‌లో ఈ కూపన్‌ క్రెడిట్ అవుతుందని... ఏజియో (AJIO) యాప్‌లో లేదా వెబ్‌సైట్‌లో షాపింగ్ చేసినప్పుడు దీన్ని రిడీమ్ చేసుకోవచ్చునని కంపెనీ తెలిపింది. కాకపోతే ఇందుకోసం కనీసం రూ. 1,000 మేర కొనుగోళ్లు జరపాల్సి ఉంటుంది. ఏజియో వెబ్‌సైట్‌లో లభించే డిస్కౌంటుకు ఇది అదనం. డిసెంబర్‌ 28 - 2019 జనవరి 31 మధ్యలో పాత, కొత్త యూజర్లు చేయించుకునే రీచార్జ్‌లకు ఇది వర్తిస్తుంది. ఈ కూపన్స్‌ను మార్చి 15 లోగా రిడీమ్ చేసుకోవచ్చు.



You may be interested

ప్రాక్టీస్‌ కోసం.. ఇంటర్వ్యూ బడ్డీ!

Saturday 29th December 2018

- మన దేశంతో పాటూ అమెరికా, బ్రెజిల్, అర్జెంటీనాలోనూ సేవలు - త్వరలో ఐఐటీ, ఐఐఎంలతో పాటు, కంపెనీలతోనూ ఒప్పందం - 6 నెలల్లో రూ.15 కోట్ల నిధుల సమీకరణ పూర్తి - ‘స్టార్టప్‌ డైరీ’తో ఇంటర్వ్యూబడ్డీ ఫౌండర్‌ ఉజ్వల్‌ ప్రాక్టీస్‌ మేక్స్‌ పర్‌ఫెక్ట్‌! ఇదో నానుడే కాదు. వ్యాపార సూత్రం కూడా. ఇంటర్వ్యూబడ్డీ చేసేదిదే!!. దేశ, విదేశాల్లోని బహుళ జాతి కంపెనీల వైస్‌ ప్రెసిడెంట్స్, హెచ్‌ఆర్‌ ప్రతినిధులతో పాటూ రిటైర్డ్‌ ఐఏఎస్‌ వంటి ఉన్నతాధికారులతో

తిరోగామి నిబంధనలివి

Saturday 29th December 2018

- కొనుగోలుదారులకు ప్రతికూలం - ఈ-కామర్స్ నిబంధనలతో అనిశ్చితి - అమెరికా-భారత్ ఫోరం విమర్శలు న్యూఢిల్లీ: ఈ-కామర్స్‌ సంస్థల నిబంధనలను కఠినతరం చేయడంపై పరిశ్రమ వర్గాల నుంచి విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా అమెరికా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం (యూఎస్‌ఐఎస్‌పీఎఫ్‌) స్పందించింది. ఇవి "తిరోగామి" నిబంధనలంటూ శుక్రవారం వ్యాఖ్యానించింది. వీటివల్ల కొనుగోలుదారుల ప్రయోజనాలకు భంగం కలగడంతో పాటు అనిశ్చితి నెలకొంటుందని పేర్కొంది. ఫలితంగా భారత్‌లో ఆన్‌లైన్ రిటైల్‌ వృద్ధిపై ప్రతికూల ప్రభావాలు పడతాయని అభిప్రాయపడింది. ప్రభుత్వాలు...

Most from this category