News


రిలయన్స్‌ క్యాపిటల్‌ లాభం రూ.272 కోట్లు

Wednesday 12th September 2018
news_main1536731090.png-20196

న్యూఢిల్లీ: రిలయన్స్‌ క్యాపిటల్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ క్వార్టర్‌లో రూ.272 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ. 378 కోట్ల నికర నష్టాలు వచ్చాయని అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ క్యాపిటల్‌ తెలిపింది. గత క్యూ1లో రూ.4,444 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.4,641 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఈ క్యూ1లో షేర్‌ వారీ ఆర్జన(ఈపీఎస్‌) రూ.11.70గా ఉందని తెలిపింది. ఈ ఏడాది జూన్‌ 30 నాటికి మొత్తం ఆస్తులు 7 శాతం వృద్ధితో రూ.87,041 కోట్లకు పెరిగాయని పేర్కొంది. అనుబంధ కంపెనీలు-రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌, రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ల ఫలితాలను దీంట్లో కలపలేదని వివరించింది. 

ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో రిలయన్స్‌ క్యాపిటల్‌ షేర్‌ స్వల్పంగా లాభపడి రూ.440 వద్ద ముగిశాయి. You may be interested

భారీ ఆస్తిపరులు 70 శాతం అప్‌!

Wednesday 12th September 2018

ముంబై: దేశంలో భారీ నికర ఆస్తులున్న వ్యక్తుల (డెమీ-బిలియనీర్లు) సంఖ్య గణనీయంగా పెరగనుందని ప్రముఖ అంతర్జాతీయ ప్రాపర్టీ కన్సల్టెంట్‌ నైట్‌ ఫ్రాంక్‌... తన తాజా నివేదికలో పేర్కొంది. నైట్‌ఫ్రాంక్‌ ఇండియా రూపొందించిన ఈ నివేదిక ప్రకారం 500 మిలియన్‌ డాలర్లు, ఆపైన నికర ఆస్తులున్న వారి సంఖ్య 2017లో 200. 2022 నాటికి ఈ సంఖ్య 340కి పెరుగుతుంది. నివేదికలో మరిన్ని వివరాలను చూస్తే...  ముంబై, ఢిల్లీ వంటి భారత్‌ ప్రధాన

నేను ఏ తప్పూ చేయలేదు

Wednesday 12th September 2018

న్యూఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అక్రమంగా తన ఆస్తులను అటాచ్‌ చేసిందని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) భారీ రుణ కుంభకోణ నిందితుడు మేహుల్‌ చోక్సీ ఆరోపించారు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని ఆయన వెల్లడించారు. ఆంటిగ్వా నుంచి పంపిన తొలి వీడియో మేసేజ్‌లో ఆయన ఈ విషయాలు పేర్కొన్నారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు చెందిన రూ.13,500 కోట్ల రుణ కుంభకోణంలో ప్రధాన వ్యక్తుల్లో ఒకరిగా అనుమానిస్తున్న మేహుల్‌ చోక్సీకి వ్యతిరేకంగా

Most from this category