STOCKS

News


న్యూజ్‌లో వాటా కొన్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌

Thursday 29th November 2018
news_main1543469194.png-22469

న్యూఢిల్లీ: మీడియా స్టార్టప్‌ న్యూ ఎమర్జింగ్‌ వరల్డ్‌ ఆఫ్‌ జర్నలిజమ్‌లో (న్యూజ్‌) మెజారిటీ వాటాను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన కంపెనీ కొనుగోలు చేసింది. రిలయన్స్‌కు చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రియల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అండ్‌ హోల్డింగ్స్‌ లమిటెడ్‌(అర్‌ఐఐహెచ్‌ఎల్‌) ఈ వాటాను రూ. 1.03 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ డీల్‌లో భాగంగా 30 వేల ఈక్విటీ షేర్లను, 125 కంపల్సరీ కన్వర్టబుల్‌ డిబెంచర్లను ఆర్‌ఐఐహెచ్‌ఎల్‌ కొనుగోలు చేసింది. దీంతో ఇక నుంచి న్యూజ్‌ సంస్థ ఆర్‌ఐఐహెచ్‌ఎల్‌ అనుబంధ సంస్థగా కొనసాగుతుందని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తెలిపింది. స్మార్ట్‌ఫోన్లను అధికంగా వాడే యువజనులు లక్ష్యంగా వీడియో కంటెంట్‌ను న్యూజ్‌ సంస్థ అందిస్తోంది. శలభ్‌ ఉపాధ్యాయ్‌, ఇతర యువ ఎంటర్‌ప్రెన్యూర్ల టీమ్‌ న్యూజ్‌ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. 



You may be interested

రీచార్జ్‌ చేయకుంటే కనెక్షన్‌ కట్‌!!

Thursday 29th November 2018

న్యూఢిల్లీ: రిలయన్స్‌ జియో రాకతో కకావికలమైన టెల్కో కంపెనీలు తమ ఆదాయాలను మెరుగుపర్చుకునే ప్రయత్నాలపై దృష్టి సారిస్తున్నాయి. ఫలితంగా ప్రీ–పెయిడ్‌ యూజర్ల నెత్తిన తప్పనిసరి కనీస రీచార్జ్‌ పిడుగు పడేశాయి. ఇప్పటిదాకా ఇస్తున్న  లైఫ్‌టైమ్‌ వేలిడిటీని పక్కన పెట్టి ప్రతి నెలా కచ్చితంగా నిర్దిష్ట మొత్తంలో రీచార్జ్‌ చేసుకోవాల్సిందేనని లేకపోతే సర్వీసులు డిస్‌కనెక్ట్‌ చేస్తామని ఎస్‌ఎంఎస్‌లు పంపిస్తున్నాయి. రీచార్జ్‌ల కోసం టెల్కో దిగ్గజాలు ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సంస్థలు 28

ఐదేళ్లలో 6,500 చార్జింగ్‌ స్టేషన్లు

Thursday 29th November 2018

ముంబై: ఈవీ మోటార్స్‌ ఇండియా కంపెనీ ఐదేళ్లలో 6,500 చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నది. ప్లగ్‌ఎన్‌గో పేరుతో ఈ చార్జింగ్‌ స్టేషన్లను డీఎల్‌ఎఫ్‌, ఏబీబీ ఇండియా, డెల్టా ఎలక్ట్రానిక్స్‌ కంపెనీల భాగస్వామ్యంతో  ఏర్పాటు చేయనున్నామని ఈవీ మోటార్స్‌ తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌ కోసం 20 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నామని ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ స్టార్టప్‌ తెలిపింది.  వివిధ నగరాల్లో వ్యాపార, నివాసిత ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు

Most from this category