STOCKS

News


రిలయన్స్ ఎంఏ చమురు క్షేత్రం మూసివేత

Saturday 22nd September 2018
news_main1537592646.png-20467

న్యూఢిల్లీ: కేజీ-డీ6 బ్లాక్‌లోని ఏకైక ఎంఏ చమురు క్షేత్రాన్ని శాశ్వతంగా మూసివేస్తున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ శుక్రవారం తెలిపింది. ఇందులో ఉత్పత్తి పూర్తిగా నిల్చిపోవడమే ఇందుకు కారణమని పేర్కొంది. భారీగా నీరు, ఇసుక వచ్చి చేరుతుండటంతో ఈ క్షేత్రంలో కార్యకలాపాలు పెనుసవాలుగా మారాయని, దీంతో పాటు క్రమంగా ఉత్పత్తి కూడా క్రమంగా తగ్గిపోవడంతో సెప్టెంబర్ 17న ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేశామని రిలయన్స్ పేర్కొంది. కేజీ-డీ6 బ్లాక్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్‌ ఇప్పటిదాకా 19 చమురు, గ్యాస్ క్షేత్రాలను కనుగొంది. వీటిలో ఏకైక చమురు క్షేత్రమైన ఎంఏ (డీ6) నుంచి 2008 సెప్టెంబర్‌లో తొలిసారిగా ఉత్పత్తిని ప్రారంభించింది. 2010లో గరిష్టంగా 1,08,418 టన్నుల ముడిచమురు ఉత్పత్తి కాగా.. ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్ క్వార్టర్‌లో 1,960 టన్నులకు పడిపోయింది. ఈ క్షేత్రంలో 2009 ఏప్రిల్ నుంచి గ్యాస్ ఉత్పత్తి కూడా ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత ఇసుక, నీరు వచ్చి చేరడంతో బావులను మూసివేయాల్సి వచ్చింది. 



You may be interested

ఆధునిక్‌ ఇండస్ట్రీస్‌పై ఫోరెన్సిక్‌ ఆడిట్‌

Saturday 22nd September 2018

న్యూఢిల్లీ: స్టీల్‌ రంగంలోని ఆధునిక్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ ఖాతాలపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహణకు సెబీ శుక్రవారం ఆదేశించింది. అనుమానిత 331 షెల్‌ కంపెనీల్లో ఈ కంపెనీ కూడా ఉంది. దీంతో ఈ కంపెనీ ఖాతా పుస్తకాల్లో దుర్వినియోగం జరిగినట్టు అనుమానిస్తున్న సెబీ ఫోరెన్సిక్‌ ఆడిట్‌కు ఆదేశించడం గమనార్హం. ఓ స్వతంత్ర ఫోరెన్సిక్‌ ఆడిటర్‌ను నియమించాలని స్టాక్‌ ఎక్సేంజ్‌లను ఆదేశించింది. కంపెనీ ఆర్థిక వివరాలు, వ్యాపారాలకు సంబంధించి ఏదైనా తప్పుదోవ పట్టించడం

వచ్చే వారం 3 ఐపీఓలు..

Saturday 22nd September 2018

ముంబై:- వచ్చే వారం మూడు కంపెనీలు ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు రానున్నాయి. ప్రభుత్వ రంగ గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజనీర్స్‌ కంపెనీ, నాన్-బ్యాకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ అవాస్‌ ఫైనాన్షియర్స్‌, దినేష్‌ ఇంజనీర్స్‌లు ఐపీఓ ద్వారా రూ.2,264 కోట్ల నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. అయితే ఐపీఓలు ఎంతవరకు విజయవంతమవుతాయనే అంశంపై అనుమానాలు నెలకొన్నాయి. ఇందుకు ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు కారణమవుతున్నాయి. స్టాక్‌మార్కెట్‌ ఈ సెప్టెంబర్‌లో మూడు

Most from this category