STOCKS

News


30 కోట్లు దాటిన జియో చందాదారులు

Monday 15th April 2019
news_main1555306794.png-25130

న్యూఢిల్లీ: రిలయన్స్‌ జియో చందాదారుల సంఖ్య 30 కోట్లను అధిగమించింది. కార్యకలాపాలు ఆరంభించిన రెండున్నరేళ్లలో ఈ మైలురాయిని చేరుకోవడం గమనార్హం. మార్చి 2న ఇది సాధ్యమైనట్టు కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఐపీఎల్‌ సీజన్లో 30 కోట్ల యూజర్ల మార్క్‌పై కంపెనీ టెలివిజన్‌ ప్రకటనలు కూడా ఇస్తోంది. 10 కోట్ల మంది చందాదారులను వాణిజ్య కార్యకలాపాలు ఆరంభించిన తర్వాత కేవలం 170 రోజుల్లోనే సొంతం చేసుకుని జియో గతంలోనే రికార్డు నమోదు చేసింది. మరోవైపు ప్రత్యర్థి కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌కు జనవరి నాటికి 34 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. 30 కోట్ల కస్టమర్ల మైలు రాయిని చేరుకునేందుకు ఎయిర్‌టెల్‌కు 19 ఏళ్లు పట్టిన విషయం గమనార్హం. వొడాఫోన్‌ ఐడియా 40 కోట్ల మంది యూజర్లతో ప్రస్తుతం అతిపెద్ద టెలికం కంపెనీగా ఉండగా, ఎయిర్‌టెల్‌ రెండో స్థానంలో ఉంది. త్వరలో ఎయిర్‌టెల్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానాన్ని జియో సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 



You may be interested

తుది దశలో చైనా-అమెరికా వాణిజ్య చర్చలు

Monday 15th April 2019

వాషింగ్టన్‌: వాణిజ్య వివాదాల పరిష్కారానికి సంబంధించి అమెరికా - చైనా మధ్య చర్చలు దాదాపు తుది దశకు చేరుకున్నాయి. ఒప్పందం అమలు తీరుతెన్నులే అన్నింటికన్నా పెద్ద సమస్యగా తయారైందని, ఇది దాదాపు పరిష్కారమైనట్లేనని అమెరికా ఆర్థిక మంత్రి స్టీవెన్ మినుచిన్ తెలిపారు. ఇరు దేశాల మధ్య దాదాపు నలభై ఏళ్లుగా కొనసాగుతున్న ఆర్థిక బంధంలో ఇది పెద్ద మార్పు తేగలదని ఆయన పేర్కొన్నారు. "వివాదాల పరిష్కార సాధనలో తుది దశకు

దీర్ఘకాలిక రాబడులు భేష్‌

Monday 15th April 2019

దీర్ఘకాలిక రాబడులు భేష్‌ రిలయన్స్‌ స్మాల్‌క్యాప్‌ ఫండ్‌ ఏడాది కాలంలో మిడ్‌, స్మాల్‌క్యాప్‌ కంపెనీల షేర్లు చాలా వరకు నష్టపోయాయి. దీంతో దీర్ఘకాల పెట్టుబడి అవకాశాల దృష్ట్యా కొన్ని ఆకర్షణీయంగా మారాయి. మిడ్‌, స్మాల్‌క్యాప్‌ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారు ఈ సమయంలో ఆయా విభాగాలకు చెందిన మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలను నమ్ముకోవడం ద్వారా తగిన ప్రతిఫలాన్ని అందుకోవచ్చు. ఆ విధంగా చూసినప్పుడు రిలయన్స్‌ స్మాల్‌క్యాప్‌ పథకం కూడా ఒక ఎంపిక అవుతుంది.

Most from this category