STOCKS

News


ఫిబ్రవరిలో జియో, బీఎస్‌ఎన్‌ఎల్‌దే హవా

Friday 19th April 2019
news_main1555649766.png-25216

న్యూఢిల్లీ: దేశీ టెలికం సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఫిబ్రవరి చివరినాటికి 120.50 కోట్లకు చేరింది. జనవరిలో ఈ సంఖ్య 120.37 కోట్లుగా ఉన్నట్లు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ట్రాయ్‌) వెల్లడించింది. రిలయన్స్‌ జియో, ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ జోరు కారణంగానే వినియోగదారుల సంఖ్య ఈమేరకు పెరిగినట్లు ట్రాయ్‌ పేర్కొంది. ఈ రెండు దిగ్గజ సంస్థలు కలిపి ఫిబ్రవరిలో 86.39 లక్షల కస్టమర్లను జోడించగా.. మిగిలిన టెలికం కంపెనీలు 69.93 లక్షల వైర్‌లెస్‌ కస్టమర్లను కోల్పోయాయి. అత్యధికంగా వినియోగదారులను కోల్పోయిన కంపెనీల జాబితాలో.. వొడాఫోన్‌ ఐడియా తొలి స్థానంలో ఉన్నట్లు తేలింది. ఒక్క జియోనే ఫిబ్రవరిలో 77.93 లక్షల వినియోగదారులను జోడించి.. అనతికాలంలోనే ఏకంగా 30 కోట్ల సబ్‌స్క్రైబర్ల రికార్డును సొంతం చేసుకుంది. ఇదే సమయంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ 9 లక్షల మందిని జోడించి కస్టమర్ల బేస్‌ను 11.62 కోట్లకు చేర్చింది. ఈ అంశంపై బీఎస్‌ఎన్‌ఎల్‌ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ‘మా సేవల పట్ల కస్టమర్లకు ఉన్న విశ్వాసం వల్లనే బేస్‌ పెరిగింది. సంస్థ 3జీ నెట్‌వర్క్‌ మరింత మెరుగుపడింది’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు వొడాఫోన్‌ ఐడియా 57.87 లక్షల సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. ఫిబ్రవరి చివరినాటికి ఈ సంస్థ వినియోగదారుల సంఖ్య 40.93 కోట్లకు తగ్గినట్లు ట్రాయ్‌ తాజా గణాంకాల ద్వారా వెల్లడైంది.You may be interested

జెట్ ‍బిడ్డింగ్ విజయవంతమవుతుంది

Friday 19th April 2019

- రుణదాతల ఆశాభావం - షేరు 32 శాతం పతనం న్యూఢిల్లీ:  ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌లో వాటాల విక్రయానికి సంబంధించి బిడ్డింగ్ ప్రక్రియ విజయవంతమవుతుందని రుణాలిచ్చిన సంస్థలు ఆశాభావం వ్యక్తం చేశాయి. "సంస్థ విలువను సముచితంగా, పారదర్శకంగా మదింపు చేసేలా బిడ్ ప్రక్రియ విజయవంతం అవుతుందని రుణదాతలు ఆశావహంగా ఉన్నారు" అని బ్యాంకర్ల కన్సార్షియం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. దాదాపు రూ. 8,000

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ‘రికార్డ్‌’ లాభం

Friday 19th April 2019

- రిటైల్‌, టెలికం విభాగాల జోరు  - 10 శాతం పెరిగిన క్యూ4 నికర లాభం - 19 శాతం వృద్ధితో రూ.1,54,110 కోట్లకు ఆదాయం - తగ్గిన జీఆర్‌ఎమ్‌ - రిలయన్స్‌ జియోకు 30 కోట్ల వినియోగదారులు  - ఒక్కో షేర్‌కు రూ.6.50 డివిడెండ్‌ న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గత ఆర్థిక సంవత్సరం మార్చి క్వార్టర్‌లో రికార్డ్‌ స్థాయిలో రూ.10,362 కోట్ల నికర లాభాన్ని (కన్సాలిడేటెడ్‌)ఆర్జించింది. రిటైల్‌, టెలికం విభాగాలు మంచి పనితీరు సాధించడంతో రిలయన్స్‌ నికర

Most from this category