STOCKS

News


రిలయన్స్‌ హోమ్‌ పైనాన్స్‌లో వాటా విక్రయానికి రిలయన్స్‌ క్యాపిటల్‌ చర్చలు

Monday 12th August 2019
news_main1565607792.png-27720

రిలయన్స్‌ హోమ్స్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌లో తన మెజారిటీ వాటాను విక్రయించేందుకు రిలయన్స్‌ క్యాపిటల్‌ సిద్ధమైంది. ఈ మేరకు నాలుగు ప్రముఖ కంపెనీలతో చర్చలు చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. వాటిలో వార్దే పాట్నర్స్‌ ఇంక్‌.., ఐయాన్‌ క్యాపిటల్‌, క్యాబెరీస్‌ క్యాపిటల్‌ మేనేజెంట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సం‍స్థలతో పాటు ఎన్బీబీసీ కంపెనీ ఆల్టికో క్యాపిటల్ ఇండియా లిమిటెడ్‌ కంపెనీలున్నాయి. రిలయన్స్‌ హోమ్ ఫైనాన్స్‌ ప్రస్తుతం బుక్‌లోన్‌ విలువ రూ.11,000 కోట్లుగా ఉంది. వీటిలో రీటైల్‌ రుణాలు రూ.4,500 కోట్లు, రీటైల్‌ హోల్‌సేల్‌ రుణాలు రూ.6,500లుగా ఉన్నాయి. కంపెనీ రెండు సంస్థలతో జరుపుతున్న చర్చలు తుది దశకు వచ్చాయి. ఒప్పందాన్ని సాధ్యమైనంత తొందర్లో ముగించడానికి కంపెనీ చూస్తుంది. సంస్థలో వాటాను విక్రయించి, 2020 నాటికి హోల్‌సేల్‌ రుణాల వ్యాపారాన్ని మూసివేయాలని ప్రణాళికతో ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఒక వ్యక్తి తెలిపారు.



You may be interested

మాంద్యానికి చేరువగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ

Monday 12th August 2019

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరోసారి మాంద్యం బారిన చిక్కుకునే ప్రమాదం ఉందని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం మోర్గాన్‌ స్టాన్లీ పేర్కొంది. మాంద్యానికి చేరువ అవుతోందని అభిప్రాయపడింది. భారత్‌ మాత్రం మాంద్యానికి దగ్గర్లో లేదని, మందగమనంలోనే ఉందని స్పష్టం చేసింది.    ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు చాలా బలహీనత చూపిస్తున్నాయని, తదుపరి దశ ప్రపంచ వ్యాప్తంగా మాంద్యమేనని భావిస్తున్నట్టు మోర్గాన్‌ స్టాన్లీ పేర్కొంది. ఇప్పటి నుంచి వచ్చే తొమ్మిది నెలల కాలంలో

అందరి దృష్టి ఆల్గోట్రేడింగ్‌ పైనే!

Monday 12th August 2019

విపరీతంగా పెరిగిపోతున్న ఆల్గోమెథడ్‌ కామన్‌ ట్రేడర్లకు కూడా అందుబాటులో టెక్నాలజీ ఇటీవల కాలంలో ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌పై ఆల్గోట్రేడింగ్‌(కంప్యూటర్ల ద్వారా ఆటోమేటిగ్గా ఆర్డర్లు ఎగ్జిక్యూట్‌ చేయడం) పెరిగిపోతోంది. ఆల్గోట్రేడింగ్‌తో టెక్‌ ట్రేడర్లకు మరింత పవర్‌ పెరిగింది. మార్కెట్లో వచ్చే అతి స్వల్ప వేగవంతమైన మార్పును కూడా ఒడిసిపట్టగలుగుతున్నారు. దీంతో మానవ సంబంధిత తప్పులు తగ్గాయి. కానీ ఇదే సమయంలో పెరిగిపోతున్న ఆల్గోట్రేడింగ్‌ క్రమంగా సాధారణ ట్రేడర్స్‌ను బెంబెలెత్తించి మార్కెట్‌కు దూరమయ్యేలా చేస్తోందంటున్నారు కొందరు నిపుణులు.

Most from this category