STOCKS

News


రూ. 133 కోట్లు డిఫాల్ట్‌ అయిన ఆర్‌ఇన్‌ఫ్రా

Friday 24th August 2018
news_main1535089408.png-19586

న్యూఢిల్లీ: దాదాపు రూ.133.38 కోట్ల నాన్‌-కన్వర్టబుల్ డిబెంచర్లకు (ఎన్‌సీడీ) సంబంధించిన చెల్లింపులు జరపడంలో రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ఆర్‌ఇన్‌ఫ్రా) విఫలమైంది. ఆగస్టు 20న ఈ చెల్లింపులు జరపాల్సి ఉంది. అయితే, తమ ముంబై విద్యుత్ వ్యాపార విభాగాన్ని అదానీ ట్రాన్స్‌మిషన్‌కి విక్రయించగా వచ్చే రూ.18,800 కోట్ల నుంచి మరికొద్ది రోజుల్లో ఈ చెల్లింపులు జరుపుతామని సంస్థ పేర్కొంది. అదానీ డీల్ ద్వారా వచ్చే మొత్తం నిధులను ఈ తరహా రుణాల చెల్లింపు కోసం కేటాయించినట్లు స్టాక్‌ ఎక్స్చేంజీలకు ఆర్‌ఇన్‌ఫ్రా వివరించింది. ఇదే విషయాన్ని డిబెంచర్‌ హోల్డర్స్‌కు కూడా ఇప్పటికే తెలియజేసినట్లు పేర్కొంది. గురువారం బీఎస్‌ఈలో ఆర్‌ఇన్‌ఫ్రా షేరు 1.46 శాతం క్షీణించి రూ. 413.75 వద్ద క్లోజయ్యింది. 



You may be interested

యాప్స్‌ను నిషేధించం: టెలికం శాఖ

Friday 24th August 2018

న్యూఢిల్లీ: ఫేస్‌బుక్‌, వాట్స్‌యాప్‌, టెలీగ్రామ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి మెసేజింగ్‌ యాప్‌లపై నిషేధం విధించడం తమ ఉద్దేశం కాదని కేంద్ర టెలికం శాఖ కార్యదర్శి అరుణ సుందరరాజన్‌ వివరణ ఇచ్చారు. కేవలం పక్కదారి పడుతున్న అంశాలను కట్టడి చేయడం పైన మాత్రమే తాము దృష్టిసారించామని వెల్లడించారు. దుర్వినియోగం అవుతున్న సమాచారానికి అడ్డుకట్ట వేయడం కోసం కృషిచేస్తున్నట్లు మీడియాకు తెలిపారు. ‘ఒక మెసేజ్‌ ఎక్కడ నుంచి మొదలైందని తెలుసుకోవడం కోసమే వ్యవస్థను ఏర్పాటుచేయమని

ఇన్ఫీలో అమెరికన్లకు పెద్దపీట

Friday 24th August 2018

న్యూఢిల్లీ: దేశీయ రెండవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌ భారీస్థాయిలో అమెరికా పౌరులకు ఉద్యోగాలను కల్పించింది. 2017 మార్చి నుంచి ఇప్పటి వరకు తమ సంస్థలో 4,700 మంది యూఎస్‌ పౌరులను నియమించుకున్నట్లు ప్రకటించింది. వీరిలో 500 మంది ఉత్తర కరొలినా రాజధాని రాలీగ్‌లో ఉన్నటువంటి ప్రాంతీయ సాంకేతిక కేంద్రంలో నియమితులైనట్లు తెలిపింది. కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్‌), క్లౌడ్, బిగ్‌ డేటా, డిజిటల్ టెక్నాలజీస్,

Most from this category