News


రూ.3,000 కోట్లను సమీకరించిన ఆర్‌ఐఎల్‌

Saturday 10th November 2018
news_main1541829005.png-21851

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) నాన్‌ కన్వర్టబుల్‌ రెడీమబుల్‌ డిబెంచర్ల జారీ ద్వారా రూ.3,000 కోట్లను సమీకరించినట్టు ప్రకటించింది. 10 ఏళ్ల కాలానికి గడువు తీరే అన్‌ సెక్యూర్డ్‌, నాన్‌ కన్వర్టబుల్‌ రెడీమబుల్‌ డిబెంచర్లపై 8.95 శాతం వడ్డీని ఆఫర్‌ చేసినట్టు స్టాక్‌ ఎక్సేంజ్‌లకు ఆర్‌ఐఎల్‌ తెలిపింది. 2028 నవంబర్‌ 9న ఇవి గడువు తీరతాయని పేర్కొంది. ఇంధనం, పెట్రోకెమికల్‌, రిటైల్‌, టెలికం విభాగాల్లో గడిచిన ఐదేళ్ల కాలంలో రిలయన్స్‌ 30 బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టింది. బ్రాడ్‌బ్యాండ్‌ విభాగంలో బలపడేందుకు గాను హాత్‌వే కేబుల్‌ అండ్‌ డేటాకామ్‌, డెన్‌ నెట్‌వర్క్స్‌లో మెజారిటీ వాటాల కొనుగోలుకు గత నెలలో ఒప్పందాలు కూడా చేసుకుంది. You may be interested

పుంజుకున్న ప్యాసింజర్‌ వెహికల్స్‌ అమ్మకాలు

Saturday 10th November 2018

న్యూఢిల్లీ: దేశీయంగా ప్రయాణికుల వాహన (ప్యాసింజర్‌ వెహికల్స్‌/కార్లు, జీపులు) విక్రయాలు అక్టోబర్‌ నెలలో ఫర్వాలేదనిపించాయి. వరుసగా మూడు నెలల క్షీణత తర్వాత అక్టోబర్‌లో అమ్మకాలు పుంజుకున్నాయి. 1.55 శాతం మేర వృద్ధి నమోదైనట్టు ఆటోమొబైల్‌ తయారీదారుల సంఘం (సియామ్‌) తెలిపింది. సియామ్‌ విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే... అక్టోబర్‌లో ప్యాసింజర్‌ వెహికల్స్‌ విక్రయాలు 2,84,224 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే మాసంలో అమ్ముడైనవి 2,79,877 కావడం గమనార్హం. ఈ

అమరరాజా మధ్యంతర డివిడెండు 200 శాతం

Saturday 10th November 2018

అమరరాజా బ్యాటరీస్‌ సెప్టెంబరు త్రైమాసికం స్టాండలోన్‌ ఫలితాల్లో నికరలాభం క్రితంతో పోలిస్తే రూ.127 కోట్ల నుంచి రూ.120 కోట్లకు వచ్చి చేరింది. టర్నోవరు రూ.1,440 కోట్ల నుంచి రూ.1,767 కోట్లకు ఎగసింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.2 మధ్యంతర డివిడెండు చెల్లించాలని నిర్ణయించింది. డిసెంబరు 9 లోగా ఈ మొత్తాన్ని చెల్లించనుంది. రూ.540 కోట్ల మూలధన వ్యయానికి బోర్డు సమ్మతించింది. ఈ

Most from this category